EPAPER

Bomb Threat to IndiGo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ద్వారం నుంచి ట్రావెలర్స్ తరలింపు!

Bomb Threat to IndiGo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ద్వారం నుంచి ట్రావెలర్స్ తరలింపు!

Bomb Threat to IndiGo Flights in Delhi Airport: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపింది. వెంటనే అలర్టయిన సిబ్బంది, ప్రయాణికులు ఎమర్జెన్సీ ద్వారం నుంచి బయటకు దింపేశారు. ప్రస్తుతం ప్రయాణికులందరూ సేఫ్‌గా దిగిపోయారు. అసలేం జరిగింది?


మంగళవారం ఉదయం ఐదున్నర గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి వారణాసికి ఇండిగో విమానం బయలు దేరనుంది. టేకాఫ్‌కు సిద్దమవుతున్న సమయంలో బాత్రూమ్‌లో ఓ టిష్యూ పేపర్ కనిపించింది. దానిపై బాంబు అని నాలుగు అక్షరాలు రాసి ఉంది. దీన్ని గమనించిన సిబ్బంది, వెంటనే ప్రయాణికులను అత్యవసర ద్వారం నుంచి కిందకు దించేశారు. ఈ విషయాన్ని సిబ్బంది ఎయిర్‌పోర్టు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే అధికారులను రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందకు దించివేశారు. కొందరు విండోల నుంచి కిందకు దూకేశారు. ఒకొక్కరుగా ఎయిర్‌పోర్టులోకి పంపించేశారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. బాంబు విషయం తెలియగానే ఢిల్లీ పోలీసులు, బాంబు స్వ్కాడ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. విమానంలో ఏవియేషన్ సెక్యూరిటీ, బాంబు డిస్పోజల్ టీమ్స్ తనిఖీలు చేశారు. ఇండిగో విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు.


Also Read: ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు

ఈ నెలలో ఇలాంటి ఘటన ఎయిరిండియా విమానంలోనూ చోటు చేసుకుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం టాయిలెట్‌లో బాంబు బెదిరింపుల పేరిట రాసున్న టిష్యూ పేపర్‌ను సిబ్బంది గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టడంతో చివరకు ఆకతాయిలు చేసిన పనిగా తేలిపోయింది.

ఈ మధ్యకాలంలో ఢిల్లీ, చెన్నై ఎయిర్‌పోర్టులు, ముఖ్యమైన కార్యాలయాలు, హోటళ్లకు బాంబు బెదిరింపులు తీవ్రమయ్యాయి. సరిగ్గా వారం కిందట ఢిల్లీ నార్త్ బ్లాక్‌‌లో ఉన్న హోంమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాదు ఢిల్లీలోని ముఖ్యమైన స్కూల్స్, ఆసుపత్రులకు ఆ తరహా బెదిరింపులు వచ్చాయి. ఎవరు, ఎక్కడ నుంచి పంపిస్తున్నారనేది మాత్రం తెలియరాలేదు. ఇలా వరస బెదిరింపులకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

Also Read: Delhi Metro: మెట్రో రైలులో మంటలు.. వీడియో ఇదిగో

Tags

Related News

Lucknow Building collaps : యూపీలో ఘోర ప్రమాదం.. కూలిన బిల్డింగ్.. ఐదుగురు మృతి

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Big Stories

×