EPAPER

BCCI Punishes Shimron Hetmyer: ఆ వికెట్ ఎందుక్కొట్టావ్?.. హిట్ మేయర్ కి పెనాల్టీ..

BCCI Punishes Shimron Hetmyer: ఆ వికెట్ ఎందుక్కొట్టావ్?.. హిట్ మేయర్ కి పెనాల్టీ..
Shimron Hetmyer Punished After Smashing Stump During IPL 2024 Qualifier 2:

ఐపీఎల్ సీజన్ 2024 లో ఇంక ఒక్క మ్యాచ్ మాత్రమే బాకీ ఉంది. ఇంతవరకు మ్యాచ్ లు ఆలస్యంగా నిర్వహించినందుకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో కోతలే చూశాం. కానీ పనిలో పనిగా బీసీసీఐ ఒక ఆటగాడికి పెనాల్టీ కూడా విధించింది. అదేమిటంటే క్వాలిఫైయర్ 2 లో రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది.


మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 175 పరుగులు చేసింది. దీంతో లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఎదురీదుతోంది. ఈ దశలో వెస్టిండీస్ ఆటగాడు షిమ్రాన్ హెట్మెయిర్ క్రీజులోకి వచ్చాడు. కానీ తను కూడా పరుగులు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు.

అప్పుడు 14వ ఓవర్ జరుగుతోంది. ఈ దశలో అభిషేక్ శర్మ బౌలింగు చేస్తున్నాడు. అప్పటికి 10 బాల్స్ ఆడి 4 పరుగులు మాత్రమే చేసి ఉన్నాడు. కొడదామంటే బాల్ బ్యాట్ కి అందడం లేదు. అప్పటికే రన్ రేట్ పెరిగిపోతోంది. చాలా అసహనంగా ఉన్న సమయంలో క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అంతే ఒక్కసారి తన కోపం నషాలానికి అంటుకుంది. సహనం కోల్పోయాడు. తన కోపాన్ని అక్కడే ఉన్న వికెట్ల మీద చూపించాడు. బ్యాట్ ఇచ్చుకుని వాటికి ఒక్కటిచ్చాడు. అవి కుక్కపిల్లల్లా పెద్ద సౌండ్లు చేస్తూ కుయ్యోమొర్రో అంటూ ఎగిరి పడ్డాయి.


Also Read: హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ సాగిందిలా..

అంతే కాసేపటికి రాజస్థాన్ మ్యాచ్ ఓడిపోయింది. లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. అప్పుడు బీసీసీఐ ఒక శుభవార్త హెట్మెయిర్ కి చెప్పింది. “బాబూ.. నువ్వు కోపంతో వికెట్లను కొట్టేశావు.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.2 ప్రకారం .. లెవల్ 1 నేరానికి పాల్పడినట్టు తేలింది. అయితే ఈ నేరాన్ని అంగీకరించావు కాబట్టి, నీకు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించడమైనదని తెలిపింది.

ఇంతకీ ఈ పెనాల్టీ విధించింది మరెవరో కాదు.. భారత మాజీ పేసర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్ రిఫరీ గా ఉన్న జవగల్ శ్రీనాథ్.. మ్యాచ్ లో జరిగిన ఘటనపై బీసీసీఐకి నివేదించాడు. ఈ విషయంలో ఇంక బీసీసీఐ లోతులకి వెళ్లలేదని అందరూ అంటున్నారు. దీనిపై కూడా నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే మ్యాచ్ రిఫరీగా ఉన్న జవగల్ శ్రీనాధ్ కూడా ఈ శిక్ష సరిపోతుందని సూచించడం వల్లే హెట్మెయిర్ బతికిపోయాడని అంటున్నారు.

అయితే అక్కడ మ్యాచ్ లో పరిస్థితులు, ఆఖరి వికెట్ గా హెట్మెయిర్ మాత్రమే ఉన్నాడు. అదీకాక ఇదిఫైనల్ కి వెళ్లే ముందు  జరిగే నాకౌట్ మ్యాచ్, పరిస్థితుల ప్రతికూలత, చుట్టూ తీవ్ర ఒత్తిడి ఉండటం వల్ల హెట్మెయిర్ ఇలా చేశాడని భావించి, బీసీసీఐ చిన్న జరిమానాతో వదిలిపెట్టిందని నెటిజన్లు వ్యాక్యానిస్తున్నారు.  అంతేకాదు హెట్మెయిర్ పూర్వ చరిత్రలో కూడా ఇటువంటి ఘటనలు లేకపోవడంతో ఇది ప్రథమ తప్పిదంగా భావించి వదిలారని కొందరు అంటున్నారు.

Tags

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×