EPAPER

iQOO New Mobile: ఈసారి మామూలుగా ఉండదు.. ఐక్యూ నుంచి ప్రీమియం ఫోన్.. లాంచ్ అయితే తోపే!

iQOO New Mobile: ఈసారి మామూలుగా ఉండదు.. ఐక్యూ నుంచి ప్రీమియం ఫోన్.. లాంచ్ అయితే తోపే!

iQOO 13 Launch Soon: స్మార్ట్‌ఫోన్ కంపెనీ iQOOకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. కంపెనీ వరుసగా కొత్తకొత్త ఫోన్లను విడుదల చేస్తుంది. ఈ క్రమంతో తన బ్రాండ్ నుంచి దాని కొత్త ఫోన్ iQOO 13ను త్వరలో తీసుకురానుంది. కంపెనీ ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఇది iQOO 12 రిఫ్రెష్ వెర్షన్. ఈ ఫోన్ చాలా శక్తివంతమైనది ఉంటుంది. అలానే అద్భుతమైన ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. ఇంతలోనే IQoo 13 ఫోన్‌కు సంబంధించి కొన్ని కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. కాబట్టి రాబోయే స్మార్ట్‌ఫోన్ వివరాలను ఇప్పుడు చూద్దాం.


iQOO 13 స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. వాటి ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం 2800 x 1260 పిక్సెల్‌లు లేదా 1.5K రిజల్యూషన్‌తో ఫ్లాట్ OLED 8T LTPO డిస్‌ప్లేతో టెస్ట్ చేయబడిందిని Weiboలో షేర్ చేసిన టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ నుండి ఈ లీక్ వచ్చింది. ఫోన్ 16GB RAM+1TB స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ద్వారా శక్తిని పొందుతుంది. అంతే కాకుండా ఈ ఫోన్ పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుందని లీక్ సూచిస్తుంది. కానీ దాని ఖచ్చితమైన సామర్థ్యం వెల్లడి కాలేదు.

Also Read: దీనికి మాత్రం తిరగులేదు.. సామ్‌సంగ్ కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్లు నెక్ట్స్ లెవల్ అంతే!


లీక్‌లో IQoo 13 లాంచ్ గురించి ఎటువంటి సమచారం అందుబాటులో లేదు. అయినప్పటికీ అక్టోబర్ 2024లో స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 లాంచ్ తర్వాత ఇది మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్ర‌స్తుతం క‌చ్చితమైన విడుదల తేదీ వెల్ల‌డించ‌లేదు. కాబట్టి తాజా అప్‌డేట్‌ల కోసం వెయిట్ చేయాల్సి ఉంది.

మరొక టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు ప్రకారం iQOO 13 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని ప్యాక్ కలిగి ఉంటుంది. అయితే iQOO 12లో 5000mAh పవర్ బ్యాటరీ ఉంది. iQoo 12తో పోలిస్తే iQoo 13లో మీరు ఎక్కువ బ్యాటరీ లైఫ్ పొందుతారని దీని అర్థం. iQOO 13 సిరీస్‌లో కంపెనీ ప్రో మోడల్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది అధిక 2K రిజల్యూషన్‌తో కర్వ్‌డ్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది.

Also Read: పూనకాలు లోడింగ్.. ఐఫోన్ డిజైన్‌తో రియల్‌మీ నుంచి బడ్జెట్ ఫోన్.. జూన్ 5న సిద్ధమా?

iQOO 12 స్మార్ట్‌ఫోన్‌లో 2800 × 1260 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లే, HDR10+, 144Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 3000 nits పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది మెరుగైన గేమింగ్ అనుభవం  ఫ్రేమ్ రేట్‌ల కోసం Q1 చిప్‌సెట్ కలిగి ఉంది.

Tags

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×