EPAPER

Mahindra XUV 700 AX5 Select : మహీంద్రా నుంచి XUV 700 AX5 Select కొత్త మోడల్ లాంచ్.. ఫీచర్లు చూస్తే చెమటలు పట్టాల్సిందే!

Mahindra XUV 700 AX5 Select : మహీంద్రా నుంచి XUV 700 AX5 Select కొత్త మోడల్ లాంచ్.. ఫీచర్లు చూస్తే చెమటలు పట్టాల్సిందే!

Mahindra XUV 700 AX5 Select Launch and More Details: ఆటో మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న కంపెనీల్లో మహీంద్రా ముందువరుసలో ఉంటుంది. వాహన ప్రియులకు సేఫ్టీ పరంగా కానీ, బడ్జెట్ పరంగా కానీ మంచి అనుభూతిని అందించేందుకు ఎల్లవేళలా పనిచేస్తుంది. ఇందులో భాగంగానే కొత్త కొత్త మోడళ్లను భారత మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా కంపెనీ మరొక మోడల్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయింది.


మహీంద్రా & మహీంద్రా కంపెనీ భారత మార్కెట్లో ‘Mahindra XUV 700 AX5 Select’ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ AX5 సెలెక్ట్ వేరియంట్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 16.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ SUV బుకింగ్ ప్రారంభమైంది. దీని డెలివరీ కూడా త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

Mahindra XUV 700 AX5 Select Price


Mahindra XUV 700 AX5 Select ధర విషయానికొస్తే.. MT వేరియంట్‌తో కూడిన పెట్రోల్ వాహనం ధర రూ. 16.89 లక్షలు (ఎక్స్-షోరూమ్).. అలాగే AT వేరియంట్‌తో పెట్రోల్ వాహనం ధర రూ. 18.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కాగా డీజిల్ MT మోడల్ ధర రూ. 17.49 లక్షలు, AT మోడల్ ధర రూ. 19.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. AX5 S వేరియంట్ AX3 వేరియంట్ కంటే దాదాపు రూ. 50,000 ఖర్చుతో కూడుకున్నది. అయితే ఇంజిన్, గేర్‌బాక్స్ ఎంపికలను బట్టి ఈ ధర కొద్దిగా మారవచ్చు.

Also Read: హాట్ కేకుల్లా మహీంద్రా XUV 3XO పెట్రోల్ వేరియంట్ బుకింగ్స్.. డెలివరీలు షురూ!

Mahindra XUV 700 AX5 Select Features

కొత్త Mahindra XUV 700 AX5 Select (AX5 S) AX3, AX5 మధ్య ఉంటుంది. ఇది కొన్ని అదనపు ఫీచర్లను పొందుతుంది. AX5 S ఏడు సీట్ల లేఅవుట్‌తో అందించబడుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 10.25-అంగుళాల స్క్రీన్, అంతర్నిర్మిత అమెజాన్ అలెక్సా, వైర్‌లెస్ Apple CarPlay/Android కలిగి ఉంటుంది. ఆరు స్పీకర్లు LED DRL, రెండవ వరుస కోసం మ్యాప్ ల్యాంప్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

కొత్త AX5 S వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ రెండింటితో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఇది 185hp, 420Nm (AT తో 450 Nm) ఉత్పత్తి చేసే 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ కలిగి ఉంది. పెట్రోల్ ఇంజన్ 2.0-లీటర్ టర్బో పెట్రోల్, ఇది 200hp పవర్, 380Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఈ సేఫ్టీ ఫీచర్లు అత్యద్భుతంగా ఉన్నాయని.. దెబ్బకు చెమటలు పడుతున్నాయని కొందరు వాహన ప్రియులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.

Tags

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×