EPAPER

Winning Tension in Kethireddy: మారిన లెక్కలు.. ధర్మవరంలో గెలిచేదెవరు..?

Winning Tension in Kethireddy: మారిన లెక్కలు.. ధర్మవరంలో గెలిచేదెవరు..?

Who Will in Dharmabaram Assembly Constituency: ఆ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచింది. మొదట్లో అంతా అక్కడ అధికార పార్టీ అభ్యర్థి గెలుపు నల్లేరు పై నడకే అనుకున్నారు. కానీ కూటమి అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చి ఆ అధికార పార్టీ నేతకు టెన్షన్ పుట్టిస్తున్నాడట.. నాన్ లోకల్ అయిన సదరు ప్రత్యర్ధి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేకి అన్ని విధాలా తీవ్ర పోటీ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ హాట్ సీటు ఏది? అసలక్క ఎన్నికల సమీకరణలు ఎందుకని


ధర్మవరం నియోజకవర్గం.. ధర్మవరం చీరలంటే వరల్డ్ ఫేమస్.. అంతగా అక్కడ చేనేత రంగం వస్తరించి ఉంది. బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేది. కానీ ఇంతవరకు ఏ ఒక్క బీసీ అభ్యర్థినీ ప్రధాన పార్టీలు ఇక్కడ నిలబెట్టలేదు. 1983 నుంచి ధర్మవరం నియోజకవర్గానికి జరిగిన 9ఎన్నికల్లో.. టిడిపి ఏడు సార్లు గెలిచింది. కాంగ్రెస్ నుంచి 2009లో గెలిచిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. తిరిగి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తూ రాష్ర్ట వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కేతిరెడ్డి ఈ సారి మళ్లీ పోటీ చేశారు.

2019 ఎన్నికల్లో టిడిపి నుంచి ఓడిపోయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దాంతో ధర్మవరం టీడీపీ ఇన్చార్జిగా పరిటాల శ్రీరాంని ప్రకటించారు. అప్పటినుంచి నాలుగేళ్లుగా ఎంత కష్టపడి టిడిపి క్యాడర్లో ధైర్యాన్ని నింపి శ్రీరామ్ ధర్మవరంలో సెటిల్ అయ్యారు. ఆయన ఈ సారి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో.. వరదాపురం సూరి టికెట్ రేసులోకి వచ్చారు. అయితే బీజేపీ లేకపోతే టీడీపీలోకి వచ్చి పోటీ చేయాలని భావించారు. ఆ క్రమంలో పరిటాల శ్రీరాం, వరదాపురం సూరిల మధ్య వర్గపోరు మొదలైంది.


Also Read: పోరు బందరు.. గెలిచేది ఎవరంటే..

టీడీపీ అధిష్టానం ఈ పరిణామాలకు చెక్ పెట్టేందుకు పోత్తులో భాగంగా ధర్మవరం సీటు బీజేపీకి కేటాయించింది. దాంతో అంతా వరదాపురం సూరికే ధర్మవరం టికెట్ అనుకున్నారు. కానీ అనుహంగా బిజెపి ఈ స్థానాన్ని సత్యకుమార్ అనే బీసీ అభ్యర్ధికి కేటాయించింది. సత్య కుమార్ అయితే ధర్మవరంలో కేతిరెడ్డి గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు. కానీ అక్కడే సీన్ రివర్స్ అయింది. సత్య కుమార్ వచ్చి రాగానే తన మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. కేతిరెడ్డిపై మోడీకా పరివార్ యుద్ధం ప్రకటించింది అంటూ.. ప్రజల్లోకి వెళ్లారు. అందర్నీ కలుపుకుని పోతూ వ్యూహాత్మకంగా ప్రచారం చేశారు.

సత్యకుమార్ కోసం పరిటాల శ్రీరామ్ తానే అభ్యర్ధినన్నట్లు కష్టపడటం ఆయనకు కలిసి వచ్చింది. పరిటాల వర్గం సపోర్టుతో సత్యకుమార్ ధర్మవరం ప్రచారంలో దూసుకుపోయారు. బీసీ కార్డు ఉపయోగిస్తూ తనదైన మార్క్ చూపించారు. ధర్మవరంలో బీసీలు అత్యధికంగా ఉంటారు. ముఖ్యంగా చేనేతలు, కురుబలు, వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవారు అధికంగా ఉంటారు. దీంతో సత్యకుమార్ బీసీ కార్డ్ ని బాగా ఉపయోగించుకున్నారు. ఇంతవరకు ధర్మవరంలో ఏ ఒక్క ప్రధాన పార్టీ బీసీ అభ్యర్థికి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. దాన్ని ఫోకస్ చేస్తూ సత్యకుమార్ బీసీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు.

