EPAPER

AP EAPCET 2024 Key: ఏపీ ఈఏపీసెట్ ప్రిలిమినరీ కీ విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండిలా !

AP EAPCET 2024 Key: ఏపీ ఈఏపీసెట్ ప్రిలిమినరీ కీ విడుదల.. డౌన్ లోడ్ చేసుకోండిలా !

AP EAPCET 2024 Key Released: ఏపీ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ ప్రిలిమినరీ కీని ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. నిన్న అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ కీని అధికారులు రిలీజ్ చేశారు.


మే 26 లోపు అభ్యంతరాలను పంపాల్సి ఉంటుంది. మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, రెస్పాన్స్ షీట్లు కూడా అందుబాటులో ఉంచారు. https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి ప్రిలిమినరీ కీ డైన్లోడ్ చేసుకోవచ్చు.

ఇంజనీరింగ్ కీని ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..


ఏపీ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక కీ కోసం పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అనంతరం హోం పేజీలో కనిపించే master question paper & preliminary keys for AP EAPCET 2024 అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. తర్వాత పరీక్ష రాసిన వివరాలు కనిపిస్తాయి. అందులో ఏ సెషల్ లో మీరు పరీక్ష రాసారో అక్కడ క్లిక్ చేయాలి. అప్పుడు ప్రాథమిక కీ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది. అనంతరం ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు. ఎవరికైనా కీపై అభ్యంతరాలు ఉంటే వాటిని మే 26 ఉదయం 10 గంటలలోపే వెబ్ సైట్ ద్వారానే పంపించాలి.

Also Read: Wine Shops Will Close in TG : మందుబాబులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. తెలంగాణలో షాపులు బంద్

రెస్పాన్స్ షీట్ల కోసం..

ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష రాసిన విద్యార్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే Response sheet for AP EAPCET – 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

ఏపీ ఈఏపీసెట్ కాకినాడ జేఎన్ టీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 93.47 శాతం మంది విద్యార్థులు బైపీసీ, ఎంపీసీతో పాటు రెండు స్ట్రీమ్ లకు హాజరయ్యారు. ఏపీలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ , ఫార్మసీ ప్రవేశాల కోసం ఈఏపీసెట్ నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,58,373 మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్ అండ్ పార్మసీలో విభాగంలో 91.12 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

Tags

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×