EPAPER

KKR Captain Shreyas Iyer: కోల్ కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పేరు ఎక్కడ..? క్రెడిట్ మొత్తం గౌతం గంభీర్ కే!

KKR Captain Shreyas Iyer: కోల్ కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పేరు ఎక్కడ..? క్రెడిట్ మొత్తం గౌతం గంభీర్ కే!

Where is The Name of Kolkata Captain Shreyas Iyer SRH vs kkR Final Match 2024: కోల్ కతా నైట్ రైడర్స్ ట్రోఫీ సాధించడంతో అందరిలోనూ విజయోత్సహాలు మిన్నంటాయి. అయితే ఇక్కడ ఒక పెద్ద చిత్రం ఏమిటంటే..కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కి రావల్సిన పేరంతా గౌతం గంభీర్ కి వెళ్లిపోయింది. నిజానికి గౌతం గంభీర్ కూడా రెండు సార్లు 2012, 2014లో ట్రోఫీని అందించాడు.


అయితే శ్రేయాస్ అయ్యర్ కూడా చిన్నోడేమీ కాదు. తను కూడా జాతీయ స్థాయిలో ఇండియన్ టీమ్ కి ఆడాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఇండియా తరఫున అత్యధిక పరుగులు (530) చేసిన మూడో బ్యాటర్ గా నిలిచాడు. ఇక కోల్ కతా కి ఎప్పటి నుంచో ఆడుతున్నాడు. ప్రతి సీజన్ లో తన మార్క్ ప్రతిభతో జట్టుకి వెన్నుముకగా నిలుస్తున్నాడు. ఇంతవరకు 115 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడి 3,127 పరుగులు చేశాడు. 21 ఆఫ్ సెంచరీలు చేశాడు.

ఐదుసార్లు సెంచరీకి దగ్గరగా వచ్చి అవుట్ అయ్యాడు. 2017లో 96, 2018లో 93 నాటౌట్, 2020లో 88 నాటౌట్, 2022లో 88, 2015లో 83 ఇలా ఆగిపోయాడు. ఇలా ఎందుకు జరిగిందంటే, తను సెకండ్ డౌన్ లో వస్తాడు కాబట్టి, సెంచరీకి సమయం సరిపోవడం లేదు. అయినా సరే రికార్డ్స్ కోసం ఆడేవాడు కాదు కాబట్టే, క్రీజులోకి వచ్చిన వెంటనే తన సహజ సిద్ధమైన ఆట ఆడేందుకే ఇష్టపడి సెంచరీ సాధించలేదు.


Also Read: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం, క్లే కోర్టు కింగ్ నాదల్ తొలి రౌండ్‌లో ఔట్

30 ఏళ్ల శ్రేయాస్ అయ్యర్ వెన్నుపూస గాయంతో కొంతకాలం ఆటకి దూరమయ్యాడు. నిజానికి శ్రేయాస్ లో ఉన్న టెక్నిక్ నచ్చి బీసీసీఐ చాలా అవకాశాలు ఇచ్చింది. తను విఫలమవుతున్నా సరే, పలు అవకాశాలు కల్పించింది. అయితే దురద్రష్టవశాత్తూ ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ ల్లో శ్రేయాస్ ఫామ్ కోల్పోయి తీవ్ర అవస్థలు పడ్డాడు.

తర్వాత ఐపీఎల్ కోసం బయటకు వచ్చాడు. అది టీమ్ ఇండియాకి కోపం వచ్చి.. బీసీసీఐ కాంట్రాక్టు నుంచి శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లను తొలగించింది. అయితేనేం అదేం మనసులోకి రానివ్వకుండా కోల్ కతా ను విజయ పథంలో నిలిపాడు. కెప్టెన్ గా తన మార్క్ చూపించాడు.

Also Read: Team India New Coach : కొత్త కోచ్ గా గంభీర్.. నిజమేనా?

అయితే ఇక్కడ అందరూ బాధపడేదేమిటంటే గ్రౌండులో తను సమయానికి తగినట్టుగా బౌలింగు వనరులను వాడి, ఫీల్డింగ్ సెటప్ లను చేసి జట్టుని విజయపథంలో నడిపించాడు. అలాంటి తనకి పేరు రాకుండా మెంటార్ గా ఉన్న గౌతంగంభీర్ కి రావడంపై నెట్టింట తీవ్ర దుమారం రేగుతోంది.

Related News

Rohit Sharma: 2027 వరకు రోహిత్ శర్మనే కెప్టెన్..కాంగ్రెస్ ప్రకటన

Mohammed Shami: మహమ్మద్ షమీది దొంగ ప్రేమ..మాజీ భార్య హాసిన్ సంచలనం!

Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

Rashid Khan: పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌..ఒకే రోజూ 4 గురికి !

T20 World Cup: నేడు మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌

Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

Big Stories

×