EPAPER

Porsche crash case, bail cancel: పూణె హిట్ అండ్ రన్ కేసులో న్యూట్విస్ట్, బెయిల్ రద్దు

Porsche crash case, bail cancel: పూణె హిట్ అండ్ రన్ కేసులో న్యూట్విస్ట్, బెయిల్ రద్దు

Pune porsche accident case update(Telugu news live): పూణె హిట్ అండ్ రన్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మృతికి కారణమైన వ్యక్తికి గంటల వ్యవధిలో న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. దీంతో నిరసనలు తీవ్రమయ్యాయి. నిందితుడికి బెయిల్ ఎలా ఇస్తారని బాధిత కుటుంబాలు, ప్రజల నుంచి నిరసనలు తీవ్రమయ్యాయి. పరిస్థితి గమనించిన న్యాయస్థానం బాలుడికి మంజూరు చేసిన బెయిల్‌ని రద్దు చేసింది. నిందితుడు మైనర్ కావడంతో జూన్ ఐదు వరకు జువైనల్ హోమ్‌కు పంపింది.


సంచలనం రేపిన పూణెలోని పోర్షే కారు యాక్సిడెంట్‌లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్ తర్వాత ఆదివారం మిడ్ నైట్‌ ఫ్రెండ్స్‌తో కలిసి బార్‌లో పీకల దాకా మద్యం తాగాడు ఓ మైనర్ బాలుడు. మద్యం మత్తులో వేగంగా పోర్షే కారు నడిపాడు. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్నఇద్దరు ఐటీ ఇంజనీర్లను ఢీ కొట్టాడు. కల్యాణి‌నగర్ ప్రాంతంలో అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

బైక్ నడుపుతున్న అనీష్, వెనుకున్న అశ్విని గాలిల్లోకి ఎగిరి కిందపడ్డారు. ఇద్దరు స్పాట్‌లో మృతి చెందారు. ఘటన తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితుడు మైనర్ కావడంతో గంటల వ్యవధిలో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు రోడ్డు ప్రమాదాల గురించి వ్యాసం రాసుకురావాలని ఆదేశించింది. రవాణా ఆఫీసుకి వెళ్లి నియమ, నిబంధనలు అధ్యయనం చేసి ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రస్తావించింది. పోలీసులతో కలిసి కొన్నిరోజులు సోషల్ సర్వీస్ చేయాలని పేర్కొంది.


ALSO READ:  దీదీ ఈజ్ బ్యాక్.. ఇండియా కూటమిపై మమతా అనురాగం

ఈ తీర్పుపై మహారాష్ట్రతోపాటు దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమయ్యాయి. బాధిత కుటుంబాలు తీర్పుపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కూడా తీర్పును తప్పుబట్టారు. ఇక సోషల్ మీడియా వేదికగా న్యాయస్థానంపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి గమనించిన న్యాయస్థానం, మైనర్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. న్యాయస్థానం తీర్పుపై బాధితులు కాస్త శాంతించారు. కాకపోతే శిక్ష పాడాల్సిందేనన్నది తమ డిమాండ్‌గా చెప్పుకొచ్చారు.

Tags

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×