EPAPER

Srikakulam Assembly Constituency: సిక్కోలు సిత్తరాల సిరపడెవరు..?

Srikakulam Assembly Constituency: సిక్కోలు సిత్తరాల సిరపడెవరు..?

Will Ram Mohan Naidu Gets Hat Trick : ఆంధ్రప్రదేశ్ ముఖద్వారం శ్రీకాకుళం జిల్లా.. అక్కడ రాజకీయాలు ఎప్పుడూ డిఫరెంట్‌గానే ఉంటాయి. పోయినసారి సిక్కోలు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క టెక్కలిలోనే టీడీపీ గెలిచింది. అయితే ఎంపీగా మాత్రం రామ్మోహననాయుడు రెండో సారి విజయం సాధించారు. అలాంటి చోట కింజరాపు వారసుడు హ్యాట్రిక్ కొడతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ముచ్చట మూడో విజయం సాధిస్తానని రాంమోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన స్పీడ్‌కి వైసీపీ బ్రేకులు వేయగలుగుతుందా?.


ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ముందు నుంచి టీడీపీకి అండగా నిలుస్తూ వచ్చింది. అయితే నీ 2019 ఎన్నికల్లో టెక్కలి, ఇచ్చాపురం మినహా ఎక్కడ కూడా టీడీపీ విజయం సాధించలేకపోయింది. ఉమ్మడి జిల్లాలో 8 నియోజకవర్గాల్లో విజయం సాధించిన వైసీపీ .. శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్‌ను మాత్రం కైవసం చేసుకోలేకపోయింది. కింజరాపు ఎర్రంనాయుడు తరువాత ఆయన కుమారుడు రామ్మోహననాయుడు సిక్కోలు లోక్‌సభ స్థానంలో పాగా వేశారు. వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఆయన ఈ సారి హ్యాట్రికల్ విజయంపై ధీమాతో కనిపిస్తున్నారు.

రామ్మెహన్నాయుడు స్పీడ్‌కి బ్రేకులు వేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ పట్టుదలగా ఉన్నారు. ఈ సారి ఎలా అయినా శ్రీకాకుళం పార్లమెంట్ ని వైసీపీ హస్త గతం చేసుకోవాలని పావులు కదిపారు. ఆందులో బాగంగా కుల సమీకరణ లు ఆధారంగా కాళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తెరపైకి తెచ్చారు. వైసీపీ నుంచి పేరడ తిలక్‌ను బరిలో దింపారు. గత ఎన్నికల్లో టెక్కలిలో అచ్చెన్నాయుడిపై వైసీపీ నుంచి పోటీ చేసిన ఈ పేరడ తిలక్ 8 వేల 500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాంటాయన ఈ సారి అదే టెక్కలి ఉన్న శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేశారు.


Also Read: పోరు బందరు.. గెలిచేది ఎవరంటే..

శ్రీకాకుళం జిల్లాలో కళింగ, వెలమ సమాజికవర్గాలు ఎక్కువగా ఉండటంతో.. కళింగ సామాజిక వర్గానికి చెందిన పేరడ తిలక్ ను వైసీపీ రాంమోహన్ పై పోటీకి దింపింది. అయితే ఉన్నత విద్యావంతుడు, ఎదురులేని వాగ్దాటి , పిన్న వయస్సులోనే అపారమైన రాజకీయ అనుభవం సొంతం చేసుకుని.. ప్రజలకు దగ్గరైన రామ్మోహన్నాయుడ్ని ఢీకొనడం తిలక్‌కు అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

రాంమోహన్నాయడుపై పోటీ చేస్తున్నతిలక్‌కి రాజకీయ అనుభవం లేదు. కేవలం ఆర్థిక స్థితిగతులు, కుల ప్రాతిపదికన జగన్ ఆయనకు టికెట్ ఇచ్చారని వైసీపీ వర్గాలే అంటున్నాయి. ఆ క్రమంలో మూడు దశాబ్దాలుగా కింజరాపు కుటుంబానికి అండగా ఉన్న జిల్లా వాసులు ఈ సారి కూడా రాంమోహన్ నాయుడికి హ్యాట్రిక్ విజయం అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నాటి నుంచి పది సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగితే శ్రీకాకుళంలో ఏడు సార్లు టీడీపీనే విజయం సాధించింది. ముఖ్యంగా 1996లో ఎంట్రీ ఇచ్చిన కింజరాపు ఎర్నన్నాయుడు వరుసగా నాలుగు సార్లు గెలుపొంది. ఆ సెగ్మెంట్లో చరిత్ర సృష్టించారు.

Also Read: 7 సెగ్మెంట్లు.. 600 కోట్లు.. కడప గడపలో టెన్షన్

2009 ఎన్నికల్లో ఎర్రన్నాయుడిపై కాంగ్రెస్ నుంచి పోటీచేసిన కిల్లి కృపారాణి గెలుపొందారు. ఎర్రన్నాయుడు లాంటి దిగ్గజాన్ని ఓడించడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర కేబినెట్ బెర్త్ కట్టబెట్టింది. ఇక తర్వాత ఎర్రన్నాయుడు మరణంతో రామ్మోహన్నాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్ర విభజనతర్వాత వరుస విజయాలు సాధిస్తూ.. సిక్కోలు ఎంపీగా తనదైన బ్రాండ్ వేసుకున్నారు. లోకసభలో ఉత్తరాంధ్ర సమస్యలపై గళం వినిపించి అందరి మన్ననలు పొందుతున్నారు. గత ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 5 అసెంబ్లీ నియోజవర్గాలలో టీడీపీ పరాజయం పాలైంది.

