EPAPER

Oppo Reno 12, 12 Pro Launch: ఒప్పో నా మజాకా.. రెండు ఫోన్లను దింపేసింది.. ఇవి మనకు పర్‌ఫెక్ట్..!

Oppo Reno 12, 12 Pro Launch: ఒప్పో నా మజాకా.. రెండు ఫోన్లను దింపేసింది.. ఇవి మనకు పర్‌ఫెక్ట్..!

Oppo Reno 12 and Reno 12 Pro Launched: ఒప్పో స్మార్ట్‌ఫోన్ కంపెనీ తన బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు రెనో 12 సిరీస్‌ను చైనాలో విడుదల చేసింది. అయితే భారత్‌లో మార్కెట్‌లోనూ త్వరలో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ లైనప్‌లో రెనో 12, రెనో 12 ప్రో మోడల్‌లు ఉన్నాయి. ఇవి అనేక అధునాతన ఫీచర్‌లతో ఉంటాయి. రెండు ఫోన్‌లు కర్వ్‌డ్ OLED డిస్‌ప్లేలు, 50MP ట్రిపుల్ కెమెరాలు, మరెన్నే స్టన్నింగ్ ఫీచర్లను కలిగి ఉంది. రెండు ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.


Oppo Reno 12- Reno 12 Pro Specifications
ముందుగా బేస్ మోడల్ Oppo Reno 12 గురించి మాట్లాడితే ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1200 nits వరకు పీక్ బ్రైట్‌నెస్, 2160Hz PWM dimmingతో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో పొడవైన 6.7-అంగుళాల వంపు OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. రెనో 12 మీడియా టెక్ డైమెన్సిటీ 8250 స్టార్ స్పీడ్ ఎడిషన్ SoCని కలిగి ఉంది. ఇది 16GB RAM+512GB స్టోరేజ్‌తో వస్తుంది. పవర్ కోసం 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Oppo Reno 12 కెమెరా కోసం ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OIS (Sony LYT-600), 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2x ఆప్టికల్‌తో 50-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం మీరు ముందు భాగంలో 50-మెగాపిక్సెల్ కెమెరాను చూస్తారు. దీంతో మీరు స్పష్టమైన ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. ఇది Android 14 OS ఆధారిత ColorOS 14 కస్టమ్ స్కిన్‌పై రన్ అవుతుంది.


Also Read: రూ.6వేలకే రెడ్‌మీ ఫోన్.. ఆలస్యం చేయకుండా కొనేయండి!

Oppo Reno 12లో ఇతర ఫీచర్లలో IR బ్లాస్టర్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్, స్టీరియో స్పీకర్లు, బ్లూటూత్ 5.4, Wi-Fi 6 ఉన్నాయి.

Oppo Reno 12 Pro గురించి మాట్లాడితే మీరు ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల పెద్ద కర్వ్‌డ్ OLED డిస్‌ప్లేను పొందుతారు. ఇది FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz PWM డిమ్మింగ్‌తో 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. రెనో 12 ప్రో డైమెన్సిటీ 9200+ స్టార్ స్పీడ్ ఎడిషన్ చిప్‌సెట్ ద్వారా  పనిచేస్తుంది. 16GB RAM +512GB స్టోరేజ్‌తో వస్తుంది. Reno 12 Pro పెద్ద 5,000mAh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. ఇది 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Oppo Reno 12 Pro కెమెరా విషయానికొస్తే OISతో 50-మెగాపిక్సెల్ Sony IMX890 సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్‌ను కలిగి ఉంది. బేస్ మోడల్ లాగా ప్రో వేరియంట్‌లో 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కూడా ఉంది. పరికరం Android 14 OS ఆధారిత ColorOS 14 కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రన్ అవుతుంది.

Also Read: Amazon Mobile Offers 5g: ఏంది భయ్యా ఇది.. ఐఫోన్, వన్‌ప్లస్ మరీ ఇంత చీపా.. అమెజాన్ సమ్మర్ డీల్స్‌ అదిరిపోయింది..!

Oppo Reno 12 Pro గురించి మీరు తెలుసుకోవలసిన ఇతర ఫీచర్లలో బ్లూటూత్ 5.4, IP65 వాటర్ , డస్ట్ రెసిస్టెన్స్, స్టీరియో స్పీకర్లు, Wi-Fi 6, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Oppo Reno 12, Reno 12 Pro Price
Reno 12,Reno 12 Pro రెండూ చైనాలో బేస్ వేరియంట్ సిల్వర్, బ్లాక్, పీచ్‌ కలర్‌లో వస్తుంది. 12 Pro మోడల్ బ్లాక్, పర్పుల్, గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. దీని మొదటి సేల్ మే 31, 2024న ప్రారంభమవుతుంది.

Also Read: రియల్‌మీ అదరకొట్టింది.. రూ.12 వేలకే 5G ఫోన్.. ఇలా చవకగా మొదటిసారి!

Oppo Reno 12 Price

  • 12GB +256GB: 2,699 యువాన్ (సుమారు రూ. 31,020)
  • 12GB+512GB: 2,999 యువాన్ (సుమారు రూ. 34,468)
  • 16GB+256GB: 2,999 యువాన్ (సుమారు రూ. 34,468)
  • 16GB+512GB: 3,199 యువాన్ (సుమారు రూ. 37,500)

Oppo Reno 12 Pro Price

  • 12GB +256GB: 3,399 యువాన్ (సుమారు రూ. 39,846)
  • 12GB +512GB: 3,699 యువాన్ (సుమారు రూ. 43,363)
  • 16GB +512GB: 3,999 యువాన్ (సుమారు రూ. 46,880)

Tags

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×