EPAPER

Ricky ponting says BCCI approach me: కోచ్ కోసం బీసీసీఐ వేట, రిజెక్ట్ చేసిన రికీపాంటింగ్!

Ricky ponting says BCCI approach me: కోచ్ కోసం బీసీసీఐ వేట, రిజెక్ట్ చేసిన రికీపాంటింగ్!

Ricky ponting about BCCI approach(Sports news headlines):

టీమిండియా కొత్త కోచ్ కోసం బీసీసీఐ వేట మొదలుపెట్టింది. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్‌ను క్షుణ్నంగా గమనిస్తోంది. విదేశీ ఆటగాళ్లు ఏఏ జట్లకు కోచ్‌గా ఉన్నారు? వారి పెర్ఫార్మెన్స్‌పై ఆరా తీస్తోంది. ఈ క్రమంలో చాలామంది ఆటగాళ్లతో సమావేశమవుతోంది.


టీమిండియా కోచ్‌గా ఉండేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది మొగ్గుచూపడం లేదు. ఏడాదిలో పది నెలల జట్టుతో గడపాల్సి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కోచ్ రాహుల్ ద్రావిడ్ తప్పుకోవడానికి ఇదీ కూడా ఓ కారణం. తాజాగా ఓ కొత్త న్యూస్ బయటకు వచ్చింది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీపాంటింగ్‌ను బీసీసీఐ సంప్రదించినట్టు తెలుస్తోంది.

ఈనెల మొదటివారం ఢిల్లీలో రికీపాంటింగ్‌తో బీసీసీఐ సెక్రటరీ జై షా, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ సమావేశమయ్యారు. టీమిండియాకు కోచ్‌గా రావాలని రిక్వెస్ట్ చేశారట. వారి అభ్యర్థనను సున్నితంగా ఆయన తిరస్కరించినట్టు సమాచారం. టీమిండియా కోచ్‌గా ఉండాలంటే దాదాపు 10నెలలు పాటు ఆటగాళ్లతో ఉండాల్సి వస్తుందని అన్నాడు. ఈ విషయంలో ఫ్యామిలీకి దూరంగా ఉండలేనని రికీ  చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కోచ్ పదవిని తిరస్కరించినట్టు రికీపాంటింగ్ చెప్పుకొచ్చాడు.


ALSO READ: ఐపీఎల్‌ చరిత్రలో మాక్స్‌వెల్ చెత్త రికార్డు

రికీ పాంటింగ్ ఆట గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఆసీస్‌కు కెప్టెన్‌గా చాలా విజయాలను అందించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. అంతకుముందు ముంబై జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు కూడా. కోచ్ పదవికి అప్లైకి కేవలం నాలుగురోజులు మాత్రమే గడువు ఉంది. ఈ క్రమంలో చెన్నై కోచ్ ఫ్లెమింగ్‌, రాజస్థాన్ కోచ్ కుమార సంగక్కర‌, లక్నో కోచ్ జస్టిన్ లాంగర్, కోల్‌కతా టీమ్ మెంటార్ గంభీర్ వంటి మాజీలు పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి చివరకు ఎవరిని బీసీసీఐ ఎంపిక చేస్తుందో చూడాలి.

Tags

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×