EPAPER

Mystery Behind Nayeem Diary: నయీం డైరీలో ఏముంది..? తెలంగాణ సర్కార్ ఫోకస్..!

Mystery Behind Nayeem Diary: నయీం డైరీలో ఏముంది..? తెలంగాణ సర్కార్ ఫోకస్..!

2016 ఆగస్టు 8.. ఇది నయీం ఎన్‌కౌంటర్ జరిగిన డేట్.. అటు ఇటుగా ఎనిమిదేళ్లు అయ్యింది. ఈ ఎన్‌కౌంటర్ జరిగి జనాలకు నయీం పీడా విరగడైంది.. ఇది నిజం.. బట్ నయీం బాధితులకు న్యాయం జరిగిందా? నయీంకు అండగా ఉన్న పొలిటిషియన్స్‌కు, పోలీసు అధికారులకు తగిన శాస్త్రి జరిగిందా? దీనికి కాన్ఫిడెంట్‌గా యస్ అని ఆన్సర్ చెప్పలేము. ఎందుకంటే ఇంకా వీడని చిక్కు ముడులు అనేకం. తేలని డైరీ లెక్కలు అనంతం.. సో.. ఈ లెక్కలను తేల్చాలని చూస్తోంది ప్రస్తుత రేవంత్ సర్కార్.. బీఆర్‌ఎస్‌ పాలనలో అడ్రస్ లేకుండా పోయిన ఈ కేసును మళ్లీ తిరిగి తవ్వాలని డిసైడ్ అయ్యారు.

నయీం ఎన్‌కౌంటర్ తర్వాత ఏం జరిగింది? 602 మొబైల్స్‌.. 130 డైరీలు.. 1,050ఎకరాల భూమికి సంబంధించిన.. 750 రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్స్‌.. భారీగా నగదు.. ఇవీ నయీం డెన్‌ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న కొంచెం లిస్ట్.. అసలు నిజంగా పోలీసులు సీజ్‌ చేసిన సొమ్మెంత? బంగారమెంత? డెన్‌లో దొరికిన పెన్‌ డ్రైవ్‌లు ఎన్ని ? అందులో ఏముంది ? సీజ్ చేసిన వాటిని ఎక్కడ పెట్టారు? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పటికీ కూడా మిస్టరీనే.. ఇవన్నీ పక్కన పెడితే అసలు నయీం డైరీలో ఏముంది అన్నది అత్యంత గోప్యంగా ఉంచారు. కొన్ని రోజుల పాటు హడావుడి చేసిన అప్పటి టీఆర్‌ఎస్‌ సర్కార్.. మెల్లిమెల్లిగా ఇష్యూను డైవర్ట్ చేసింది. పేరుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను ఏర్పాట చేసినా.. విచారణ మాత్రం ఆటకెక్కింది అనేది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్.


Also Read: ఎన్టీఆర్‌కు కుటుంబ సభ్యుల నివాళి, జూన్ నాలుగు తర్వాత..

197.. నయీంపై ఉన్న కేసుల సంఖ్య ఇది.. 125.. ఇది అరెస్ట్‌ అయిన నయీం అనుచరుల సంఖ్య. అయితే చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది మాత్రం కేవలం 18 కేసుల్లో మాత్రమే.. మరి మిగిలిని కేసుల సంగతేంటి? ఇదే ఇప్పుడు నయీం బాధితులు వేస్తున్న ప్రశ్న. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదు అని నెత్తి నోరు బాదుకుంటున్నారు. అయితే విచారణ ముందుకు జరగపోవడానికి మెయిన్ రీజన్ నయీం డైరీ అని తెలుస్తోంది. ఎందుకంటే ఈ డైరీలో ఉన్నది పోలీస్ ఉన్నతాధికారులు, కొందరు రాజకీయ నేతల పేర్లు. ఒక్కసారి చర్యలు తీసుకోవడం షురూ అయితే.. శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లే నేతలు, పోలీసుల సంఖ్య పెద్దగానే ఉన్నట్టు కనిపించింది. అందుకే కొందరు పోలీసులపై తాత్కాలికంగా చర్యలు తీసుకొని.. చాలా మందికి క్లీన్‌చిట్ ఇచ్చేశారు. ఇక రాజకీయ నేతలపై చర్యలు తీసుకున్నారన్న ఊసే వినిపించలేదు.. కనిపించలేదు.. ఆ తర్వాత వార్తల్లో నయీం అన్న పేరే వినిపించడం మానేసింది.

కాలం గడిచే కొద్ది.. ఈ కేసు కాలగర్భంలో కలిసిపోతుందని అంతా అనుకున్నారు. బట్.. నయీం వల్ల నాశనమైన జీవితాల సంఖ్య చాలా పెద్దది. అందుకే ఇప్పటికీ కూడా న్యాయం చేయండి మహాప్రభో అంటున్నారు. ఎందుకంటే నయీం, అతని అనుచరులు కబ్జాలు చేసిన భూములు. ఇప్పటికీ అసలు యజమానులకు చేరలేదు. అందుకే మళ్లీ తెరపైకి ఈ గ్యాంగ్‌స్టర్ కేసు వచ్చింది. తెలంగాణ పోలీసులు మళ్లీ ఈ కేసును తవ్వుతున్నారు. నయీం డైరీలో ఉన్న వీఐపీల పేర్లపై ఆరా తీయడం షురూ చేశారు. అసలు ఏ కేసు విచారణ ఏ దశలో ఉందో తెలుసుకుంటున్నారు. సో.. ఈసారి నయీం డైరీ మిస్టరీ ఇకవీడే సమయం కనిపిస్తోంది. అందులో ఉన్న నేతలు, పోలీస్ పెద్దల గుట్టు రట్టు కానుంది..

Also Read: KCR govt snooped on judges and lawyers: ఫోన్ ట్యాపింగ్ కేసు.. తీగలాగితే డొంక, జడ్జీలు, అడ్వకేట్ సహా..

ఇవన్నీ వ్యాలీడ్ క్వశ్చన్సే.. గత ప్రభుత్వం మౌనాన్ని వీడలేదు.. సమాధానం చెప్పలేదు. కానీ ఈసారి పోలీసులు కాస్త సీరియస్‌గానే దీనిపై ఫోకస్ చేశారు. విషయాలన్నింటిని తవ్వి తీయాలని ప్రభుత్వం కూడా క్లియర్‌ కట్‌గా ఆదేశించింది. సో త్వరలోనే చాలా బ్రేకింగ్స్‌ న్యూస్‌ చూడబోతున్నారు మీరు.

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×