EPAPER

Actor Naresh on Chandu Suicide: పవిత్ర మరణించాక చందు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో చెప్పిన సీనియర్ హీరో నరేష్

Actor Naresh on Chandu Suicide: పవిత్ర మరణించాక చందు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో చెప్పిన సీనియర్ హీరో నరేష్

Actor Naresh on Chandu Suicide: త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెల్సిందే. ఇక ఆమె మరణాన్ని తట్టుకోలేక ఆమె ప్రియుడు చంద్రకాంత్ అలియాస్ చందు కూడా ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. పవిత్ర లేని ఈ లోకంలో తాను ఉండలేకపోతున్నాని తెలుపుతూ మే 17 రాత్రి.. తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


పవిత్రా జయరామ్‌కి 16 ఏళ్లకే పెళ్లి కాగా.. 20 ఏళ్లకు భర్తతో విడిపోయారు. కాగా, ఈమెకి ఓ కూతురు కొడుకు ఉన్నారు. కొడుకు వయసు 22 ఏళ్లు కాగా.. కూతురు వయసు 19 ఏళ్లు. ఇక చంద్రకాంత్‌కి కూడా పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. 12 ఏళ్ల పాటు గాఢంగా ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న చందు.. పవిత్ర పరిచయం అయ్యాకా భార్యను వదిలి పవిత్రతో కలిసి ఉంటున్నాడు.

ఇంకోపక్క చందు భార్య కూడా తమ దాంపత్య జీవితం చాలాకాలం అన్యోన్యంగానే సాగిందని, చందు జీవితంలోకి పవిత్ర ఎంటర్ కావడంతోనే తామిద్దరి మధ్య దూరం పెరిగిందన్నారు. తమ వివాహ బంధానికి గుర్తుగా ఎనిమిదేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడని తెలిపారు. పవిత్ర వల్ల విభేదాలు తలెత్తాయని, నాలుగేళ్లుగా దూరంగా ఉంటున్నామని తెలిపారు. పిల్లలతోనే కాంటాక్ట్ లో ఉండేవాడని, ఎప్పటికైనా మనసు మార్చుకుని తిరిగి వస్తారని ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.


Also Read: Actress Kavitha: పెళ్లి తరువాత ఆ కండీషన్ పెట్టా.. పిల్లలు పుట్టి చనిపోవడం.. ఎమోషనల్ అయిన కవిత

భార్య పిల్లలను అందాలను చేసి ప్రియురాలు లేని లోకంలో ఉండలేనని చందు మృతి చెందాడు. అయితే చందు ఇలా చేసుకోవడానికి కారణం ఇదే అంటూ సీనియర్ నటుడు నరేష్ చెప్పుకురావడం హాట్ టాపిక్ గా మారింది. విజయ నిర్మల కొడుకుగా తెలుగుతెరకు పరిచయమైన నరేష్ ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. నటన విషయంలో ఆయనకు వంక పెట్టడం అనేది ఎవరితరం కాదు. కానీ, ఆయన వ్యక్తిగతంగా మూడు పెళ్లిళ్లు చేసుకోవడం, ఇప్పుడు పవిత్ర నరేష్ తో సహజీవనం చేయడం ఇవన్నీ విమర్శలు గుప్పించేవిధంగానే ఉన్నాయి.

తాజాగా నరేష్.. చందు మరణంపై మాట్లాడాడు. ఒక ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడుతూ.. ” అంతా వారే సర్వస్వము అనుకునేవారు మన నుంచి దూరమైతే బాధ పడతాము. ఆ సమయంలో వారిని ఓదార్చడానికి కుటుంబం కానీ, వారిని ఓదార్చేవారు దగ్గర ఉండాలి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒకరికి బాధ కలిగింది అంటే మిగతావారు ఓదార్చేవారు. ఇప్పుడు అలా లేదు. అమ్మ విజయనిర్మల చనిపోయినప్పుడు నేను, కృష్ణ గారు ఎంతో బాధపడ్డాం. ఒకరిని ఒకరు ఓదార్చుకున్నాం. అలా ఇద్దరం బయటపడ్డాం.

Also Read: Manchu Lakshmi: బెంగుళూరు రేవ్ పార్టీ గురించి ప్రశ్న.. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఫైర్ అయిన మంచు లక్ష్మీ

చందు విషయంలో ఇది జరగలేదు. అతడి ఓదార్చేవారు లేకపోయేసరికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఎంతగానో ప్రేమించిన మనిషి పవిత్ర లేకపోయేసరికి ఆ బాధను తట్టుకోలేక తనకు ఈ లోకంలో ఎవరు లేరని, ఒంటరినని అనుకోని ఆత్మహత్య చేసుకున్నాడు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×