EPAPER

Best Petrol Cars Under 10 lakhs: 26 కి.మీ మైలేజీ అందించే బెస్ట్ పెట్రోల్ కార్లు.. కేవలం రూ.10 లక్షల లోపే.. డోంట్ మిస్..!

Best Petrol Cars Under 10 lakhs: 26 కి.మీ మైలేజీ అందించే బెస్ట్ పెట్రోల్ కార్లు.. కేవలం రూ.10 లక్షల లోపే.. డోంట్ మిస్..!

26Kmpl mileage and less than 10 lakhs best petrol cars: మారుతీ సుజుకీ దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ. ముఖ్యంగా అందుబాటు ధరల్లో అధిక మైలేజీనిచ్చే కార్లను తయారు చేసే జాబితాలో మారుతీ సుజుకీ ముందంజలో ఉంది. అయితే బడ్జెట్ ధరలో మంచి కారు‌ను కొనుక్కోవాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్. ఎందుకంటే మంచి మైలేజీ అందించే కార్‌ను అతి తక్కువ ధరలో కొనుక్కోవచ్చు. అందువల్ల కేవలం రూ.10 లక్షల లోపు ధర కలిగిన పెట్రోల్ ఇంజన్ గల మారుతీ కార్ల వివరాలను ఇక్కడ ఉన్నాయి.


మారుతి సుజుకి సెలెరియో: Maruti Suzuki Celerioలోని1.0-లీటర్ పెట్రోల్ వేరియంట్ లీటరుకు 25 కిమీ మైలేజీని ఇస్తుంది. దీని ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 26 కిమీ వరకు మైలేజీని ఇస్తుంది. భారత మార్కెట్లో సెలెరియో ఎక్స్-షోరూమ్ ధర రూ.5.36 లక్షల నుండి రూ.7.10 లక్షల మధ్య ఉంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: Maruti Suzuki S-Presso కారులోని 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆటోమేటిక్ వేరియంట్‌లో లీటరుకు 25.3 కిమీ, మాన్యువల్‌లో లీటరుకు 24.76 కిమీ మైలేజీని ఇస్తుంది. భారతీయ మార్కెట్లో ఎస్ప్రెస్సో ఎక్స్-షోరూమ్ ధర రూ.4.26 లక్షల నుండి రూ.6.11 లక్షల మధ్య ఉంది.


Also Read: మ్యూజిక్ ప్రియుల కోసం నిస్సాన్ స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది.. తక్కువ ధరలో.. అదిరిపోయిన ఫీచర్లు

మారుతి సుజుకి ఆల్టో: Maruti Suzuki Alto కె10పై కంపెనీ చౌకైన ఆఫర్. ఈ హ్యాచ్‌బ్యాక్ ఆటోమేటిక్ వేరియంట్ లీటర్‌కు 24.9 కిమీ మైలేజీని ఇస్తుండగా, మ్యాన్యువల్ వేరియంట్ లీటర్‌కు 24.39 కిమీ మైలేజీని ఇస్తుంది. ఆల్టో కె10 ఎక్స్-షోరూమ్ ధర రూ.4 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో వ్యాగన్ఆర్ (Maruti Suzuki Wagon R) ఒకటి. ఇందులోని 1.0 లీటర్ ఇంజన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లీటరుకు 24.35 కిమీ, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లీటరుకు 25.19 కిమీ మైలేజీని ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.5.54 లక్షలు ఎక్స్-షోరూమ్.

మారుతీ స్విఫ్ట్: మారుతి నాల్గవ తరం Maruti Swiftను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 1.2-లీటర్ Z సిరీస్ మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో, ఆటోమేటిక్ వేరియంట్‌లో లీటరుకు 25.75 కిమీ, మాన్యువల్‌లో లీటరుకు 24.8 కిమీ మైలేజీని ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.6.50 లక్షలు.

Also Read:  600KM రేంజ్‌తో కియా కొత్త EV.. అదిరిపోయింది బాస్.. కారంటే ఇలా ఉండాలి!

మారుతి సుజుకి డిజైర్: Maruti Suzuki Dzireలోని 1.2-లీటర్, నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ వేరియంట్‌లో లీటరుకు 23.26 కిమీ, ఆటోమేటిక్ వేరియంట్‌లో లీటరుకు 23.69 కిమీ మైలేజీని ఇస్తుంది. ఈ సెడాన్ ప్రారంభ ధర రూ.6.56 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మారుతి సుజుకి బాలెనో: మారుతి నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో Maruti Suzuki Baleno ఒకటి. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మాన్యువల్‌లో లీటరుకు 22.35 కిమీ, ఆటోమేటిక్ వేరియంట్‌లో లీటరుకు 22.94 కిమీ మైలేజీని ఇస్తుంది. బాలెనో ఎక్స్-షోరూమ్ ధర రూ.6.66 లక్షలు.

మారుతి సుజుకి ఫ్రాంక్స్: Maruti Suzuki Fronx అనేది మారుతి నుండి వచ్చిన క్రాస్ఓవర్ SUV. దీని మాన్యువల్ వేరియంట్ 21.79 kmpl, ఆటోమేటిక్ 22.89 kmpl మైలేజీని ఇస్తుంది. భారతదేశంలో Frontex ధర రూ.7.51 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

Also Read: e-Boost ఫంక్షన్‌‌తో జీప్ అవెంజర్.. ఫీచర్లు చూస్తే ఉంటది భయ్యా!

మారుతీ సుజుకి కార్లు భారత మార్కెట్లో ఇంధన సామర్థ్య కార్ల జాబితాలో ముందంజలో ఉన్నాయి. 10 లక్షల లోపు కార్ల కోసం వెతుకుతున్న వారికి మారుతి సుజుకి లైనప్‌లో అనేక ఎంపికలు ఉన్నాయి.

Tags

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×