Also Read: Srikalahasti Politics: బొజ్జల హవా వైసీపీకి ఎదురు దెబ్బ?

మొదటిసారిగా ధర్మవరంలో ఒక బీసీ అభ్యర్థి ఎమ్మెల్యే అవకాశం వచ్చిందంటూ ప్రతి సభలోను గట్టిగా ప్రచారం చేస్తూ.. ఆ వర్గీయుల్లో పాజిటివ్ కార్నర్ తెచ్చుకోవడానికి కృషి చేశారు. దానికి పరిటాల వర్గం సపోర్ట్ కూడా తోడైంది. మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ ఆయన ఎక్కడ తడబాటుకు గురి కాకుండా వ్యూహాలకు పదును పెడుతూ ధర్మవరాన్ని జాతీయ స్థాయిలో నిలబెడతానని.. కేంద్రం నుంచి నిధులు సాధించి అభివృద్ధి చేస్తానని హామీలు గుప్పించారు. సహజంగా ఆయన వాగ్దాటి కూడా బాగుండడంతో ధర్మవరం ప్రజలకు బానే కనెక్ట్ అయినట్లు కనిపించారు

ముఖ్యంగా జాతీయస్థాయి నేతలను ధర్మవరానికి రప్పించి తన పట్ల ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచుకున్నారు. అమిత్ షా తోపాటు చంద్రబాబునాయుడు ధర్మవరంలో ప్రచారం చేసి వెళ్లడంతో ప్రజల్లో సత్య కుమార్ పట్ల నమ్మకం ఏర్పడింది అంటున్నారు విశ్లేషకులు.. అమిత్ షా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మొదటి సభ ధర్మవరం. అమిత్ షా ధర్మవరం వేదికపై సత్య కుమార్ తనకు అత్యంత ఆప్తుడంటూ ఆకాశానికి ఎత్తారు. అమిత్ షా మాత్రమే కాకుండా హీరోయిన్ నమిత, హీరో సాయి కుమార్‌లు సత్యకుమర్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. అంతే కాకుండా కేంద్ర మంత్రులను సైతం ప్రచారంలో కి దింపారు.

Also Read: Amadalavalasa Political Heat: మామ VS అల్లుడు.. మధ్యలో గాంధీ 

కేంద్ర మంత్రుల తో పాటు ఆర్ఎస్ఎస్ నాయకులను సైతం ప్రచారం లో దింపి.. ఎక్కడికక్కడ పక్కాగా గ్రౌండ్ వర్క్ చేయించుకుంటూ.. ఎక్కడికక్కడ కేతిరెడ్డికి తగ్గకుండా ప్రచారం నిర్వహించారు. ఆర్థికంగా కూడ బీజేపి నుంచి సపోర్ట్ రావడంతో ప్రచారంలో దూసుకుపోయారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గం సత్యకుమార్‌కి పనిచేయకపోయినా.. పరిటాల శ్రీరాం అన్నీ తానై వ్యవహరించడం ప్లస్ అయిందంటున్నారు. పోలింగ్ నాటికి ఫోల్ మేనేజ్మెంట్‌లో సైతం పరిటాల శ్రీరామ్ కీరోల్ పోషించారు. అయితే బిజెపికి క్షేత్రస్థాయిలో పట్టు లేకపోవడం.. చివరి నిమిషంలో కీవరదాపురం సూరి వర్గం హ్యాండ్ ఇవ్వటం సత్యకుమార్కు మైనస్ గా మారిందంటున్నారు. మరి చూడాలి ధర్మవరం ఓటర్ల జడ్జ్‌మెంట్ ఎలా ఉంటుందో..

Tags

Related News

Press Freedom: మీడియాతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ..!

Kargil War: కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది?.. 25 ఏళ్ల తర్వాత నిజం ఒప్పుకున్న పాక్

Big Shock to YS Jagan: పూర్తిగా ఖాళీ అవుతున్న వైసీపీ.. వీళ్లంతా జంప్

US Presidential Election 2024: కమలా హారిస్ విన్ అవుతుందని.. అలన్ ఎలా చెప్తున్నాడు?

TDP Office Attack Case: పరారీలో జోగి రమేశ్‌, దేవినేని అవినాశ్‌?

YSRCP VS TDP: వరద పాలిటిక్స్.. బురదలో ప్రజలు.. నేతల గొప్పలు

Natural Disaster: క్లౌడ్‌ బరస్ట్‌తో ఆకస్మిక వరదలు.. విపత్తులను ఆపే దారేది?

Big Stories

×