EPAPER

Sanju Samson: ఇవే మా ఓటమికి కారణాలు: సంజూ శాంసన్

Sanju Samson: ఇవే మా ఓటమికి కారణాలు: సంజూ శాంసన్

Sanju Samson Gave Reason for Defeat Against SunRisers Hyderabad: మేం అనుకున్నదొకటి, జరిగింది మరొకటి అని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నాడు. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి అనంతరం మాట్లాడుతూ.. టాస్ గెలిచి కూడా ఓటమి పాలయ్యామని అన్నాడు. టాస్ గెలిచిన తర్వాత సగం విజయం సాధించినట్టే అనుకున్నామని తెలిపాడు. అదే మా పాలిట శాపంగా మారిందని మ్యాచ్ లో దిగాక తెలిసిందని అన్నాడు.


పిచ్ పై మంచు పడుతుందని అనుకున్నాం.. కానీ పడలేదు. అంతేకాదు మేం ఊహించిన విధంగా పిచ్ లేదు. అది సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో పూర్తిగా మారిపోయింది. బంతి బాగా టర్న్ అయ్యింది. అదంతా డ్యూ ప్రభావం వల్ల జరిగింది. దాన్ని ప్రత్యర్థి బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు.

అయితే ఇదే పిచ్ పై, ఇదే బౌలర్లతో యశస్వి చక్కగా ఆడాడు. అలాగే అందరూ ఆడి ఉంటే, తప్పకుండా గెలిచేవాళ్లమని అన్నాడు. అలా చూస్తే మా బ్యాటర్లు విఫలమయ్యారనే చెప్పాలని అన్నాడు. వాళ్లు అద్భుతంగా బౌలింగు చేసి ఉండవచ్చు, కానీ టార్గెట్ తక్కువే కాబట్టి, రిస్క్ షాట్లకు వెళ్లకుండా నెమ్మదిగా ఆడాల్సింది.. వ్యూహం మార్చాల్సింది.. అవి రెండూ జరగలేదని అన్నాడు.


Also Read: క్వాలిఫైయర్-2లో సన్‌రైజర్స్ సూపర్ విక్టరీ.. ఫైనల్‌కి SRH

నిజానికి ఇది నాకౌట్ మ్యాచ్. ఇంతకు ముందు గెలిచినవన్నీ ఒక ఎత్తు.. ఇప్పుడు ఆడటం ఒక ఎత్తు. ఇలాంటి పెద్ద మ్యాచ్ లో ఓటమి పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే మా బౌలింగ్ ప్రదర్శన పట్ల గర్వపడుతున్నానని అన్నాడు. నిజంగా హైదరాబాద్ లో ఉన్న హార్డ్ హిట్టర్లను 175 పరుగులకి నిలువరించారని కొనియాడాడు.

బ్యాటింగ్ వైఫల్యం వల్ల తక్కువ స్కోరుని ఛేదించలేకపోయామని అన్నాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో సన్‌రైజర్స స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు మా దగ్గర ఆప్షన్స్ లేవు. అదే మా పతనాన్ని శాసించిందని ఓపెన్ గా చెప్పాడు.

లెఫ్టార్మ్ స్పిన్‌లో బంతి ఆగి వచ్చింది. మే రివర్స్ స్వీప్ షాట్స్‌తో పాటు క్రీజును బాగా ఉపయోగించుకొని ఆడాల్సింది. అయితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. మేం మూడేళ్లుగా అద్భుతంగా ప్రదర్శన చేస్తున్నాం. ఇదంతా మా ఫ్రాంచైజీ వల్లే సాధ్యమైంది. వారిచ్చిన స్వేచ్ఛ కారణంగానే ఇంతదూరం వచ్చాం.

అంతేకాదు దేశానికి మేం ప్రతిభ కలిగిన ఆటగాళ్లను అందజేస్తున్నాం. రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ భవిష్యత్తులో భారత జట్టు తరఫున కూడా రాణిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

Related News

Rohit Sharma: 2027 వరకు రోహిత్ శర్మనే కెప్టెన్..కాంగ్రెస్ ప్రకటన

Mohammed Shami: మహమ్మద్ షమీది దొంగ ప్రేమ..మాజీ భార్య హాసిన్ సంచలనం!

Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

Rashid Khan: పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌..ఒకే రోజూ 4 గురికి !

T20 World Cup: నేడు మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌

Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

Big Stories

×