EPAPER

Erdogan: మీ స్ఫూర్తి మంట గలిచింది.. ఇంకా దేనికోసం మీ ఆరాటం: ఎర్డోగన్

Erdogan: మీ స్ఫూర్తి మంట గలిచింది.. ఇంకా దేనికోసం మీ ఆరాటం: ఎర్డోగన్

Erdogan hit out at the UNO: రఫాలో ఇజ్రాయెల్ జరిపిన పాశవిక దాడిపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో ఐక్యరాజ్య సమితి పనితీరును ఎండగట్టాడు. అంతేకాదు.. ఇస్లామిక్ ప్రపంచం దీనిపై స్పందించాలని ఆయన పేర్కొన్నారు.


‘ఐక్యరాజ్య సమితి కనీసం తన సిబ్బందిని కూడా రక్షించుకోలేకపోయింది. గాజాలో ఐక్యరాజ్య సమితి స్ఫూర్తి మంటగలిచింది. ఇంకా దేనికోసం వేచి చూస్తున్నది’ అంటూ తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.. రఫాపై ఇజ్రాయెల్ జరిపిన దాడి విషయమై ఐక్య రాజ్య సమితి భద్రాతమండలి సమావేశంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఈ సందర్భంగా తన తోటి ముస్లిం దేశాలు అవలంబిస్తున్న తీరును కూడా ఆయన తప్పుపట్టారు. ఉమ్మడిగా తీసుకునే నిర్ణయం విషయంలో ఇంకా ఎందుకోసం మీరు వేచి చూస్తున్నారంటూ ఆ దేశాలను ఎర్డోగన్ ప్రశ్నించారు. ఇజ్రాయెల్ ఒక్క గాజాకే కాదు.. మొత్తం మానవాళికే ముప్పు అంటూ ఆయన పేర్కొన్నారు. అది అంతర్జాతీయ చట్టాలను పట్టించుకోనంతకాలం ఏ ఒక్క దేశం కూడా సురక్షితం కాదు అంటూ ఎర్డోగన్ తెలిపారు.

అయితే, రఫాలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. దీంతో 45 మంది పాలస్తీనా పౌరులు మృతిచెందారు. 200 మందికి పైగా పౌరులు ఈ ఘటనలో గాయపడ్డారు. గాజా పోరులో ఇప్పటివరకు జరిగిన అత్యంత పాశవికమైన దాడుల్లో ఇది ఒకటి అంటూ పేర్కొంటున్నారు. కాగా, దాడి జరిగిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షితమైనదంటూ ఇజ్రాయెలే ప్రకటించింది.. ఇప్పుడు ఆ ప్రాంతంపైనే దాడి చేయడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలా విమర్శలు వస్తున్నా కూడా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గకుండా దాడులు చేస్తూ ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో సోమవారం, మంగళవారం మరో 37 మంది పాలస్తీనీయన్లు మృతిచెందారు.


Also Read: లంచాలు తీసుకునే అధికారులకు ఈ విషయం తెలిస్తే.. ఒంట్లో వణుకు పుట్టడం ఖాయం!

దాడులకు సంబంధించి, ఆ దాడుల్లో మృతిచెందినవారి వీడియోలు వెలుగులోకి వస్తున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. కాల్పులను మానకోవాలంటూ అభ్యర్థిస్తున్నారు.

Tags

Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×