EPAPER

Schools Girls Prostitution : చెన్నైలో వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు.. పోలీసుల అదుపులో నదియా

Schools Girls Prostitution : చెన్నైలో వ్యభిచార రాకెట్ గుట్టు రట్టు.. పోలీసుల అదుపులో నదియా

Woman Prostitution with School Girls in Chennai : మీ ఇంట్లో స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే పిల్లలున్నారా..? వారు భద్రమేనా? స్కూల్‌కి వెళ్లినా, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లినా సేఫ్‌గానే ఉంటున్నారా? ఏ పేరేంట్స్ నైనా ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు.. మా పిల్లలు బడికి వెళ్లి చక్కగా చదువుకుంటున్నారని చెబుతారు.. ఇది చాలా కామన్. ఇది అసలు అడగాల్సిన ప్రశ్నే కాదని మీరు అడగొచ్చు. నిజమే, మీకొచ్చిన డౌట్ కరెక్టే. కానీ, స్కూల్ కి వెళ్లే పిల్లలు, కాలేజీ అమ్మాయిలు కొంతమంది తప్పుదోవ పడుతున్నారు. స్కూల్ కని చెప్పి.. ఫ్రెండ్స్ ఇంటికని చెప్పి.. వారు వెళ్లే రూట్ సపరేటు. ఎక్స్ ట్రా ఇన్ కమ్ కోసం నరక కూపంలో విహరిస్తున్నారంటే మీరు నమ్ముతారా? ఏంటి షాక్ అయ్యారా? దిమ్మతిరిగిపోతోందా? కానీ.. ఇది నిప్పులాంటి నిజం. చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అదే తెలిస్తే మీరు కూడా మీ పిల్లలపై నిఘా వేయక తప్పదు.


చెన్నైలో వ్యభిచార రాకెట్ ముఠాను చేధించారు పోలీసులు. ఈ ఘటనలో విస్తుబోయే నిజాలు బయటకొచ్చాయి. నదియా అనే 37 ఏళ్ల మహిళ.. తన కూతురు సాయంతో స్కూల్ గర్ల్స్ కు డబ్బు ఆశ చూపి వ్యభిచారంలోకి దింపింది. మొదట వారికి డ్యాన్స్ నేర్పిస్తాననే నెపంతో స్నేహం చేసింది. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన అమ్మాయిలకే వల వేసింది. డబ్బు ఆశ చూపి రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఇస్తానని చెప్పి అభం శుభం తెలియని అమ్మాయిలను ఈ కూపంలోకి దింపింది.

చెన్నైలోనే కాకుండా ఢిల్లీ, కోయంబత్తూర్, హైదరాబాద్‌లోని కస్లమర్ల వద్దకు అమ్మాయిలను పంపించేది. ఇతర నగరాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎలా తల్లిదండ్రులకు సాకులు చెప్పాలనే దానిపై కూడా గర్ల్స్ కి శిక్షణ ఇచ్చేది. దీంతో పిల్లలు తల్లిదండ్రులకు అబద్ధపు మాటలు చెప్పి దొంగచాటుగా ఈ రొంపులోకి వచ్చేవారు. నిందితురాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల ద్వారా క్లయింట్స్‌తో డీల్ చేసుకునేది. కస్టమర్లలో కొందరు కోయంబత్తూర్, హైదరాబాద్‌కి చెందిన వృద్ధులు కూడా ఉన్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. స్కూల్ బాలికలకు ఎక్కువ చెల్లించేందుకు సిద్ధంగా ఉండటంతో నిందితురాలు వారిని టార్గెట్ చేసింది.


Also Read : దారుణం.. విడవకుండా విచక్షణారహితంగా.. అలా చేసి చంపేశాడు

కొందరు డబ్బు వ్యామోహంతో ఈ కూపంలో చిక్కితే.. మరికొందరికి ఈ వల నుంచి తప్పించుకోవడం అసాధ్యమైంది. కారణం.. వారి వీడియోలు చూపించి బెదిరింపులకు దిగింది నిందితురాలు. దీంతో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో అమ్మాయిలు చిక్కుకుపోయారు. ఎట్టకేలకు పక్కా సమాచారంతో పోలీసులు శనివారం అర్ధరాత్రి ఓ లాడ్జిపై దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి 17 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు టీనేజ్ బాలికల్ని పోలీసులు రక్షించారు. నిందితులను అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇక చైల్డ్ లైన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారులు బాలికలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

చైన్నైలో జరిగిన స్కూల్ బాలికల వ్యభిచార రాకెట్‌పై బాలల హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఘటనకు తల్లి తండ్రులతో పాటు స్కూల్ నిర్వాహకులు, టీచర్లు కూడా బాధ్యత వహించాలన్నారు బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధ. ఈ రాకెట్ చూసిన తర్వాత.. చట్టాలను మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా సంచలనంగా మారింది. చక్కగా స్కూల్ కి వెళ్లి.. బుద్ధిగా చదువుకోవాల్సిన పిల్లలు ఇలా తయారయ్యారేంటి? అని అంతా వర్రీ అవుతున్నారు. ఇలాంటి పరిణామం మంచిది కాదని, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? అనేదానిపై నిఘా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు దారి తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటున్నారు.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×