EPAPER

Team India New Coach : కొత్త కోచ్ గా గంభీర్.. నిజమేనా?

Team India New Coach : కొత్త కోచ్ గా గంభీర్.. నిజమేనా?

Gautam Gambhir asTeam India New Coach : బీసీసీఐ నోరు మెదపదు.. ఎవరు కోచ్ పదవికి అప్లై చేశారో చెప్పదు. ఒకవైపున అందరూ లక్ష్మణ్ అంటుంటే, అతను పెదవి విప్పడం లేదు. బహుశా బీసీసీఐ నుంచి ఫోన్లు వెళితేనే, అప్పుడు ఆలోచిద్దామని అందరూ ఆగిపోయారా? అనేది తెలీదు. మరి ఎవరికి బీసీసీఐ ఫోన్లు చేసింది.. ఒకవైపున ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అంటాడు. ఇక్కడ రాజకీయాలెక్కువ.. రాహుల్ చెప్పాడు. నేను అందుకే అప్లై చేయలేదని అన్నాడు.


మాజీ ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ కూడా నాకు ఇంట్రస్ట్ లేదని అన్నాడు. ఇప్పుడు.. గౌతం గంభీర్ కాబోయే కొత్త కోచ్ అని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మరి అదెంత నిజమో తెలీడం లేదు. కోల్ కతా నైట్ రైడర్స్ ను గెలిపించిన తీరు, ఒక సాదాసీదాగా ఉన్న జట్టుని విజేతగా నిలిపిన తీరుతో అందరూ గౌతంని శభాష్ అంటున్నారు.

ఫ్రాంచైజీ ఓనర్ షారూఖ్ ఖాన్ చూస్తే గౌతం గంభీర్ కి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి పదేళ్లు నువ్వే మా మెంటర్ గా ఉండాలని చెప్పడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే గౌతం గంభీర్.. ఆ ఆఫర్ ని తీసుకోలేదు. ఒకవేళ బీసీసీఐ హెడ్ కోచ్ గా వస్తే కోల్ కతా ను వదిలేయాల్సి ఉంటుంది. ఆ కారణం చేతనే తీసుకోలేదని నెట్టింట కథలు అల్లేశారు.


Also Read : అంబటి రాయుడు ‘జోకర్ ’ఎందుకయ్యాడు?

మరోవైపున గౌతం గంభీర్ ఏమన్నాడంటే.. జట్టు సెలక్షన్ విషయంలో తనకి ప్రాధాన్యత ఉంటేనే, కోచ్ గా వస్తానని చెప్పాడంట. దానికి బీసీసీఐ ఓకే చెప్పిందంట. అంటే అక్కడ అర్థం ఏమిటంటే, జట్టులో ఆడినా ఆడకపోయినా రికమండేషన్లతో వచ్చే క్యాండిట్లకు చోటు ఇవ్వాలి. కాంపిటేషన్లకు పంపించాలి. అక్కడ ఓడిపోతే కెప్టెన్, కోచ్ బాధ్యత వహించాలి. ఈ ధోరణి మారాలి అనే కొత్త విధానానికి గంభీర్ తెరతీశాడని అంటున్నారు.

నిజానికి అదే జరిగితే, మంచిదే కదా.. సెలక్షన్ కమిటీలో గౌతం గంభీర్ కూడా ఉంటే, రాజకీయాలకు చోటు ఉండదు. బాగా ఆడేవారికి జాతీయ జట్టులో అవకాశాలు ఉంటాయి. వాళ్లు అప్పుడు రేస్ లోకి వెళ్లి విజయాలు సాధిస్తారని అంటున్నారు. ఏం జరుగుతుందో తెలీదు కానీ, నిత్యం గౌతం గంభీర్ పేరు మాత్రం వినిపిస్తోంది. ఇదిగో పైన చెప్పినట్టు రోజుకొక వార్తలతో నెట్టిల్లు వేడెక్కిపోతోంది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×