EPAPER

US Hosting Men’s T-20 World Cup 2024: అమెరికాలో తొలిసారి.. టీ 20 ప్రపంచకప్ క్రికెట్ పోటీలు

US Hosting Men’s T-20 World Cup 2024: అమెరికాలో తొలిసారి.. టీ 20 ప్రపంచకప్ క్రికెట్ పోటీలు

First Time America Hosting the T20 World Cup 2024 Cricket Competitions: గత కొన్ని దశాబ్దాలుగా క్రికెట్ ను 8 నుంచి 10 దేశాలు మాత్రమే ఆడుతున్నాయి. అక్కడ మాత్రమే క్రికెట్ కి ఆదరణ ఉంది. మిగిలిన 185 దేశాల్లో ఎవరూ క్రికెట్ ని దగ్గరకు కూడా రానివ్వడం లేదు. అంతా ఫుట్ బాల్ , టెన్నీస్, లేదా నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఒలింపిక్ గేమ్స్. వీటిపైనే ఫోకస్ ఉంటుంది. అందుకోసం సన్నద్ధమవుతూ ఉంటారు. శర్వశక్తులు ఒడ్డుతుంటారు. అలా ఒలింపిక్స్ లో తమ దేశ ఖ్యాతిని ఇనుమడింపచేస్తుంటారు.


ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు కూడా ప్రశాంతంగా చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ, ఫ్యామిలీలతో సమయాన్ని గడుపుతుంటారు. నిజానికి ఫుట్ బాల్, టెన్నీస్ లాంటి ఆటలు రోజంతా ఉండవు. గంటా లేదా రెండు గంటల్లో ఫటాఫట్ తేలిపోతుంది. గెలిస్తే సంతోషించడం, ఓడితే కాసేపు తిట్టుకోవడం అంతే అక్కడితో అయిపోతుంది. రోజంతా పనులు మానుకొని, పెద్ద పెద్ద రీసెర్చ్ స్కాలర్లు తరహాలో డిస్కషన్స్, డిబేట్లు, స్టంట్లు ఉండవు. ముఖ్యంగా రంధ్రాన్వేషణ అస్సలు ఉండదు.

అయితే క్రికెట్ అంటే ఇష్టం లేని వారంటారు.. ఇది పెద్ద టైమ్ వేస్ట్ గేమ్.. పిల్లల చదువులన్నీ పాడైపోతున్నాయి, పెద్దవాళ్లు ఆఫీసులకి సెలవులు పెట్టి కెరీర్ పాడు చేసుకుంటున్నారని ఆక్రోశం వ్యక్తం చేస్తుంటారు. కాకపోతే 130 కోట్ల మంది భారతీయుల బ్లడ్ లోకి వెళ్లిపోయింది కాబట్టి, ఇష్టం ఉన్నా, కష్టంగా ఉన్నా నలుగురితో నారాయణ, కులంతో గోవిందా అనుకుంటూ చేసేది లేక వెళ్లిపోతున్నారు.


Also Read: Rishab Pant About Accident : ఆ రోజులు తలచుకుంటే.. ఇప్పటికీ భయమేస్తుంది : పంత్

నిజానికి మొదట్లో టెస్ట్ మ్యాచ్ లు ఐదేసి రోజులు జరిగేవి. ఉదయం నుంచి పనులన్నీ మానుకొని, సోమరిపోతుల్లా ప్రజలు ఉండటం ఆ దేశాలకు, ముఖ్యంగా ప్రజలకు కూడా ఇష్టం ఉండేది కాదు. దీంతో ఈ ఆటను ఎవరూ దగ్గరికి రానివ్వలేదు.

క్రికెట్ ఆడే ఆ పది దేశాల్లో కూడా ఐదురోజుల టెస్ట్ మ్యాచ్ లకి ఆదరణ తగ్గింది. దాంతో వన్డేలకి కుదించారు. అది కూడా ఒక జట్టు 60 ఓవర్లు వేసేలా నిబంధనలు పెట్టారు. అంటే రెండు జట్లు 120 ఓవర్లు ఆడాలి. ఇటు నాలుగున్నర గంటలు, అటు నాలుగున్నర గంటలు మొత్తం 9 గంటలు మ్యాచ్ లు ఉండేవి.

1983లో మన టీమ్ ఇండియా ప్రపంచకప్ గెలిచినప్పుడు 60 ఓవర్ల మ్యాచ్ లే జరిగాయి. కాలక్రమంలో అది కూడా కాదని 50 ఓవర్లకు కుదించారు. ఎంతచేసిన ఒకరోజంతా పనులు మానుకుని ఆట చూడటం శుద్ధ వేస్ట్ అని ప్రపంచదేశాలేవీ పట్టించుకోలేదు.

Also Read: ఐపీఎల్ ముగిసింది.. టీ 20 ప్రపంచకప్ జోష్ మొదలు

కానీ టీ 20లు వచ్చాయి. ఆటలో నీరసం పోయి జోష్ వచ్చింది. డబ్బులు వస్తున్నాయి. క్రికెట్ బోర్డులన్నీ కళకళలాడుతున్నాయి. ప్రతీదేశంలో కూడా టీ 20 లీగ్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. ప్రపంచదేశాల్లోనే అత్యంత ఖరీదైన లీగ్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మారిపోయింది. అదీకాక మ్యాచ్ లను రాత్రి 7.30కి ప్రారంభిస్తున్నారు. అంటే ప్రజల దైనందిన కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బంది ఉండటం లేదు. దీంతో అందరి ద్రష్టి ఇప్పుడు టీ 20పై పడింది. అంతేకాదు  ఒలింపిక్స్ లో టీ 20 క్రికెట్ ను కూడా చేర్చారు.

ప్రస్తుతం జరగబోయే టీ 20 ప్రపంచకప్ నకు సాక్షాత్తూ అగ్ర దేశమైన అమెరికా ఆతిథ్యం ఇవ్వడం సంచలనంగా మారింది. దీనంతటికి కారణం ఏమిటంటే టీ20 మ్యాచ్ మూడు లేదా నాలుగు గంటల్లో అయిపోతోంది.

Also Read: Singapore open 2024 sindhu won: సింగపూర్ ఓపెన్, సింధు శుభారంభం

అదే జోష్, అదే ఉత్సాహం, అన్నింటికన్నా మించి సిక్సర్లు, ఫోర్లు ఆకాశమే హద్దుగా సాగిపోయే ఆటని అందరూ ఆస్వాదిస్తున్నారు. అందుకనే మొదటి సారి టీ 20 ప్రపంచకప్ లో 20 దేశాలు ఆడుతున్నాయి. వచ్చే రెండేళ్లలో మరిన్ని దేశాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. క్రికెట్ ఆటకు ఇది ఒక శుభపరిణామం అని అంటున్నారు.

Related News

Rohit Sharma: 2027 వరకు రోహిత్ శర్మనే కెప్టెన్..కాంగ్రెస్ ప్రకటన

Mohammed Shami: మహమ్మద్ షమీది దొంగ ప్రేమ..మాజీ భార్య హాసిన్ సంచలనం!

Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

Rashid Khan: పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌..ఒకే రోజూ 4 గురికి !

T20 World Cup: నేడు మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌

Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

×