EPAPER

Priyanka Gandhi: దేశ సంపద ఆ బిలియనీర్ల చేతుల్లోనే.. : ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: దేశ సంపద ఆ బిలియనీర్ల  చేతుల్లోనే.. : ప్రియాంక గాంధీ

Lok Sabha Elections 2024: ప్రధాని మోదీ తన పాలనలో ఉపాధి కల్పనను పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె ప్రసంగించారు. విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి రాగానే చిన్న తరహా పరిశ్రమలను పోత్సహిస్తామని తెలిపారు.


చిన్న తరహా పరిశ్రమల రంగంలో ఉద్యోగాలను కల్పిస్తామని అన్నారు. ప్రధాని మోదీ తన పాలనలో ఉపాధి కల్పనను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. బీజేపీ విధానాలను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీజేపీ విధానాలకు చిన్న పరిశ్రమలు చితికిపోయేలా ఉన్నాయని తెలిపారు. కాషాయ పాలకుల విధానాలతో చిన్న పరిశ్రమలు చిన్నాభిన్నం అవుతుంటే..మరో వైపు బిలియనీర్లు సంపద పోగేసుకుంటున్నారని దుయ్యబట్టారు.

చిన్న, మధ్యతరగతి వ్యాపారాలను బలోపేతం చేయాలని అన్నారు. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తే వాటి ద్వారా చాలా మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. కోటీశ్వరులను బలోపేతం చేయడమమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని విమర్శించారు. దేశంలోని సంపద అంతా బిలియనీర్లకు నెమ్మదిగా అందజేస్తున్నారని ఆరోపించారు.


Also Read: ఈసారి సౌత్.. కన్యాకుమారిలో మోదీ బస, నార్త్ మాటేంటి?

మోదీ పాలనలో ఉపాధి కల్పన పనులు నిలిచిపోయాయని విమర్శించారు. గత 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగాన్ని దేశం ఎదుర్కొంటోంది తెలిపారు. దేశ వ్యాప్తంగా మొత్తం కోట్ల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. దీన్ని తొలగించాలంటే ప్రభుత్వాల తీరు మారాలి. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల పర్యాటక రంగానికి నష్టం వాటిల్లిందని ప్రియాంక గాంధీ అన్నారు.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×