EPAPER

Bangalore Rave Party Case: డ్రగ్స్ తీసుకున్న నటి హేమ మరియు హీరోయిన్ అషి రాయ్.. నార్కో డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్!

Bangalore Rave Party Case: డ్రగ్స్ తీసుకున్న నటి హేమ మరియు  హీరోయిన్ అషి రాయ్.. నార్కో డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్!

ఈమె పేరు అషి రాయ్.. హిరోయిన్.. విన్నారుగా తాను ఏం చెబుతుందో.. ఆడపిల్లను.. నన్ను బద్నాం చేయకండి ప్లీజ్ అంటూ వేడుకుంది. For Your Kind Information.. ఇమె కూడా డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్‌ తేలిన నటే. వీరు మన సినిమా నటులు.. నిజానికి నటన స్క్రీన్‌పై చేస్తే చప్పట్లు కొడతారు. అదే రియల్ లైఫ్‌లో.. ఇలాంటి బేకార్‌ పనులను కవర్ చేయడానికి చేస్తే చీవాట్లు పెడతారు. యస్.. అసలు కేసు కంటే.. ఇప్పుడు వీళ్లు చేసిన ఓవరాక్షన్‌ పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది.

హేమ కావొచ్చు.. అషిరాయ్ కావొచ్చు.. పార్టీ ఆర్గనైజ్ చేసిన వాసు కావొచ్చు.. మరికొందరు నటులు కావొచ్చు.. వీరి నటన సామర్థ్యం చూస్తే అందరూ అవాక్కవ్వాల్సిందే.. ముక్కున వేలేసుకోవాల్సిందే.. వీరే కాదు.. పార్టీలో 150 మంది పాల్గొన్నారు.. వీరందరికి నార్కో డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. వీరిలో 59 మంది మగవాళ్లకు.. 27 మంది ఆడవాళ్లకు పాజిటివ్ వచ్చింది. ఈ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరీకి పాజిటివ్ రావడం మరో హైలేట్..


Also Read: Ranveer Singh – Prasanth Varma: 3 రోజుల షూటింగ్ తర్వాత ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న రణవీర్.. ఎందుకో తెలుసా?

చేసిందే తప్పు.. దాన్ని కవర్ చేయడానికి జనాలను పిచ్చోళ్లను చేయడం మరో పెద్ద తప్పు.. ఇన్నీ చేసి.. మేడమ్ నిన్న సుమతి శతకాలు చెప్పారు. మరీ ఈ రోజు దొరికిపోయారు కదా.. మీ కామెంట్ ఏంటి అని అడిగితే.. హేమ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా.. ఏం చేస్తారో చేసుకోండి అని.

ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. కర్ణాటక పోలీసులకు హేమ అన్న పేరే తెలీదు.. ఎందుకంటే పార్టీలో ఆమె కృష్ణవేణి అన్న పేరుతో రిజిస్ట్రర్ చేసుకుంది. అఫ్‌కోర్స్ ఆమె అసలు పేరు కూడా అదేలేండి.. దీంతో ఆమె హేమ ఓ మూవీ ఆర్టిస్ట్ అని వారికి కూడా తెలీదు. ఎప్పుడైతే హేమ గురించి న్యూస్‌లో రావడం స్టార్టయ్యిందో.. అప్పుడే తెలిసింది పోలీసులకు ఆమె గురించి.

ఇప్పుడు నెక్ట్స్‌ ఏం జరుగుతోంది? ఈ ప్రశ్నకు పెద్దగా ఏం జరగదనే చెప్పాలి.. డ్రగ్స్ అమ్మేవాళ్లని నేరస్థులుగా చూస్తుంది చట్టం. బట్.. ఇలా తక్కువ మోతాదులో తీసుకున్న వాళ్లని బాధితులుగా చూస్తుంది. సో.. హేమ, అషి.. ఇలా మిగతా వారందరు దాదాపుగా బాధితులే.. వీళ్లందరికి కౌన్సిలింగ్ ఉంటుంది.. అంతకు మించి ఇంకా జరిగేది ఏమీ ఉండదు. బట్.. వీరందరు డ్రగ్స్ తెలియకుండానే తీసుకున్నారా? మొదటిసారి తీసుకున్నారా? అనేది వారి మనస్సాక్షులకే తెలియాలి. వీటి గురించి తెలియని వారికి కౌన్సిలింగ్ ఓకే.. బట్ అంతా తెలిసే ఇలాంటి పార్టీల్లో పాల్గొంటున్న వారిని ఏమనాలి?

Also Read: ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయను: కేజ్రీవాల్

ఇప్పుడు మరో కోణంలో చూద్దాం.. అసలు ఈ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? ఎంత మొత్తంలో వచ్చాయి? వాటిని సప్లై చేసింది ఎవరు? వారికి ఆ డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి? వీటి ORIGIN ఏంటి? దేశాలు, రాష్ట్రాల సరిహద్దులు ఎలా దాటుతున్నాయి? వీటి పైన కదా పోలీసులు అసలు ఫోకస్ చేయాల్సింది. బట్ అది జరుగుతుందా? జరగడం లేదు. ఏదో నాలుగు రోజుల హడావుడి.. ఆ తర్వాత మర్చిపోవడం.. సో ఈసారైనా కాస్త స్ట్రిక్ట్‌గా యాక్షన్‌ తీసుకొండి జరా..

ఇప్పుడు మన మూవీ ఇండస్ట్రీ విషయానికి వద్దాం.. మీరు ఇలాంటి గలీజ్‌ పనులు చేసి సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు. మూవీ ఇండస్ట్రీలో పార్టీలు కామనే.. కానీ మనం రోజురోజుకు ఏ స్థాయికి దిగజారి పోతున్నామనేది కూడా కాస్త చూసుకోవాలి. ఇలాంటి కేసుల్లో ఉన్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో కూడా ఇండస్ట్రీ పెద్దలు చెప్పాలి.. ఒకరిపై చర్యలు తీసుకుంటేనే.. మరొకరు చేయకుండా ఉంటుంది.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×