EPAPER

World Para Athletics Championship : పారా అథ్లెటిక్స్‌లో మెరిసిన వరంగల్ వాసి దీప్తి.. స్వర్ణంతో వరల్డ్ రికార్డ్

World Para Athletics Championship : పారా అథ్లెటిక్స్‌లో మెరిసిన వరంగల్ వాసి దీప్తి.. స్వర్ణంతో వరల్డ్ రికార్డ్

Warangal Deepthi won gold medal in World Para Athletics Championship : వరంగల్ లో రోజు కూలి పనులు చేసుకుని బ్రతికే కుటుంబంలో పుట్టిన దీప్తి.. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో బంగారంలా మెరిసింది. మట్టిలో పుట్టిన మాణిక్యం దీప్తి జివాంజీ. జపాన్ దేశంలోని కోబ్ లో నిర్వహించిన ప్రతిష్టాత్మక పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో యువ స్ప్రింటర్ దీప్తి జివాంజీ ప్రపంచ రికార్డు సృష్టించింది.


మే 20, సోమవారం జరిగిన మహిళల 400 మీటర్ల టీ20 కేటగిరీలో దీప్తి జివాంజీ 55.06 సెకన్ల సమయంలోనే రన్నింగ్ పూర్తి చేసి.. గోల్డ్ మెడల్ అందుకుంది. దీప్తితో పాటు పోటీల్లో పాల్గొన్న వారిలో టర్కీకి చెందిన అసైల్ ఒండర్ 55.19 సెకన్లలో, ఈక్వెడార్ కు చెందిన లిజాన్ శెలా అంగులో 56.68 సెకన్లలో పరుగులు పూర్తి చేసి సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ అందుకున్నారు. అమెరికాకు చెందిన పారా అథ్లెట్ బ్రియాన్నా క్లార్క్ గతేడాది 55.12 సెకన్లలో పరుగును పూర్తి చేయగా.. ఆమె రికార్డును మన తెలంగాణ బిడ్డ దీప్తి బద్దలుకొట్టి.. కొత్త రికార్డు సృష్టించింది.

Also Read : అందరికీ ఆదర్శప్రాయుడు విరాట్ కొహ్లీ: ఆనంద్ మహీంద్రా


టీ20 పారా అథ్లెటిక్స్ ను మేథో వైకల్యం ఉన్నవారికి నిర్వహిస్తారు. పుల్లెల గోపీచంద్ నిర్వహిస్తున్న అథ్లెటిక్స్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాం, గోపీచంద్- మైత్రా ఫౌండేషన్ మద్దతుతో తాను ఈ స్థాయికి ఎదిగానని దీప్తి తెలిపింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తికి.. ఊరు తప్ప మరో విషయం తెలీదు. అథ్లెటిక్స్ ద్రోణాచార్యగా పేరొందిన నాగపూర్ రమేష్ వద్ద దీప్తి శిక్షణ తీసుకుంది. అలాంటి ఆమె.. ఫౌండేషన్ మద్దతుతో ప్రపంచస్థాయికి ఎదిగి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది. రన్నింగ్ లో శిక్షణ పొందేందుకు బస్సు టికెట్ కూడా కొనలేని స్థితిలో ఉండేది దీప్తి కుటుంబం. అలాంటి ఆమె.. నేడు పారా అథ్లెటిక్స్ లో స్వర్ణంతో మెరవడంతో.. సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పారిస్ లో జరగబోయే పారా ఒలింపిక్స్ కూడా దీప్తి అర్హత సాధించింది.

దీప్తి తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ, కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కార్పొరేట్ స్కూల్లో చదివించే స్తోమత తమకు లేదని దీప్తి తల్లి తెలిపింది. తన కూతురికి గర్వం లేదని, చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని, నేనే గొప్ప అన్న ఫీలింగ్ తనకు ఎప్పుడూ లేదని తెలిపారామె. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం, సొంతిల్లు కట్టుకోవడమే తన కూతురి లక్ష్యమని తెలిపారు.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×