EPAPER

College Girls Raped by trapping: మొబైల్ యాప్‌ను ఉపయోగించి.. కాలేజీ విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడిన కార్మికుడు!

College Girls Raped by trapping: మొబైల్ యాప్‌ను ఉపయోగించి.. కాలేజీ విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడిన కార్మికుడు!

College Girls Raped by trapping them with mobile voice Changer app: సాంకేతికత ప్రజల జీవితాలను సులభతరం చేస్తోంది. మరోవైపు ఈ సాంకేతికతను దుర్వినియోగం చేయడం వల్ల చాలామంది జీవితాలు నాశనమవుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ సంచలన ఘటన వెలుగు చూసింది. సాంకేతికత కారణంగా కాలేజీ విద్యార్థినులు ఒక్కొక్కరుగా అత్యాచారానికి గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలిసి అంతా షాక్ అవుతున్నారు.


ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏడుగురు కాలేజీ విద్యార్థినులు అత్యాచారానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఏడుగురిలో ఓ మైనర్ కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే, వారిని ట్రాప్ చేసేందుకు నిందితులు ఓ మొబైల్ యాప్ ను ఉపయోగించారని విచారణలో తేలింది. విషయం వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది.

ఇందుకు సంబంధించి శుక్రవారం కాలేజీ విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో అత్యాచారం కేసు నమోదయ్యింది.. అయితే, కేసు దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు మొబైల్ నెంబర్, లొకేషన్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.


అతడిని అరెస్ట్ చేసిన తరువాత విచారణ చేయగా, ఆ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిందితుడి వృతిరీత్యా కూలీగా పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అతనితోపాటు మరో ఇద్దరు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు మొత్తం ఏడుగురు కాలేజీ విద్యార్థినులను ఇలాగే బలితీసుకున్నట్లు విచారణలో తేలింది. వారిని ట్రాప్ చేసేందుకు నిందితులు మొబైల్ యాప్ సాయం తీసుకున్నట్లు అందులో తేలింది.

నిందితులు కాలేజీ టీచర్ గా నటిస్తూ మహిళా గొంతుతో మాట్లాడుతూ స్కాలర్ షిప్ కోసం పత్రాలు కావాలనే వంకతో ఫోన్లు చేసేవారని.. నిందితులు స్కాలర్ షిప్ పొందే కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేసేవారని, అలా ఫోన్ చేసి విద్యార్థినులను ఏకాంత ప్రదేశాల్లోకి తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి నిందితులు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం బాధితుల వద్ద ఉన్న సెల్ ఫోన్లను కూడా వారు గుంజుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయమై ఓ బాధితుడు కూడా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు మొత్తం ఏడుగురు కాలేజీ విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఒక మైనర్ బాలిక ఉన్నట్లు గుర్తించారు. అరెస్ట్ చేసిన ప్రధాన నిందితుడి నుంచి బాధితుల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: గన్ పౌడర్ తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఒకరు మృతి

ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపించాలని మాజీ సీఎం కమల్ నాథ్ డిమాండ్ చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఏడుగురే కాదు… బాధితులు ఇంకా ఎక్కువగా ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఉన్నత స్థాయిలో విచారణ జరపాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన డిమాండ్ చేశారు.

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×