శ్రీకాకుళం లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోకి ఇచ్చాపురం, పలాస,టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం నియోజకవర్గాలు వస్తాయి.. వాటిలో టెక్కలి, ఇచ్చాపురంలో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. అయినా రామ్మోహన్నాయుడు 6 వేల 600 ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిచి పట్టు నిరూపించుకున్నారు. మూడో సారి ముచ్చటగా విజయం సాధిస్తానని ధీమాగా కనిపిస్తున్న రామ్మోహన్నాయుడు.. పార్టీ ఎమ్మెల్యే విజయానికి కృషి చేశారు.. రామ్మోహన్ విజయంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా అంతే ధీమాతో కనిపిస్తుండటం విశేషం.

Also Read: Amadalavalasa Political Heat: మామ VS అల్లుడు.. మధ్యలో గాంధీ

రామ్మోహననాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ స్థానం పరిధిలోనే ఉన్న టెక్కలి ఎమ్మెల్యేగా మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొనసాగుతున్నారు. 2009కి ముందు హరిశ్చంద్రాపురం సెగ్మెంట్‌ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పనిచేసిన అచ్చెన్న.. తర్వాత టెక్కలికి షిఫ్ట్ అయి రెండు సార్లు వరుసగా గెలుపొందారు .. శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబం వరుసగా విజయాలు సాధిండానికి కారణం.. ఆ కుటుంభం నిత్యం ప్రజలతో మమేకమై ఉండటమే అంటున్నారు.

పేరుకి వెనకబడిన జిల్లాగా శ్రీకాకుళం జిల్లాకి పేరున్నా.. ఇక్కడ ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువే.. శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో కళింగ, పోలినాటి వెలమ కులానికి చెందిన సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువ.. వారే అక్కడ గెలుపు, ఓటములు నిర్ణయిస్తారు. ఎర్రన్నాయుడు అకాల మరణంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన రామ్మోహన్నాయుడు తొలిసారిగా పార్లమెంట్ అగుడుపెట్టి జిల్లా సమస్యల‌పై పార్లమెంట్ లో ప్రశ్నలవర్షం కురిపించి దేశం దృష్టిని ఆకర్శించారు. మూడు భాషలపై ఆయనకు పట్టు ఉండటం.. సందర్భోచితంగా మాట్లాడటం..అందరిని కలుపుకునిపోవడం.. విషయ పరిజ్ఞానం.. అన్నిటికంటే ముఖ్యంగా యువతలో ఆయనకున్న క్రేజ్ చిన్న వయస్సులోనే ఆయన్ని తిరుగులేని నేతగా తయారు చేసాయంటారు.

Also Read: Winning Tension In Kethireddy : మారిన లెక్కలు.. ధర్మవరంలో గెలిచేదెవరు?

శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఈ సారి 73.97 శాతం ఓటింగ్ నమోదు అయింది. 2019 ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించినా రాంమోహన్ నాయడుకి క్రాస్ ఓటింగ్ చాలా జరిగింది. ఈ సారి జనసేన, బీజేపీలతో కలిసి పోటీ చేయడంతో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా విజయం సాధిస్తామన్న ధీమా టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబం పై అభిమానానికి తోడు.. ప్రభ్యుత వ్యతిరేకత, వైసీపీ ఎమ్మెల్యేలపై అవినీతి. భూకబ్జాలు, ఇసుక, మట్టి దోపిడీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ పాలన లో జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడం, అభివృద్ధి కుంటిపడటంపై జిల్లావాసులు ఆగ్రహం తో ఉన్నారు.  మరింలాటి పరిస్థితుల్లో రామ్మోహన్ స్పీడ్‌కి వైసీపీ ఏ మాత్రం బ్రేకులు వేస్తుందో చూడాలి.

Tags

Related News

Kadapa Reddamma: జగన్ అడ్డాలో టీడీపీ అభ్యర్థి విజయం.. కడప రెడ్డమ్మ అంటూ చంద్రబాబు కితాబు!

Somireddy Chandramohan Reddy: జాక్ పాట్ కొట్టిన సోమిరెడ్డి.. నెక్ట్స్ ప్లానేంటి..?

Jagan Record : ప్రతిపక్ష హోదా పోగొట్టుకుని జగన్ రికార్డ్.. టీమ్ 11 ఆడుదాం ఆంధ్ర

BIG TV Exit Polls Survey: జనం నాడి పట్టుకున్న బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్.. ఆ పార్టీ నేతల్లో వణుకు

Nellore Constituency: నెల్లూరు లో షాకింగ్ సర్వే.. గెలిచేది ఎవరంటే..

Chandrababu Majority In Kuppam: కుప్పంలో చంద్రబాబు మెజార్టీ ఎంతంటే..?

Tough Fight In Vizag: బొత్స ఝాన్సీని ఢీకొట్టే సత్తా.. బాలయ్య అల్లుడు శ్రీ భరత్ కి ఉందా..

Big Stories

×