EPAPER

Police Notices to Hema : నటి హేమకు సీసీబీ పోలీసుల నోటీసులు.. “విచారణకు రండి”

Police Notices to Hema : నటి హేమకు సీసీబీ పోలీసుల నోటీసులు.. “విచారణకు రండి”

CCB Police Notices to Hema : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అడ్డంగా బుక్కైన నటి హేమకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు నోటీసులు జారీ చేశారు. హేమతో పాటు మరో 8 మందికి కూడా సీసీబీ పోలీసులు నోటీసులు పంపారు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాంతి, రాజశేఖర్, ఆషీరాయ్, రిషి చౌదరి, ప్రసన్న, శివాని జైశ్వాల్, వరుణ్ చౌదరి, సుజాతలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు.


బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ఫాంహౌస్ లో జరిగిన రేవ్ పార్టీకి 103 మంది హాజరయ్యారు. వారిలో తెలుగు సినీ, బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన నటులు కూడా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. వారిలో హేమ, ఆశీరాయ్ కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. పార్టీకి వెళ్లిన వారి అందరి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపగా.. 86 మంది బ్లడ్ లో డ్రగ్స్ మూలాలున్నట్లు గుర్తించారు. వారిలో నటి హేమ కూడా ఉంది. వారందరికీ తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

బెంగళూరు రేవ్ పార్టీ న్యూస్ వచ్చినప్పటి నుంచి.. ఈ కేసు హేమ చుట్టూనే తిరుగుతోంది. తొలుత తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ హేమ వీడియో రిలీజ్ చేయగా.. పోలీసులు అదే స్పాట్ నుంచి హేమ ఫొటోను రిలీజ్ చేశారు. రెండింటిలోనూ హేమ ఒకే డ్రెస్ తో ఉండటంతో.. దొరికిపోయింది. హేమ తనను తాను పోలీసులకు కృష్ణవేణిగా చెప్పడంతో వాళ్లు కన్ఫ్యూజ్ అయ్యారట. తర్వాత అసలు పేరు హేమ అని తెలిసిందని తెలిపారు.


Also Read : బెంగుళూరు రేవ్ పార్టీ.. ముగ్గురు పోలీసులపై వేటు

దొరికిపోయా కదా అని ఒక్కవీడియోతో ఆగలేదు హేమ. రెండోరోజున దమ్ బిర్యానీతో మళ్లీ వీడియో చేసింది. తనకు ఈ కేసుకు సంబంధం లేదని చెప్పాలని చాలా ప్రయత్నించింది కానీ.. ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. రెండ్రోజులు సోషల్ మీడియాలో హడావిడి చేసిన హేమ.. ఇప్పుడు సైలెంట్ అయింది. బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఉన్నట్లు నిర్థారణ అవ్వడంతో.. ముఖం కూడా చూపించడం లేదు. మరి పోలీసుల నోటీసులు అందుకున్న హేమ.. విచారణకు హాజరవుతుందో.. ఏదొక రీజన్ చెప్పి తప్పించుకుంటుందో చూడాలి.

ఇక ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిలో ఏ1గా వాసు, ఏ2గా అరుణ్ కుమార్, ఏ3గా నాగబాబు, ఏ4గా రణధీర్ బాబు, ఏ5గా మహ్మద్ అబూబకర్, ఏ6గా గోపాల్ రెడ్డి, ఏ7గా 68 మంది పురుషులు, ఏ8గా 30 మంది యువతులను చేర్చారు. డ్రగ్స్ మాత్రమే కాదు.. ఈ పార్టీలో వ్యభిచారం కూడా విచ్చలవిడిగా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కేణంలోనే దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Tags

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×