EPAPER

South West Monsoon : కేరళలోకి నైరుతి ఆగమనం.. నాలుగైదు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు విస్తరణ

South West Monsoon : కేరళలోకి నైరుతి ఆగమనం.. నాలుగైదు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు విస్తరణ

South West Monsoon may Enters into Kerala in 24 hours : ఈశాన్య రాష్ట్రాల్లో రెమాల్ తుపాను బీభత్సం సృష్టించగా.. ఉత్తరాది రాష్ట్రాలను మండుటెండలు వణికిస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ చల్లటి వార్త చెప్పింది. మరికొద్దిగంటల్లోనే నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని వెల్లడించింది. అంచనా వేసిన సమయానికంటే ముందే నైరుతి వస్తుండటంతో ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


కేరళను నైరుతి తాకిన నాలుగైదు రోజుల్లోనే ఏపీ, తెలంగాణకు కూడా విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. నైరుతి రాకతో అగ్నిగోళంలా మండుతున్న రాష్ట్రాలు చల్లబడనున్నాయి. నైరుతి రుతుపవన కాలంలో వర్షాలు దంచికొట్టనున్నాయని పేర్కొన్నారు.

గతేడాది రుతుపవనాలు అంచనా వేసిన సమయానికంటే ఆలస్యంగా వచ్చాయని, ఇప్పుడు మాత్రం రుతుపవనాల వ్యాప్తికి వాతావరణం అనుకూలంగా ఉందని చెప్పారు. కాగా.. ఉపరితల ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో వారంరోజులుగా అక్కడక్కడా అడపాదడపా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇప్పుడు అంచనా వేసిన సమయానికి రుతుపవనాలు తీరాన్ని తాకి వర్షాలు పడితే.. వ్యవసాయ పనులను కూడా ప్రారంభించవచ్చని రైతన్నలు ఎదురుచూస్తున్నారు.


Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×