EPAPER

Virat Kohli’s One8 Commune Restaurant: హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ హోటల్.. కొహ్లీ పిలిచాడు.. మీరు వస్తున్నారా..?

Virat Kohli’s One8 Commune Restaurant: హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ హోటల్.. కొహ్లీ పిలిచాడు.. మీరు వస్తున్నారా..?
Virat Kohli’s One8 Commune Restaurant’s Grand Launch in Hyderabad: ఏమిటి ఆశ్చర్యపోతున్నారా? అవునండీ అవును.. నిజంగానే క్రికెట్ రారాజు విరాట్ కొహ్లీ హైదరాబాద్ ప్రజలకి ఒక పిలుపునిచ్చాడు. మీరందరూ తప్పక రండీ అన్నాడు.. ఇంతకీ ఏమిటా సంగతి? అనుకుంటున్నారా? అయితే వినండీ… విరాట్ కొహ్లీ ఇప్పటికే వస్త్ర వ్యాపారంలో ఉన్నాడు. అలాగే ‘కొహ్లీ వన్ 8 కమ్యూన్ ’పేరుతో హోటళ్ల వ్యాపారంలోకి కూడా వచ్చాడనే సంగతి చాలా కొద్దిమందికే తెలుసు.
ప్రస్తుతం దేశంలోని ముంబై, పుణె, కోల్ కతా, ఢిల్లీ, బెంగళూరులో ఇలా పలు చోట్ల కొహ్లీ రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ హైటెక్ సిటీలోని హార్డ్ రాక్ కేఫ్ కు సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలో నేడు హోటల్ ని ప్రారంభించనున్నట్టు కొహ్లీ తన ఇన్ స్టాలో తెలిపాడు.
ఇంతకీ తను ఏమన్నాడంటే.. నేను మీతో ఒక కొత్త విషయం షేర్ చేసుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మేం ఇప్పటికే హైదరాబాద్ లోని హైటెక్ సిటీ మధ్యలోకి వచ్చేశాం. నాకు వన్ 8 కమ్యూన్ అనేది కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు, ఇది హైదరాబాద్ లోని ప్రజలందరినీ ఒక చోటకు చేర్చడమే మా ప్రధాన ఉద్దేశం అని అన్నాడు.అందుకే నా ఆహ్వానాన్ని మన్నించి హైదరాబాద్ ప్రజలందరూ తప్పకుండా హోటల్ కి రావాలని కోరాడు.

రెస్టారెంట్ చూసేందుకు చాలామంది ఇప్పిటికే వస్తున్నారు. అయితే కొహ్లీ బిజినెస్ పార్టనర్ వర్తిక్ తిహార్ మాట్లాడుతూ కొహ్లీకి హైదరాబాద్ అంటే చాలా ఇష్టమని అన్నాడు. మొదట బెంగళూరులో ప్రయోగాత్మకంగా ఓపెన్ చేశాం. అది సక్సెస్ కావడంతో దేశంలోని పలుచోట్ల ప్రారంభించామని అన్నాడు.హోటల్ లో గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల లోకలు రుచులు కూడా ఉంటాయని అన్నాడు.


ఇక అందరికీ నచ్చే హైదరాబాద్ బిర్యానీ తప్పక ఉంటుందని అన్నాడు. అలాగే కొహ్లీకి బాగా ఇష్టమైన మష్రూమ్ డిమ్ సమ్ కూడా ఇక్కడ రెడీగా ఉందని అన్నాడు. అయితే ప్రారంభోత్సవం తర్వాత ఒక్కసారైనా విరాట్ హోటల్ ని చూడాలని నగరవాసులు, ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారని అంటున్నారు.


Related News

Rishabh Pant: రిషబ్ పంత్ కోలుకోవడం కష్టమే.. సర్జరీ అయిన చోటే వాపు..?

Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

IPL 2025: సన్‌రైజర్స్‌కు డేల్ స్టెయిన్ గుడ్ బై !

Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !

Ind vs Nz : చుక్కలు చూపించిన న్యూజిలాండ్‌…46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా..!

Ind Vs Nz: బెంగుళూరు టెస్ట్.. కష్టాల్లో టీమిండియా! 46 పరుగులకే ఆలౌట్

Ind vs NZ: తగ్గిన వర్షం..టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న టీమిండియా…జట్లు ఇవే

Big Stories

×