EPAPER

Vivo Y200 Pro Vs Infinix GT 20 Pro: రెండు పవర్‌ఫుల్ ఫోన్లు గ్రాండ్ ఎంట్రీ.. ఏది బెస్టో తెలుసా..?

Vivo Y200 Pro Vs Infinix GT 20 Pro: రెండు పవర్‌ఫుల్ ఫోన్లు గ్రాండ్ ఎంట్రీ.. ఏది బెస్టో తెలుసా..?

Vivo Y200 Pro Vs Infinix GT 20: టెక్ మార్కెట్‌లో కుప్పలు కుప్పలుగా స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయి. రోజు ఏదొక కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మే 21 న మంగళవారం రెండు శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు భారతీయ మార్కెట్‌లో విడుదలయ్యాయి. ఇందులో ఒకటి Vivo ద్వారా మరొకటి Infinix ద్వారా వచ్చాయి. ఈ రెండు ఫోన్‌లు Vivo Y200 Pro, Infinix GT 20 Pro. ఇవి శక్తివంతమైన ఫీచర్‌లతో వస్తాయి.


అయితే కొంతమంది కొనుగోలుదారులు ఈ రెండు ఫోన్‌లను ఎంచుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ఈ కథనంలో Vivo Y200 Pro, Infinix GT 20 Pro ఫోన్ల ఫీచర్లు గురించి తెలుసుకుందాం. దీని తర్వాత మీరు ఈ రెండిటిలో మంచి స్మార్ట్‌ఫోన్ ఎంచుకోవచ్చు.

Display
Vivo Y200 Pro 6.78-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది పూర్తి HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1300 nits పీక్ బ్రైట్‌నెస్, 105 శాతం NSTC కలర్స్ అందిస్తుంది. అయితే Infinix GT 20 Pro 6.78-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2340Hz PWM డిమ్మింగ్, 1,300 nits పీక్ బ్రైట్‌నెస్, DCI-P3 కలర్స్ అందిస్తుంది.


Also Read: వివో నుంచి రెండు స్టన్నింగ్ ఫోన్లు లాంచ్.. కేక పుట్టిస్తున్న ఫీచర్లు!

Processor
Vivo ఫోన్ Qualcomm Snapdragon 695 SoC, 8GB RAM ద్వారా శక్తిని పొందుతుంది. అయితే Infinix GT 20 Pro డైమెన్సిటీ 8200 అల్టిమేట్ ప్రాసెసర్, టర్బో గేమింగ్ డిస్‌ప్లే చిప్‌తో పాటు 12GB వరకు LPDDR5x RAMని కలిగి ఉంది.

Camera
Vivo Y200 Pro 64-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2-మెగాపిక్సెల్ Bokeh సెన్సార్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. అయితే Infinix GT 20 Pro 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఇది సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

Also Read: Vivo New Budget Phone: Vivo కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఇంత తక్కువకు ఎలారా బాబు!

Battery
ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 5,000mAh బ్యాటరీని ప్యాక్‌ని కలిగి ఉన్నాయి. అయితే Vivo Y200 Pro 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అయితే Infinix GT 20 Pro 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Features
Infinix GT 20 Proలో రెండు JBL స్పీకర్ సెటప్, X-యాక్సిస్ లీనియర్ మోటారు ఉంది. Vivo Y200 Proలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, వాటర్, డస్ట్ నుంచి రక్షించడానికి IP54 రేటింగ్, OISకి మద్దతు ఉంది.

Also Read: 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే‌తో వివో బడ్జెట్ ఫోన్ లాంచ్.. ఇప్పుడే కొనుగోలు చేస్తే భారీగా డిస్కౌంట్

Price
Vivo Y200 Pro ధర రూ. 24,999 కాగా, Infinix GT 20 Pro ధర రూ. 24,999 నుండి ప్రారంభమవుతుంది. Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ సేల్ మే 28 నుండి ప్రారంభమవుతుంది.

మీరు గేమర్ అయితే గేమింగ్ కోసం ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే Infinix GT 20 Pro మీకు మంచి ఆప్షన్‌గా ఉంటుంది. అయితే మీరు స్లిమ్, మంచి ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Vivo Y200 Pro అనుకూలంగా ఉంటుంది.

Tags

Related News

ChatGP: చాట్ జీపీటీతో ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు, ఎలాగో తెలుసా?

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

Motorola Edge 50 Neo: ఎడ్జ్ 50 నియో లాంచ్.. ఫీచర్లు మత్తెక్కించాయ్, ఈ ఆఫర్లు మీకోసమే!

Oppo Find X8 series: ఒప్పో దూకుడు.. వరుసగా నాలుగు ఫోన్లు, ఫీచర్లు కెవ్ కేక!

Motorola Edge 50 Neo: మోటో నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ!

Oppo K Series: సత్తాచాటేందుకు మరో మోడల్ రెడీ.. ఒప్పో నుంచి ఊహించని బడ్జెట్ ఫోన్!

Cheapest Smartphones Under Rs 10000: ఉఫ్ ఉఫ్.. కేవలం రూ.10వేల ధరలోనే 5జీ ఫోన్‌లు, వదిలారో మళ్లీ దొరకవ్!

Big Stories

×