EPAPER

CP Umamaheswara rao Judicial Remand : ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. ఏసీపీ ఉమామహేశ్వరరావుకు జ్యుడీషియల్ రిమాండ్

CP Umamaheswara rao Judicial Remand : ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. ఏసీపీ ఉమామహేశ్వరరావుకు జ్యుడీషియల్ రిమాండ్

14 days judicial remand for acp uma maheswara rao : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సీసీఎస్ లో పనిచేస్తోన్న ఉమామహేశ్వరరావు పై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో.. రెండ్రోజులుగా హైదరాబాద్ అశోక్ నగర్లోని ఆయన ఇంట్లో, ఏపీలో ఉన్న ఆయన సొంత ఊరిలోని స్నేహితులు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.


ఆయన ఇంటిలో జరిపిన సోదాల్లో 35 లక్షల 50 వేల రూపాయల నగదు, 60 తులాల బంగారం, 17 స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఉమామహేశ్వరరావుకు రెండు లాకర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. లాకర్లను ఓపెన్ చేయాల్సి ఉంది. శామీర్ పేటలో ఖరీదైన విల్లాను కూడా గుర్తించారు. దర్యాప్తు పూర్తిగా ముగిసేసరికి ఆయన ఆస్తులు ఇంకా బయటికి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. బుధవారం కోర్టులో హాజరు పరిచారు. హైదరాబాద్ ACP ఉమామహేశ్వర్ రావుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.


Tags

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×