EPAPER

Bangalore Rave Party: హడావుడి కాదు.. అంతు తేల్చండి..

Bangalore Rave Party: హడావుడి కాదు.. అంతు తేల్చండి..
Police has to Take Serious Action on Banglore Rave Party case: నాలుగు రోజుల పాటు హడావుడి.. కేసుల నమోదు. ఆ తర్వాత అంతా గప్‌చుప్.. అందరూ మర్చిపోతారు. ఇదే సీన్ ప్రతిసారీ రిపీట్ అవుతోంది. కానీ చాప కింద నీరులా ఈ గలీజ్‌ కల్చర్ పెట్రోగిపోతూనే ఉంది. జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూనే ఉంది. ఇంతకీ ఈ రేవ్‌ పార్టీల కల్చర్ రోజురోజుకు ఎందుకు పెరుగుతోంది? డ్రగ్స్‌కు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉన్న సంబంధమేంటి? ఎందుకు ప్రతిసారీ టాలీవుడ్ పెద్దలపై ఫోకస్ ఎందుకు పెరుగుతోంది? రేవ్ పార్టీ.. డ్రగ్స్‌కు కేరాఫ్‌గా మారుతున్నాయి.

 


ఉన్నవారికి అందించడానికి.. కొత్త వారికి అలవాటు చేయడానికే ఈ పార్టీలు నిర్వహిస్తున్నారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు ఇదే డౌట్ వస్తుంది. బడా వ్యాపారవేత్తలు.. టీవీ, సినిమా నటులు.. రాజకీయ నేతలు.. ఇలా అందరూ ఇన్‌వాల్వ్‌ అవుతున్నారు ఇందులో.. పరిచయాలు, సర్కిల్ ఉన్నవారికే మొదట ఎంట్రీ ఉంటుంది. మొదట హైదరాబాద్‌ సరౌండిగ్స్‌లో మాత్రమే జరిగేవి. మరి పోలీసుల నజర్ పెరిగిందనో.. లేక కొత్త ప్లేస్‌ అయితే బాగుంటుందనో.. ఇప్పుడు ఇతర స్టేట్స్‌కు కూడా విస్తరించారు. కానీ ఎక్కడ రెయిడ్ అయినా దొరికిన వాళ్లలో మన తెలుగు వాళ్లు ఉండటం మాత్రం కామనే అని చెప్పాలి.

రెయిడ్స్ జరుగుతున్నాయి.. కేసులు నమోదవుతున్నాయి. నాలుగు రోజుల పాటు హడావుడి జరుగుతుంది. తర్వాత అందరూ మర్చిపోతున్నారు.. పోలీసులతో సహా.. కాదంటే ఒక్కసారి గుర్తు చేసుకోండి. గతంలో టాలీవుడ్ డ్రగ్స్‌ కేసు విచారణకు వరుస పెట్టి హాజరయ్యారు ఇండస్ట్రీ పెద్దలంతా.. ఆ తర్వాత ఏమైంది.. ఏమీ కాలేదు. రీసెంట్‌గా చాలా పబ్‌ల్లో రెయిడ్స్ జరిగాయి. చాలా మందిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. బ్లడ్‌ టెస్ట్‌లు చేశారు.. మళ్లీ ఆ కేసు ఊసే లేదు.


నిజానికి డ్రగ్స్ పెడ్లింగ్ నేరం.. అంటే అమ్మడం.. స్మగ్లింగ్ చేయడం.. ఇలాంటివి.. కానీ డ్రగ్స్‌ తీసుకోవడం నేరం కాదు. మరీ స్వల్ప మోతాదుతో దొరికినా.. సేవించినా నేరం కాదన్న ఫీల్ పోలీసులే కల్పిస్తున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇస్తారు.. డ్రగ్స్ వాడితే మీ ఆరోగ్యాలు పాడవుతాయని చెబుతారు. అవసరమైతే ఓ వీడియో ప్లే చేసి చూపిస్తారు. దీంతో వీరు రియలైజ్ అవుతారు.. మళ్లీ డ్రగ్స్ జోలికి పోరు. ఇదీ పోలీసుల నమ్మకం.. బట్ ఈ మొత్తం సినారియో మరోలా అర్థమవుతోంది డ్రగ్స్ బాధితులకు..హా ఏముందిలే.. నాలుగు రోజులు హడావుడి చేస్తారు.. ఆ తర్వాత అంతా మాములే అన్నట్టుగా వెళుతుంది జనాల్లోకి.

Also Read: మోదీపై హాట్ కామెంట్స్, చేసింది చాలు, ప్రజా జీవితం నుంచి..

ఏంటీ నమ్మడం లేదా.. ? బెంగళూరు రేవ్‌ పార్టీలో యాక్టర్ హేమ ఉన్నారనేది ఆరోపణ. తాను అస్సలు హైదరాబాద్‌ను దాటి వెళ్లలేదని ఆమె చెప్పే మాట.. కానీ ఆమె తమ పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారని పోలీసులు ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. సరే ఆమె పార్టీలోనే ఉన్నారనుకుందాం.. కానీ డే మారే సరికి ఏమైంది.. ఆమె హైదరాబాద్‌లోని తన ఇంట్లో బిర్యానీ చేస్తున్నారు. ఆ తర్వాత హాయిగా తినేశారు.. రిలాక్స్ అయ్యారు. మరి ఈ మొత్తం ఎపిసోడ్ చూసే వాళ్లకు ఎలా కనిపిస్తుంది? ఏం మెసేజ్ ఇస్తుంది? ఇప్పటికైనా ఈ హడావుడిని పక్కన పెట్టి.. ఆ పార్టీలోకి అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? ఆ తీసుకొచ్చిన వారికి అమ్మింది ఎవరు? ఇలా వారి నెట్‌ వర్క్‌ను బ్రేక్ చేయాలి.. రూట్స్‌ను కనిపెట్టాలి. అప్పుడే సోసైటీ నుంచి డ్రగ్స్‌ను నామరూపాల్లేకుండా తీసేయొచ్చు.
డ్రగ్స్ రహిత సమాజాన్ని రూపొందించవచ్చు.

ఇటు సెలబ్రిటీలు కావొచ్చు.. రాజకీయ నేతలు కావొచ్చు. మీరు కూడా మారాలి.. మీరు సోసైటీలో చాలా మందిని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలరు. మీరే ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తుంటే.. విషయం మీరు ఊహించనంత వేగంగా ప్రజల్లోకి వెళుతుంది.. చర్చ నడుస్తుంది.. అనేక అనర్థాలకు కారణమవుతోంది. సో.. ఇప్పటికైనా కాస్త బుద్దెరిగి మసులుకోవడం బెటర్.. జరగాల్సిన నష్టం జరిగాక.. మాకేం సంబంధం లేదు అనే డైవర్షన్ పంచాయితీలు పెట్టుకోకుండా.. ముందే ఇలాంటి గలీజ్ దందాలకు దూరంగా ఉండటం బెటర్ కదా.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×