EPAPER

Best Gaming Smartphones: మంచి గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? రఫ్పాడించే Vivo గేమింగ్ ఫోన్స్.. ఇక చెడుగుడే!

Best Gaming Smartphones: మంచి గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? రఫ్పాడించే Vivo గేమింగ్ ఫోన్స్.. ఇక చెడుగుడే!

Best Vivo Gaming Smartphones: మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వినియోగదారుల దృష్టిని ఆకట్టుకునేందుకు ప్రముఖ కంపెనీలు కొత్త కొత్త మొబైళ్లను రిలీజ్ చేసి అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే మీరు ఎప్పట్నుంచో మంచి ఫీచర్లు కలిగిన గేమింగ్ ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇదే మంచి ఛాన్స్. ఎందుకంటే ఇప్పుడు మంచి ధరలో వివో కంపెనీకి చెందిన పలు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా మంది గేమింగ్ ఫోన్‌‌ను కొనుక్కోవడం కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తారు. కానీ దానిలో ఫీచర్స్ తెలుసుకోరు.


అందులో ఎంత ర్యామ్ ఉంది, ప్రాసెసర్ ఎంత శక్తివంతమైనది, అలాగే స్క్రీన్ ఎంత పెద్దది, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఎంత వంటి కొన్ని లక్షణాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా గేమింగ్ ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవలసిన కొన్ని ప్రాథమిక అంశాలు ఇవి. ప్రతి కంపెనీ పరిధిలో అనేక గేమింగ్ ఫోన్ మోడల్‌లు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ రోజు మనం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కొనుగోలు చేయగల Vivoకి సంబంధించిన ఉత్తమ గేమింగ్ ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.

Vivo V29 Pro


Vivo V29 ప్రో గేమింగ్‌ ఫోన్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరమైనది. ఇది సొగసైన డిజైన్ AMOLED డిస్ప్లే, 50MP + 12MP + 8MP బ్యాక్ కెమెరా.. అలాగే 50MP Front Cameraను కలిగి ఉంది. గేమింగ్ సమయంలో మంచి పనితీరును పొందడానికి, ఇది MediaTek డైమెన్సిటీ 8200 MT6896Z ప్రాసెసర్, 256 GB స్టోరేజ్, 6.7 అంగుళాల పెద్ద స్క్రీన్‌ని కలిగి ఉంది. Vivo X100 Pro 5Gతో పోల్చితే, ఇది 4600 mAh బ్యాటరీని కలిగి ఉంది. దీని ప్రాసెసర్‌ను గేమింగ్‌కు ఉత్తమంగా పిలుస్తారు. దీని ధర విషయానికొస్తే 12GB RAM+ 256GB Storage ధర రూ.39,990గా అమెజాన్‌లో ఉంది.

Also Read: ఫస్ట్ సేల్‌ స్టార్ట్.. రూ.29,500 భారీ డిస్కౌంట్.. మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు మిత్రమా..!

Vivo V29

Vivo V29 కూడా తన పనితీరుతో వినియోగదారుల్ని సంతృప్తి పరుస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్, 256 GB ఇంటర్నల్ మెమరీ, 50 MP + 8 MP + 2 MP వెనుక కెమెరా.. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4600 mAh బ్యాటరీతో పాటు సొగసైన డిజైన్‌తో అధిక రిజల్యూషన్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉన్న మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్. దీని 12GB RAM + 256GB Storage వేరియంట్ అమెజాన్‌లో రూ.32,999లకు లభిస్తుంది.

Vivo V23 5G

ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కూడిన Vivo V23 5G AF Eye టెక్నాలజీని కలిగి ఉంది. 2.5 GHz వేగంతో MediaTek డైమెన్షన్ 920 MT6877T ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది 44 వాట్ల సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. V23 5G 5G 6.4 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇందులో 64 MP + 8 MP + 2 MP వెనుక కెమెరా, 50 MP + 8 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే.. మీరు గేమింగ్ కోసం ఈ మోడల్‌ని ఎంచుకోవచ్చు. దీని 8 GB RAM + 128 GB ROM ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 25,480 (బ్లాక్ కలర్) అందుబాటులో ఉంది.

Also Read:Realme GT 7 Pro Lunch: రియల్‌మీ దుమ్ములేపింది.. కిల్లర్ ఫోన్ లాంచ్.. ఇది చాలా స్పెషల్ గురూ!

Vivo V25

Vivo V25 సూపర్‌ఫాస్ట్ 44 వాట్ ఛార్జర్‌ను కలిగి ఉంది. 90 Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రీన్‌ను కూడా కలిగి ఉంది. ఇది 256 GB స్టోరేజ్, 6.4 అంగుళాల AMOLED స్క్రీన్ 4000 mAh బ్యాటరీ, కెమెరా విభాగంలో.. 64 MP + 8 MP + 2 MP వెనుక కెమెరాను, అలాగే 50 MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. మీ బడ్జెట్ రూ. 30 వేల కంటే తక్కువగా ఉంటే.. మీరు ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ మార్కెట్ నుండి రూ. 25,290కి కొనుగోలు చేయవచ్చు. 8 GB RAM + 128 GB ROM ధర రూ.20,449 (Gold)గా ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది. వీటితో గేమింగ్ ఆడితే ఉంటది కదా.. అంతా చెడుగుడే.

Tags

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×