EPAPER

IPL 2024 Eliminator, RR vs RCB Match Preview: నేడే ఎలిమినేటర్.. బెంగళూరు జోరుకు రాజస్థాన్ బ్రేకులు వేస్తుందా..?

IPL 2024 Eliminator, RR vs RCB Match Preview: నేడే ఎలిమినేటర్.. బెంగళూరు జోరుకు రాజస్థాన్ బ్రేకులు వేస్తుందా..?

IPL 2024 Eliminator Rajasthan Royals vs Royal Challengers Bengaluru Match Prediction: వరుసగా ఆరు మ్యాచులు గెలిచి ఊపుమీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకవైపు, చివరి 5 మ్యాచుల్లో గెలుపేలేని రాజస్థాన్ రాయల్స్ ఒకవైపు.. వీరిద్దరి మధ్య గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి క్వాలిఫైయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ను ఢీకొట్టడానికి బెంగళూరు జోష్‌లో ఉందని చెప్పొచ్చు.


14 మ్యాచుల్లో 8 విజయాలు., 5 పరాజయాలతో 17 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ 3వ స్థానంలో ఉండగా.. 14 మ్యాచుల్లో 7 విజయాలు, 7 పరాజయాలతో ఆర్సీబీ నాలుగో స్థానంలో ఉంది. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ చెన్నైపై సూపర్ విక్టరీ సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

అయితే రాజస్థాన్ మాత్రం ఈ సీజన్ తొలి అర్థభాగంలో అద్భుతంగా ఆడి తొలి 7 మ్యాచుల్లో 6 గెలిచి.. చివరి ఏడు మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించి డీలా పడిపోయింది. అయితే అప్పటికే ప్లే ఆఫ్ బెర్తు కన్ఫామ్ కావడంతో రాజస్థాన్‌ పెద్దగా పట్టించుకోలేదు. సీజన్ ఆసాంతం తొలి స్థానంలో ఉన్న రాజస్థాన్ లీగ్ దశ ముగిసేసరికి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఎలిమినేటర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


రాజస్థాన్ రాయల్స్ జట్టులో రియాన్ పరాగ్ మినహా ఎవరూ రాణించకపోవడం పెద్ద ఎదురుదెబ్బ. అటు కెప్టెన్ సంజూ శాంసన్ తొలి హాఫ్‌లో అద్భుతంగా ఆడి రెండో హాఫ్‌లో డీలా పడిపోయాడు. ఇది రాజస్థాన్‌ను కలవరపెట్టే విషయం.

ఇక బెంగళూరు విషయానికి వస్తే కింగ్ కోహ్లీ ఫామ్ ఆ జట్టులోని మిగతా ఆటగాళ్లకి స్పూర్తినిచ్చింది. కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, రజత్ పాటీదార్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇక బౌలింగ్‌లోనూ రాజస్థాన్ కంటే బెంగళూరు బలంగా కనిపిస్తోంది. మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్ సూపర్ ఫామ్‌లో ఉండటం కలిసిచ్చే అంశం.

Also Read: కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ తడ’బ్యాటు’.. 13.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించిన కోల్‌కతా..

మొత్తంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 31 మ్యాచులు జరగగా.. 15 మ్యాచుల్లో ఆర్సీబీ విజయం సాధించగా.. 13 మ్యాచుల్లో రాయల్స్ విజయం సాధించింది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో రాజస్థాన్.. బెంగళూరుతో ఒక్కసారి మాత్రమే తలపడింది. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇక ఇవాళ జరిగే మ్యాచ్‌లో గెలిచి క్వాలిఫైయర్-2లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తలపడటానికి రెండు జట్లు తహతహలాడుతున్నాయి.

Tags

Related News

IND VS NZ: చెలరేగిన రచిన్ .. కివీస్ 402 పరుగులకు ఆలౌట్

Rishabh Pant: రిషబ్ పంత్ కోలుకోవడం కష్టమే.. సర్జరీ అయిన చోటే వాపు..?

Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

IPL 2025: సన్‌రైజర్స్‌కు డేల్ స్టెయిన్ గుడ్ బై !

Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !

Ind vs Nz : చుక్కలు చూపించిన న్యూజిలాండ్‌…46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా..!

Ind Vs Nz: బెంగుళూరు టెస్ట్.. కష్టాల్లో టీమిండియా! 46 పరుగులకే ఆలౌట్

Big Stories

×