EPAPER

PM Modi Counter on Age Remarks: సొంత, విపక్షాలకు కౌంటర్.. 2047 వరకు.. పీఎం మోదీ క్లారిటీ!

PM Modi Counter on Age Remarks: సొంత, విపక్షాలకు కౌంటర్.. 2047 వరకు.. పీఎం మోదీ క్లారిటీ!

PM Modi Counter on Age Remark: సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీలో కొత్త చర్చ మొదలైంది. మోదీ తర్వాత నెక్ట్స్ ప్రధాని ఎవరు? ఒకవేళ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తేనే.. పార్టీ నిబంధనల ప్రకారం మరో ఏడాది మాత్రమే మోదీ ఆ పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత ఎవరు? అమిత్ షా లేక మరెవరైనా ఉన్నారా? ఇదే చర్చ జాతీయస్థాయిలో కొనసాగుతోంది. బీజేపీలో ప్రస్తుత నేతకు వయసు అయిపోయిందని , ఏడాది తర్వాత రిటైర్మెంట్ కావచ్చని ప్రత్యర్థి పార్టీలు కామెంట్స్ చేస్తున్నాయి.


ఈ ప్రచారానికి తనదైన శైలిలో పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రత్యేక కార్య సాధన కోసం భవవంతుడు తనను పంపించాడని చెప్పుకొచ్చారు. లక్ష్యసాధన కోసం 2047 వరకు 24 గంటలు పని చేసేలా దేవుడు తనను నియమించాడని భావిస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు.  ఈ యవ్వారంపై సొంత పార్టీలో జరుగుతున్న చర్చ, అటు విపక్షాలకు కౌంటరిచ్చేశారు మోదీ.

ఇటీవల ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దేవుడు తనకు మార్గం చూపించాడని, శక్తి ఇస్తున్నాడని తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధిస్తాననే పూర్తి విశ్వాసం ఉందన్నారు. అప్పటివరకు దేవుడు తనను వెనక్కి పిలవడని అనుకున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలో ఇక్కడ తప్ప మరెక్కడా తనకు చోటు లేదని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ.


Also Read: మహానటులు.. కవర్ చేద్దాం అనుకున్నారు.. అడ్డంగా దొరికిపోయారు!

మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పద్దతిని తీసుకొచ్చారు. 75 ఏళ్లు నిండిన వారు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ఇవ్వాలనే నిబంధన తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌జోషి, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పతోపాటు మరికొందరు నేతలు రాజకీయాలకు దూరమయ్యారు. ఈ లెక్కన మరో ఏడాదితో మోదీ రిటైర్మెంట్ సమయం వచ్చేసింది. ఈ విషయాన్ని సొంత పార్టీలోని నేతలు చర్చించుకోవడం మొదలైంది. మోదీ తర్వాత అమిత్ షాతోపాటు పలువురు నేతలు ఆయన కుర్చీ కోసం పోటీ పడుతున్నట్లు ఢిల్లీ సర్కిల్స్‌లో వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో ఆయా వార్తలకు ప్రధాని మోదీ ఈ విధంగా ఫుల్‌స్టాప్ పెట్టారు.

యూపీలోని ఎన్నికల సభలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. బీజేపీ లో పెద్దవాళ్లకు రిటైర్‌మెంట్ వయసు దగ్గరకు వచ్చిందని మహా అంటే ఏడాది మాత్రమే ఉంటారన్నారు. దీని తర్వాత ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ వయసును ఉద్దేశించి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు 77 ఏళ్లు వచ్చాయని, అనేక సమస్యలు వెంటాడుతాయని,  రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుందని ఒడిషా ప్రచారంలో చెప్పుకొచ్చారు. దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్లు పడిపోయాయి. మోదీ తర్వాత ఆ కుర్చీ కోసం అమిత్‌షా పోటీ పడుతున్నారని చిదంబరం తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఎన్నికల వేళ జరుగుతున్న ఈ తరహా ప్రచారానికి ప్రధాని మోదీ తనదైనశైలిలో ఫుల్‌స్టాప్ పెట్టారని అంటున్నారు. మరి బీజేపీలో మిగతా నేతల మాటేంటన్నది కొత్త సమస్య.

Tags

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×