EPAPER

All Eyes on Rafah: ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’.. ఎందుకింత వైరల్ అవుతోంది..

All Eyes on Rafah: ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’.. ఎందుకింత వైరల్ అవుతోంది..

మా నెక్ట్స్‌ టార్గెట్‌ రఫానే.. అక్కడ శరణార్థుల ముసుగులో నక్కిన హమాస్‌ ఫైటర్లను ఏరివేస్తాం.. ఇది కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రకటనలు.. అన్నట్టుగానే చేసి చూపించింది.. ఇజ్రాయెల్‌ మిసైల్స్‌ రఫాపైకి దూసుకెళ్లాయి. ఈ దాడుల్లో 45 మంది మృతి చెందారు.. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. ఇది నిజంగా అమానుషం.. బతుకుజీవుడా అని పారిపోయి వచ్చి తలదాచుకుంటున్న శరణార్థుల శిబిరాలపై దాడులు చేయడం ఏంటి అసలు.. అది కూడా ఇంటర్నెషనల్ కోర్టు రఫా ఆపరేషన్‌ను నిలిపివేయాలని తీర్పు ఇచ్చిన మరునాడే ఈ దాడి చేయడం ఏంటి? అంటే ఎవ్వరేం చెప్పినా.. మేం చేయాలనుకున్నది చేస్తామన్న కండ కావరమా? ఇజ్రాయెల్ చేసిన దాడిని ప్రపంచ దేశాలు ఏకకంఠంతో ఖండించాయి.. అమెరికాతో సహా.. కానీ ఇజ్రాయెల్ మాత్రం తగ్గేదేలే అంటోంది.

ఇక్కడో చిన్న పాజ్ ఇద్దాం.. ఇప్పుడు All eyes on rafah పైకి వద్దాం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఇదో AI జనరేటెడ్ పిక్.. శరణార్థుల శిబిరాలపై ఇంగ్లీష్‌లో ఉన్నాయి ఈ లెటర్స్.. బట్ ఈ పిక్ చూపిస్తున్న ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. మన ఇండియాలోనే అనేక మంది సెలబ్రెటీలు ఈ పిక్‌ను షేర్ చేస్తున్నారు. పాలస్తీనా ప్రజలకు సంతాపం పలుకుతున్నారు. అలియా భట్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, వరుణ్ ధావన్, రష్మిక మందన్న, సోనాక్షి సిన్హా, సమంతా, త్రిప్తి డిమ్రీ, దియా మీర్జా, రిచా చద్దా.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా, ఇర్ఫాన్ పఠాన్.. ఇలా చాంతాడంత లిస్ట్ ఉంది.. పాలస్తీనాకు మద్ధతు పలికిన వారి సంఖ్య.. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది సెలబ్రెటీలు ఈ పిక్‌ను షేర్ చేశారు. ఇజ్రాయెల్‌ వదిలిన మిసైల్ రఫాపై చూపించిన ఎఫెక్ట్ ఎంతో తెలియదు కానీ..ఈ పిక్‌ చూపిస్తున్న ఎఫెక్ట్‌ దాని కంటే వంద.. కాదు కాదు.. వెయ్యి రేట్లు ఎక్కువనే చెప్పాలి..


