EPAPER

Amitshah Prediction on AP Victory: ఏపీలో ఎన్డేయే ప్రభుత్వం.. జగన్ కంటే అమిత్ షాకు తెలుసా..?

Amitshah Prediction on AP Victory: ఏపీలో ఎన్డేయే ప్రభుత్వం.. జగన్ కంటే అమిత్ షాకు తెలుసా..?

Amitshah Prediction to Victory in AP: ఆంధ్రప్రదేశ్‌లో గెలుపు మాదంటే మాదని అధికార-విపక్షాలు ఇప్పటివరకు చెప్పాయి. అధికార వైసీపీ ఓ అడుగు ముందుకేసి విశాఖలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేసుకుంటోంది. పనిలో పనిగా ముహూర్తం కూడా పెట్టేశారు ఆ పార్టీ నేతలు. అతి విశ్వాసమో ఏమోగానీ, అధినేత జగన్ బాటలోనే మిగతా నేతలు నడుస్తున్నారు. కానీ, ఈ విషయంలో టీడీపీ సెలైంట్‌గా ఉంది.


ఎన్నికల క్షేత్రంలో మొహరించిన టీమ్‌ల టీడీపీ అధినేత చంద్రబాబు డీటేల్స్ తీసుకున్నారు. వైసీపీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో ఈసారి తమ పార్టీ జెండా రెపరెపలాడబోతోందని రిపోర్టు ఇచ్చారట. కాకపోతే హంగు ఆర్భాటాలకు పోకుండా తాము గెలుస్తామని, ఎన్నికల తర్వాత మరుసటి రెండురోజులు చెప్పారు. ఆ తర్వాత ఆ విషయం గురించి సైలెంట్ అయ్యారు.

ఈ విషయంలో వైసీపీ నానా హంగామా చేస్తోంది. సెఫాలజిస్టులు సైతం కూటమికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. వ్యూహకర్తలు సైతం ఇదే మాట చెప్పారు. కేంద్రమంత్రి అమిత్ షా సేకరించిన నివేదిక ప్రకారం.. ఏపీలో కూటమి గెలుస్తోందని రిపోర్టులు వచ్చినట్టు ఢిల్లీ సర్కిల్స్ సమాచారం. ఈ క్రమంలో ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు.


Also Read: జగన్ మేనమామ.. హ్యాట్రిక్ కొడతాడా?

ఆంధ్రప్రదేశ్‌‌లో కొత్తగా వచ్చేది ఎన్డేయే ప్రభుత్వమని క్లారిటీ ఇచ్చేశారు అమిత్ షా. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పుకొచ్చారు. దేశంలో ఆరు దశలు ఎన్నికల పోలింగ్ తర్వాత ఏపీపై ఆయన మాట్లాడడం ఇదే తొలిసారి. అంతేకాదు 17 ఎంపీ సీట్లను గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తంచేశారాయన. ఏయే రాష్ట్రాల్లో బీజేపీకి ఎన్నేసి సీట్లు వస్తాయో చెప్పుకనే చెప్పారు.

అమిత్ షా మాటలపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఏపీని ఐదేళ్లు పాలించిన అధినేత జగన్ కన్నా, అమిత్ షాకు తెలుసా..? అని కొందరు అంటున్నారు. కూటమికి 17 ఎంపీ సీట్లు వస్తాయంటే, మా పార్టీకి ఎనిమిది ఖాయమని అంటున్నారు. ఏలా చూసినా ఈసారి గెలుపు మాదేనని మరోసారి ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నమాట. మరోవారం ఆగితే పార్టీల భవితవ్యం తెలుస్తుందని అంటున్నారు మరికొందరు.

Tags

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×