EPAPER

10 Dead in Stone Quarry Collapses: మిజోరంలో కూలిన రాళ్ల క్వారీ.. 10 మంది మృతి..!

10 Dead in Stone Quarry Collapses: మిజోరంలో కూలిన రాళ్ల క్వారీ.. 10 మంది మృతి..!

10 Killed in Mizoram Quarry Collapse: సెవెన్ సిస్టర్ స్టేట్ మిజోరంకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రెమల్ తుఫాన్ కారణంగా భారీ నష్టం వాటిల్లింది. దీని ప్రభావం రాజధాని ఐజ్వాల్‌లో రెట్టించిన విషాదాన్ని మిగిల్చింది.


తుఫాన్ నుంచి తేరుకోకముందే తాజాగా దక్షిణ ప్రాంతమైన మెల్తుమ్, హ్లిమెన్‌ల సరిహద్దులోని రాళ్ల క్వారీ కుప్పకూలింది. మంగళవారం ఉదయం ఆరుగంటల సమయంలో ఘటన జరిగింది. వర్షాల ధాటికి రాళ్ల క్వారీ ఒక్కసారిగా కుప్పకూలింది. గనిలో చిక్కుకున్న 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. మృతుల్లో ముగ్గురు వేరే రాష్ట్రానికి చెందినవారు ఉన్నారు. మరికొందరు గనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు చెబుతున్న మాట.


సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్య్కూ టీమ్‌లు అక్కడికి చేరుకున్నాయి. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. కొండ ప్రాంతం కావడంతో ఈ క్వారీ ఎఫెక్ట్ చుట్టుపక్కల ఇళ్లపై పడింది. దీంతో భారీగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు.

Also Read: రంజిత్ సింగ్ హత్యకేసులో డేరా బాబాకు ఊరట.. నిర్దోషిగా తేల్చిన కోర్టు

ఘటన జరిగిన సమయంలో కార్మికులు ఎంత మంది ఉన్నారనేది గని నిర్వాహకులు చెప్పలేదు. శిధిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించే పనిలో సహాయక బృందాలు నిమగ్నమయ్యాయి. భారీగా వర్షాలు కురవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నమాట. దీనికితోడు కొండ చరియలు రెండురోజులుగా విరిగిపడుతున్నాయి. అయినా సరే నిర్వాహకులు రాళ్ల క్వారీలో పనులు కంటిన్యూ చేశారని అంటున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ప్రభుత్వం, సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

Tags

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×