Also Read: మీ స్ఫూర్తి మంట గలిచింది.. ఇంకా దేనికోసం మీ ఆరాటం: ఎర్డోగన్

నిజానికి ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రారంభించింది హమాస్‌పై.. ఇప్పుడు చేస్తుంది పాలస్తీనా ప్రజలపై.. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిప్రాయం.. ఇది తప్పు అని కూడా చెప్పడం లేదు ఇజ్రాయెల్.. మేం చేసిందే కరెక్ట్ అంటోంది.. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.ఇప్పుడు మరో వర్షన్ చూద్దాం.. రఫాపై దాడికి ముందు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.. ముందుగా ఆ ప్రాంతం నుంచి టెల్ అవీవ్.. అంటే ఇజ్రాయెల్‌ రాజధానిపైకి రాకెట్లు దూసుకొచ్చాయి. ఆ దాడులు చేసింది హమాస్.. ఈ అవకాశం కోసమే కాచుకొని కూర్చున్నది ఇజ్రాయెల్.. ఆ రాకెట్లను పక్కాగా అడ్డుకుంది.. ఎట్‌ ది సేమ్ టైమ్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. అయితే హమాస్ మెయిన్‌ లీడర్లను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్.. వారంతా శరణార్థుల మధ్యే ఉన్నారు. ఈ విషయం తెలుసు ఇజ్రాయెల్‌కు కూడా తెలుసు.. బట్ ప్రజల ప్రాణాల కంటే.. హమాస్‌ లీడర్లు చస్తే చాలనుకుంది ఇజ్రాయెల్.. మిసైల్స్‌ ప్రయోగించింది.. మరి ఈ దాడిలో వారు చనిపోయారా? లేదా? అన్నది ఇంతవరకు కన్ఫామ్ చేయలేదు ఇజ్రాయెల్.. బట్.. అభం శుభం తెలియని ప్రజలు, చిన్నారులు మాత్రం ప్రాణాలు వదిలారు..

ఇక రాజకీయానికి వద్ధాం.. ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని కొనసాగించాలంటే అమెరికాతో పాటు పశ్చిమాసియా దేశాల సపోర్ట్ చాలా అవసరం.. బట్.. ఇప్పటికే తాము యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నామని చెబుతోంది. అంటే నియర్ ఫ్యూచర్‌లో ఈ దేశాల నుంచి సహాయ నిరాకరణ జరిగినా.. ముందుకు వెళ్లేందుకే సిద్ధంగా ఉన్నామని చెప్పకనే చెబుతోంది ఇజ్రాయెల్.. పరిస్థితులు చూస్తే కూడా అదే నిజమనిపిస్తోంది. ఇప్పటికే ఇరాన్‌ ఓ వ్యూహాత్మకంగా ఓ గేమ్‌ను స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని ముందు ఉంచి అమెరికాను లాక్ చేయాలని చూస్తోంది. ఇజ్రాయెల్‌కు సపోర్ట్‌ చేస్తున్నది అమెరికానే.. ఇంత జరిగినా ఇజ్రాయెల్‌పై ఎలాంటి ఆంక్షలు విధించలేదు చూడండి అంటోంది. అంతేకాదు అమెరికా దౌత్య సిబ్బందిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించాలంటూ ఆదేశంలో డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అడ కత్తెరలో పోక చెక్కలా అమెరికా సిట్యూవేషన్‌ తయారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అమెరికా కొత్త రాగం ఎత్తుకుంది. ఇప్పటికి కూడా అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాల్లో ఎలాంటి మార్పు లేదు. పరిస్థితులు అలా మారాలంటే ఇంకా దారుణాలు జరగాలని చెప్పకనే చెబుతోంది. అంటే మరింత మారణహోమం జరిగే దాకా అమెరికా వేడుక చూస్తూనే ఉంటుందన్న మాట..

ఒకటి మాత్రం నిజం.. ఇజ్రాయెల్ దాడులు చేసింది. కానీ జస్ట్‌ రెండు, మూడు మిసైల్స్‌ మాత్రమే ప్రయోగించింది. కానీ రఫాపై దాడికి ఇప్పటికే టోటల్‌ ఆర్మీని రెడీ చేసింది. యుద్ధ ట్యాంక్‌లను మోహరించింది. క్షిపణులను లోడ్ చేసి ఉంచింది. ఏ క్షణమైనా వీరంతా రఫావైపు అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే.. జరిగే మారణహోమం అంతా ఇంతా కాదు. అప్పుడు ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి? ఇజ్రాయెల్‌ను అడ్డుకునేందుకు ఏం చేస్తాయి? ఇప్పుడీ ఆలోచనలే వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×