కర్భూజను తినడానికంటే జ్యూస్ గా తాగడానికే ఎక్కువ ఇష్టపడతారు.

కర్భూజ గింజలను ప్రొటీన్ పవర్ హౌస్ గా చెబుతారు.

వీటిలో విటమిన్లు A,K,C,B1,E లతో పాటు జింక్, ప్రొటీన్, హెల్దీ ఫ్యాట్, పిండిపదార్థాలుంటాయి.

కర్భూజ విత్తనాల్లో మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలం

బోలు ఎముకల వ్యాధిని నిరోధించే శక్తి వీటిలో ఉంది.

మస్క్ మెలన్ సీడ్స్ లో ప్రొటీన్ అధికం. ఇవి కండరాల పెరుగుదలకు ఉపయోగపడతాయి.

వీటిలో ఫైటో కెమికల్స్ కూడా ఉంటాయి. ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్ నుంచి రక్షిస్తాయి.

లిగ్నన్లకు మంచి మూలం. ఇదొక ఫైటోఈస్ట్రోజెన్. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి.

వీటిలో ఉండే సాపోనిన్లు, ఫైటోస్టెరాల్స్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

 ఒమేగా -3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు ఉన్నందున గుండె ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి.

UV కిరణాల వల్ల చర్మం డ్యామేజ్ కాకుండా, వృద్ధాప్యం నుండి రక్షించడానికి సహాయపడతాయి.

డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి.. జీర్ణక్రియకు కూడా మంచిది.