EPAPER

SRH vs RR Qualifier-2 Match Highlights: అటు నవ్వు, ఇటు ఏడుపు.. కట్ చేస్తే.. ఇటు నవ్వు.. అటు ఏడుపు

SRH vs RR Qualifier-2 Match Highlights: అటు నవ్వు, ఇటు ఏడుపు.. కట్ చేస్తే.. ఇటు నవ్వు.. అటు ఏడుపు

Ipl 2024 SRH vs RR Qualifier-2 Match Highlights: ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు? అనే పాటను ఎవరూ మరిచిపోలేరు. అలాంటి ఘటనే రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ మధ్య జరిగింది. ఆట ప్రారంభమైన దగ్గర నుంచి ముగిసే వరకు చెపాక్ స్టేడియంలో ఎమోషన్స్ అటూ, ఇటూ, ఇటూ అటూ ఊగిసలాడుతూనే ఉన్నాయి.


మొదట్లోనే టాస్ ఓడిపోయిన హైదరాబాద్ అని చెప్పగానే అభిమానులంతా డీలా పడిపోయారు. రాజస్థాన్ అభిమానులందరూ కేరింతలు కొట్టారు. ఇక మ్యాచ్ ప్రారంభమైంది. హైదరాబాద్ ఒక రేంజ్ లో ఆడుతుందని అంతా అనుకున్నారు. కానీ మొదటి ఓవర్ లోనే పంచ్ హిట్టర్ అభిషేక్ శర్మ ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి 12 పరుగులకి అవుట్ అయిపోయాడు.

వెంటనే స్టేడియంలో ఆనందాలు తారుమారయ్యాయి. అంతవరకు సిక్స్, ఫోరు కొట్టిన ఆనందం హైదరాబాద్ అభిమానుల్లో ఆవిరైపోయింది. అవుట్ అవగానే రాజస్థాన్ అభిమానులు కేరింతలు కొట్టారు. హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య పాప ముఖం కూడా వాడిపోయింది.


హైదరాబాద్ ఫోరు, సిక్స్ కొడితే కావ్య ముఖం చూపించడం, అవుట్ అయిన వెంటనే, ఆ ఏడుపు ముఖం ఎలా ఉందో చూపించడం కెమెరామెన్ కి ఇదే పనిగా మారింది. ఇక హైదరాబాద్ వికెట్లు ఠపాఠపా దీపావళి టపాసుల్లా పైకి ఎగిరి, కిందకు పడుతున్నాయి.

ఈ సమయంలో ఒకసారి స్టాండ్ లో కూర్చున్న కెప్టెన్ కమిన్స్ ని కెమెరామెన్ చూపించాడు. తను  ముఖం కూడా వాడిపోయి, విచారంతో కూర్చున్నాడు. మ్యాచ్ ఓడిపోతున్నామనే భావన అందరిలో స్పష్టంగా కనిపించింది. మొత్తానికి ఇలా హైదరాబాద్ అభిమానులు, టీమ్ మేనేజ్మెంట్, సిబ్బంది అందరూ పిచ్చి చూపులు  చూస్తూ కూర్చున్నారు.
రాజస్థాన్ బ్యాటింగ్ స్టార్టయ్యింది. అందరూ మెంటల్ గా డిసైడ్ అయ్యారు. చిన్న స్కోరు, వికెట్లను కాపాడుకుంటూ ఆడుతూ పాడుతూ కొడతారని భావించారు. కానీ మూడు ఓవర్లు గడిచేసరికి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఓపెనర్లు ఇద్దరూ బాల్ ని కొట్టడానికి తడబడుతున్నారు.అంటే పిచ్ మొండికేసింది. రాజస్థాన్ బ్యాటర్లకి కూడా అంతుచిక్కడం లేదు. దీంతో ఓపెనర్ టామ్ కొహ్లెర్ వాతావరణంలో గాలి లేక ఉక్కబోతతో చాలా ఇబ్బంది పడ్డాడు. ఇవన్నీ చూస్తున్న రాజస్థాన్ అభిమానులు ఏం జరుగుతుందో తెలీక స్టన్ అయిపోయి చూస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ అభిమానుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. ఆశలు నెమ్మదిగా తిరిగి ఊపిరి పోసుకుంటున్నాయి.

ఫస్ట్ వికెట్ పడింది..టామ్ కొహ్లెర్ 10 పరుగులు చేసి వెనుతిరిగాడు. హైదరాబాద్ జట్టులో అందరికీ పిచ్ పరిస్థితి అర్థమైంది. ఆ ప్రకారం బౌలింగు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో యశస్వి ఒక్కసారి బ్యాట్ ఝులిపించాడు. ఫటాఫట్ మని భువనేశ్వర్ బౌలింగులో 19 పరుగులు చేసి పారేశాడు. దీంతో రన్ రేట్ ఒక్కసారి పైకి లేచి, సమానమైపోయింది. మళ్లీ మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోకి వెళ్లినట్టే అనిపించింది.

దీంతో కావ్య పాప కళ్లల్లో విచారం.. మొఖం ఇలా పెట్టుకుని ఎటో చూస్తూ కనిపించింది. ఆ పక్కనే స్టాండులో ఒక చిన్నారి పాపని చూపించారు. తను ఎగిరి గంతులేస్తోంది.

సీన్ కట్ చేస్తే.. రాజస్థాన్ వికెట్లు ఠపఠపామని పడిపోయాయి. 139 పరుగులకి కథ ముగిసిపోయింది. దీంతో ఒక్కసారి స్టేడియంలో హైదరాబాద్ అభిమానుల ఆనందం రెట్టింపయ్యింది. కావ్య పాప ఆనందంతో గెంతులేసింది. అక్కడే ఉన్న తండ్రి కళానిధి మారన్ ని వెళ్లి సంతోషం పంచుకుంది.

ఇదిలా ఉండగా ఇంతకుముందు నవ్వుతు తుళ్లుతూ కనిపించిన చిన్నారి ఏడుస్తూ కనిపించింది. ఒకటే ఏడుపు 14 ఓవర్ దగ్గర నుంచి మొదలెట్టిన ఏడుపు చివరి వరకు కంటిన్యూ అయ్యింది. అలా నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఉంది. ఒకొక్కసారి తనుకు తానే సంభాళించుకుంటూ, నిగ్రహించుకుంటూ, కర్చీఫ్ తో తుడుచుకుంటూ చాలా అవస్థలు పడింది.

క్రికెట్ మ్యాచ్ అంటేనే ఒక ఎమోషన్ గేమ్.. భారతీయుల బ్లడ్ లోకి అంతగా వెళ్లిపోయింది. ఆనందం వచ్చినా తట్టుకోలేరు, దుఖం వచ్చినా తట్టుకోలేరు. అంత బలహీన మనసులైపోయారనే కామెంట్లు నెట్టింట వినిపిస్తున్నాయి.

మన ఎమోషన్స్ తో ఆటలాడే ఇలాంటి ఆటలను బ్యాన్ చేయాలని, క్రికెట్ అంటే టైమ్ వేస్ట్ అని నమ్మేవాళ్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఇలా మ్యాచ్ ముగిసింది. హైదరాబాద్ ఫైనల్ ముంగిట అడుగుపెట్టింది.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×