EPAPER

IPL 2024 Final Match Records: హైదరాబాద్ Vs కోల్‌కతా.. ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డు.. 14 ఏళ్ల రికార్డ్ బద్దలైంది!

IPL 2024 Final Match Records: హైదరాబాద్ Vs కోల్‌కతా.. ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డు.. 14 ఏళ్ల రికార్డ్ బద్దలైంది!

IPL 2024 Final Match – KKR Vs SRH Breaks 14 year old Historical Record in Tournament: ఆ రికార్డు ఏమిటి? అని ఆశ్చర్యపోతున్నారా? ఇంకేమిటండీ బాబూ.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అండీ.. కొంపదీసి ఏదో గొప్ప రికార్డే వచ్చిందని అనుకుంటున్నారా? అంత లేదండీ.. ఐపీఎల్ ప్లే ఆఫ్ చరిత్రలో అతి తక్కువ సమయంలో, అతి చప్పగా, అతి చెత్తగా ముగిసిపోయిన మ్యాచ్ గా ముందున్న ఒక రికార్డుని బద్దలు కొట్టింది.


విషయం ఏమిటంటే.. ఐపీఎల్ టీ 20 మ్యాచ్ లో రెండు జట్లు కలిసి 40 ఓవర్లు ఆడాల్సిన మ్యాచ్ కేవలం 29 ఓవర్లలో తేలిపోయంది. హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లకు ఆలౌట్ అయితే.. అదే స్కోరుని కేవలం 10.3 ఓవర్లలో ఛేదించి కోల్ కతా విజయం సాధించింది. దీంతో అతి తక్కువ ఓవర్లలో ముగిసిన ప్లే ఆఫ్ మ్యాచ్ గా 14 ఏళ్ల రికార్డుని ఫైనల్ మ్యాచ్ బద్దలు కొట్టిందన్న మాట.. అదండీ సంగతి..

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌.. హోరాహోరీగా సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ అత్యంత దారుణంగా సాగింది. నిజానికి లోకల్ టీమ్ కూడా ఆడనట్టుగా హైదరాబాద్ జట్టు ఆడటంతో అందరూ నిరాశలో కూరుకుపోయారు.


Also Read: కప్పు గెలిస్తే బ్రా లేకుండా ఫొటోలు పెడతానన్న లేడీ ఫ్యాన్.. అన్నంత పని చేసిందిగా?

2012, 2014 తర్వాత ముచ్చటగా మూడోసారి కోల్‌కతా నైట్ రైడర్స్ ట్రోఫీని ముద్దాడారు. మూడోసారి టైటిల్‌ గెలవాలనుకున్న సన్‌రైజర్స్‌కు నిరాశే మిగిలింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్ కతా 10.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి మ్యాచ్‌ను ముగించింది.

దీంతో ఐపీఎల్ చరిత్రలో 14 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టినట్టయ్యింది. మొత్తం 29 ఓవర్ల పాటు మాత్రమే కొనసాగిన ఈ మ్యాచ్.. ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ ఓవర్లలో ముగిసిన ప్లేఆఫ్ మ్యాచ్‌గా నిలిచింది.

Also Read: Riyan Parag: యువ ఆటగాడిపై ట్రోలింగ్స్.. ‘ఛీ.. నీకు ఇదేం పాడు బుద్ధి భయ్యా’ అంటూ..

2010లో ఆర్సీబీ వర్సెస్ డెక్కన్ ఛార్జర్స్ జట్ల మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ జరిగింది. అది కూడా ఇప్పటిలాగే 32.2 ఓవర్లలో ముగిసిపోయింది. అయితే  ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన డెక్కన్ ఛార్జర్స్ 18.3 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆర్సీబీ బ్యాటింగ్ ప్రారంభించి 13.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

ప్రస్తుతం కోల్ కతా వర్సెస్ హైదరాబాద్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ఆ పాత రికార్డు  చెరిగిపోయింది. 32.2 ఓవర్లకన్నా ముందే అంటే 29 ఓవర్లలోనే ఇక్కడ ఫైనల్ మ్యాచ్ ఫినిష్ అయిపోయింది.

Related News

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

Big Stories

×