ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ జూలై‌లో ‘హానర్ మ్యాజిక్ 6 ప్రో’ని భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇది సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌తో వస్తుంది.

గరిష్టంగా 1TB స్టోరేజ్, 16GB వరకు RAMతో పనిచేస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్‌గా Android 14 ఆధారిత Honor MagicOS 8ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఈ ఫోన్ 50MP మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 180MP పెరిస్కోప్ లెన్స్‌తో వస్తుంది.

సెల్ఫీ కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ ఫోన్ 5,600mAh పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఈ ఫోన్ 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 66W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.