EPAPER

Different Climate in India: దక్షిణాదిన దంచికొట్టుడు వానలు.. ఉత్తరాదిన ఉష్ణోగ్రతలు!

Different Climate in India: దక్షిణాదిన దంచికొట్టుడు వానలు.. ఉత్తరాదిన ఉష్ణోగ్రతలు!

Different Climate in India: అవును దేశంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ భారతదేశంలో విరివిరిగా వర్షాలు పడుతున్నాయి. బంగాళఖాతం అల్లకల్లోలంగా మారింది. రేమాల్ తుఫాన్ హెచ్చరికలతో ప్రజలు అధికారులు అప్రమత్తం అవుతున్నారు. మరో వైపు చెన్నైలో నేడు జరగనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. రెండు రోజుల నుంచి ఏపీ, తెలంగాణతో పాటు వర్షాలు పడుతున్నాయి.


శనివారం విజయవాడ, అనంతపురంలో కుండపోత వర్షం పడింది. దీంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నదులను తలపించాయి. భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బెంజి సర్కిల్‌, మొఘల్రాజపురం, ఏలూరు రోడ్డు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లులో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షానికి విడపనకల్లు మండలంలో చాలా కోట్ల విద్యుత్ స్థంబాలు నేలకూలాయి. దీంతో నిన్న ఏకంగా 19 గ్రామాలకు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని గ్రామాల్లో భారీ వరదకు వాహన రాకపోకలు కూడా నిలిచిపోయాయి. పొలాలు, చెరువులకు తేడా లేకుండా పోయింది.


Also Read: Swathi Maliwal: కోర్టులో ఏడ్చిన ఆప్ ఎంపీ స్వాతి మలివాల్

కాకినాడ, విశాఖ సముద్ర తీరాలు అల్లకల్లోలంగా మారాయి. నిన్నటి నుంచి అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. రాకాసి అలల ప్రభావంతో బీచ్ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అటు సముద్రం ముందుకు రావడంతో మత్స్యకారులు కాస్తంత కలవరం చెందుతున్నారు. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు.

తుఫాన్ ముప్పు లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు.. పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించింది. దక్షిణభారత దేశంలో పాటు.. తూర్పున ఉన్న ఒడిశా, బెంగాల్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది.

Also Read : దూసుకొస్తున్న రెమాల్.. ఏపీ సహా.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

దక్షిణ, తూర్పు భారతదేశాల్లో అడపాదడపా వర్షాలు పడుతుంటే.. ఉత్తర, పశ్చిమ భారతదేశంలో మాత్రం ఎండలు మండుతున్నాయి. చిరుజల్లుల కోసం రాజస్థాన్, యూపీ, బీహార్, ఢిల్లీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మే ఆఖరి వారంలో కూడా ఉష్టోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

ఇది మూడు రోజుల క్రితం థార్ ఎడారిలో బీఎస్ఎఫ్ అధికారి ఇసుకలో గుడ్డును ఉడకపెట్టి తిన్నాడు. ఆ రోజు అంటే.. గురువారం 47 డిగ్రీలపైన రాజస్థాన్ లో ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. దేశంలో ఈ ఏడాది అత్యధిక ఉష్టోగ్రతలు గురువారం నమోదైనట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే.. అప్పటి నుంచి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఉష్టోగ్రతలు నమోదువుతున్నాయి. శుక్రవారం రాజస్థాన్‌లోనే 49 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదయ్యాయి.

Also Read: Prajwal Revanna: ఆ రోజు సిట్ ముందు హాజరవుతా : ప్రజ్వల్ రేవణ్ణ

ఇక ఈరోజు రాజస్థాన్‌లోని ఫలోడిలో 50 డిగ్రీలు ఉష్టోగ్రతలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలో 2019 జూన్ 1న 50. 8 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత ఈ ఐదేళ్లలో 50 డిగ్రీలు దాటి నమోదు కాలేదు. అంతకు ముందు 2016 మే 19న ఫలోడిలో 51 డిగ్రీల ఉష్టోగ్రతలతో ఆల్ టైం రికార్డు సెట్ చేసింది. మళ్లీ ఇప్పుడు రికార్డులు బ్రేక్ చేసే రేంజ్ లో ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న జరిగిన ఆరోదశ ఎన్నికలపై కూడా ఎండల ప్రభావం పడింది.

ఢిల్లీలో 6 ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటి నిన్న ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. గత ఎన్నికల కంటే ఢిల్లీలో ఈసారి పోలింగ్ శాతం తక్కువగా ఉండటానికి ఈ ఎండలే కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, గుజరాత్, మధ్య ప్రదేశ్ లో మొత్తం 17 ప్రాంతాల్లో నిన్న 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. ఇలా ఉత్తరాది మొత్తం ఎండలతో మండుతోంది. ప్రజలు బయటకు రావాలంటే బయపడే పరిస్థితి నెలకొంది. భిన్న వాతావరణ పరిస్థితులకు భారత్ నిలయమైనప్పటికీ.. ఈ స్థాయిలో ఉండటం కొంత ఆందోళనకరమేనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×