EPAPER

India-Pakistan T20 WC 2024 Match Ticket Price: భారత్- పాకిస్తాన్ మ్యాచ్.. టికెట్ ధరపై రచ్చ రచ్చ.. ఒక్కో టికెట్ ఏకంగా రూ. 16.55 లక్షలు..?

India-Pakistan T20 WC 2024 Match Ticket Price: భారత్- పాకిస్తాన్ మ్యాచ్.. టికెట్ ధరపై రచ్చ రచ్చ.. ఒక్కో టికెట్ ఏకంగా రూ. 16.55 లక్షలు..?
India-Pakistan T20 World Cup Match Ticket Costs is Rs 16.55 Lakhs: ప్రపంచ క్రికెట్ లో ఎన్నో దేశాలు, ఎన్నో మ్యాచ్ లు ఆడుతుంటాయి. కానీ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్, ఆ కిక్ వేరే  లెవల్ అని చెప్పాలి. జూన్ 1 నుంచి జరగనున్న టీ 20 ప్రపంచకప్ లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ ధరను చూసి అందరూ కళ్లు తేలేస్తున్నారు. ఇంతకి ఆ టికెట్ ఎంతనుకుంటున్నారు..?

ఒక టికెట్టు రూ.16.55 లక్షలండీ బాబూ.. జూన్ 5న ఇండో-పాక్ మ్యాచ్ జరగనుంది. మొదట అనుకున్న ధరల ప్రకారం 300-10,000 డాలర్ల వరకు ఉన్నాయి. కానీ మ్యాచ్ కి వస్తున్న క్రేజ్ ను చూసి ఐసీసీ డైమండ్ క్లబ్ అని ఒకటి పెట్టి, అక్కడ టికెట్ ను 20 వేల డాలర్లు రేటు పెట్టడం చూసి క్రికెట్ అభిమానులు విస్తుపోతున్నారు. అంతేకాకుండా ఐసీసీపై నెట్టింట దాడికి దిగారు. ఇలా మ్యాచ్ లు  పెట్టి, డబ్బులు సొమ్ములు చేసుకోవాలని అనుకోవడం అనైతికం అని తిట్టిపోస్తున్నారు.


దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. ఐసీసీకి ఉన్న గౌరవాన్ని తగ్గించుకున్నట్టయ్యింది. ఆటలంటే రెండు దేశాలను కలిపేవి, వారి మధ్య సయోధ్యను కుదిర్చేవిగా ఉండాలి గానీ, కొత్త సినిమా రిలీజైనప్పుడు బ్లాక్ టికెట్లు అమ్ముకునే వారిలా వ్యవహరించకూడదని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఐసీసీ లాంటి క్రికెట్ దిగ్గజ సంస్థ ఈ స్థాయికి దిగజారిపోవడం, కమర్షియల్ గా వ్యవహరించడం సరికాదని అంటున్నారు.

Also Read: ఫైనల్ కి వెళ్లేదెవరు? రేపు రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్


ఈ వ్యవహారంపై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ తీవ్ర విమర్శలు చేశాడు. డైమండ్ క్లబ్ లో టికెట్ ధర 20 వేల డాలర్లని తెలిసి ఆశ్చర్యపోయాను. అమెరికాలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒక అగ్ర దేశంలో… ఈ ఆటను విస్తరించాలనే భావంతో చేస్తున్న ఒక మంచి ప్రయత్నమని అన్నారు. అంతేగానీ ఇంతింత టికెట్లు పెడితే ఉన్న ఆసక్తి చచ్చిపోతుందని ఘాటుగా విమర్శించారు.

ప్రపంచంలో ఇన్నిదేశాలుండగా కేవలం 10 దేశాలు మాత్రమే రెగ్యులర్ క్రికెట్ ఆడుతున్నాయి. మిగిలిన దేశాలకు కూడా క్రికెట్ ఆటను పరిచయం చేయాలి. అది వదిలేసి వచ్చిన కాడికి దండుకుందామనే పద్ధతి కరెక్టు కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇలాగైతే ప్రపంచానికి క్రికెట్ ని పరిచయం చేసే సువర్ణావకాశం మిస్ అవుతుందని విమర్శిస్తున్నారు. మొత్తానికి టికెట్ల వ్యవహారంతో ఐసీసీకి తలబొప్పి కడుతోంది.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×