EPAPER

MK Meena chit chat: మాచర్ల వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలీదన్న సీఈఓ.. సజ్జల, అంబటి రియాక్షన్ ?

MK Meena chit chat: మాచర్ల వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలీదన్న సీఈఓ.. సజ్జల, అంబటి రియాక్షన్ ?

MK Meena chit chat: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ జరిగిన మాచర్ల ఘటన వ్యవహారంపై ముదిరి పాకాన పడింది. ఈ వ్యవహారపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యిందంటే పరిస్థితి ఏ రేంజ్‌లో అర్థం చేసుకోవచ్చు. ఈవీఎం ఘటన తర్వాత సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిచిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది.


తాజాగా ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్ మీనా మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా కొత్త విషయాలు బయటపెట్టారు. వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో తాను బ‌య‌ట‌కు ఇవ్వ‌లేదన్నారు. ఆ వీడియో బ‌య‌ట‌కు ఎలా వచ్చిందో తెలుసుకుంటుమన్నారు. బహుశా పోలీసుల దర్యాప్తులో బయటకు వచ్చిందేమోనని అన్నారు. అయినా  పిన్నెల్లి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా ఉందన్నారు.

ఈవీఎం ధ్వంసం చేసినా చెప్ప‌నందుకు అక్క‌డున్న అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకున్నట్లు తెలిపారు మీనా. పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేయమన్నారు. ప్రస్తుతం పిన్నెల్లి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు హైదరబాద్‌లో అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, నలుగురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల టీమ్ పని చేస్తోందన్నారు. ప్రస్తుతం మాచర్లలో పరిస్థితి అదుపులో ఉందన్నారు.


టీడీపీ నేతలు మాచర్లకు వెళ్తే అక్కడ పరిస్థితి అదుపు తప్పే అవకాశముందన్నారు మీనా. బయటవాళ్లు ఎవరూ మాచర్లకు వెళ్లొద్దన్నారు. జూన్ నాలుగున ఎన్నికల ఫలితాల తర్వాత ర్యాలీలు, ఊరేగింపుల అనుమతులపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.

ALSO READ:  పిన్నెల్లి ఎక్కడ ? సినిమాను తలపిస్తోన్న పరారీ ఎపిసోడ్

ఇదిలావుండగా మాచర్ల ఘటనలకు సంబంధించి ఈసీకి సజ్జల రామకృష్ణారెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. వీడియో అధికారి వెబ్‌ కాస్టింగ్ నుంచి వస్తే, ఎలా లీక్‌ అయ్యిందన్నారు. దీనివెనుక ఎవరు ఉన్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్ వీడియో నిజమా కాదా అనేదానిపై క్లారిటీ రాకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుందన్నారు సజ్జల. వైరల్ అవుతున్న వీడియోకు.. ఎన్నికల కమిషన్‌కు సంబంధం లేదంటే పోలీసులు, అధికారులు టీడీపీతో ఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తోందని విమర్శించారు మంత్రి అంబటి. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో అంబటి పోస్ట్ చేశారు. రానున్న రోజుల్లో ఈ వ్యవహారంపై ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Tags

Related News

Swiggy Services Ban: ఏపీలో స్విగ్గీ సేవలు బ్యాన్, హోటల్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం, కారణం తెలుసా?

SIT inquiry: తిరుమల లడ్డూ వివాదం.. ఈ వారం రంగంలోకి సిట్, తొలుత..

Deputy Cm Pawan: పవన్ కల్యాణ్‌కు బిగ్‌షాక్.. కేసు నమోదు, ఎందుకంటే..

TDP vs YCP: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!

Minister Satyakumar: జగన్ కు షాక్.. వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి

Kalasha Naidu: ‘బిగ్ బాస్’ నూతన్ నాయుడు కూతురికి ప్రతిష్టాత్మక అవార్డు, 11 ఏళ్లకే సమాజ సేవ.. సెల్యూట్ కలశా!

AP Ministers: నూతన విచారణ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నాం.. హోం మంత్రి వంగలపూడి అనిత

Big Stories

×