EPAPER

Driving Licence New Rules: ఆర్టీవో పరీక్ష లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్.. కొత్త రూల్స్ ఇవే

Driving Licence New Rules: ఆర్టీవో పరీక్ష లేకుండానే  డ్రైవింగ్ లైసెన్స్.. కొత్త రూల్స్ ఇవే

New Driving Licence Rules in India 2024, New RTO Rules: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని అనుకుంటే ఆర్టీవో ఆఫీస్ చుట్టూ తిరగాలి.. స్లాట్ బుక్ చేసుకొని, హాజరై, రకరకాల ఎంక్వైయిరీలు పూర్తయితే గాని లైసెన్స్ పొందలేము. అయితే ఇప్పుడు ఆర్టీవో ఆఫీస్ లు చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కేంద్రం కొత్తగా న్యూ రూల్స్ ప్రవేశ పెట్టింది. జూన్ 1 నుండి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నియమాలు అమలు కానున్నాయి. త్వరలో రాబోతున్న ఈ న్యూ రూల్స్ ప్రకారం ప్రైవేట్ ఆఫీస్ లు కూడా డ్రైవింగ్ టెస్టులను నిర్వహించి సర్టిఫికెట్ లను అమలు చేయవచ్చు.


ఈ కొత్త రూల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయాలనుకునేవాళ్లు నేరుగా ఆర్టీవో ఆఫీస్ కు వెళ్లాలి.. కాని ఇప్పుడు ఆఫీస్ లు చుట్టూ తిరిగే పని లేకుండా ఆన్ లైన్ లోనే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు. ఫోర్ వీలర్ టెస్ట్ నిర్వహించాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ప్రైవేట్ డ్రైవింగ్ ట్రైనింగ్ నిర్వహించేందుకు ఖచ్చితంగా మూడు ఎకరాల స్థలం ఉండాలి. డ్రైవింగ్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్లు హైస్కూల్ విద్యను పూర్తి చేసుకొని ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు ఎక్సపీరియన్స్ ఉండాలి. వీరికి బయోమెట్రిక్ ఐటీపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.

Also Read: రికార్డు సృష్టించిన దలాల్ స్ట్రీట్.. 5 ట్రిలియన్ డాలర్ల క్లబ్ లోకి..


లైసెన్సింగ్ సంబంధిత రుసుములు, ఛార్జీలు

లెర్నర్ లైసెన్స్ జారీ (ఫారం 3) – రూ. 150.00
లెర్నర్స్ లైసెన్స్ పరీక్ష రుసుము- రూ. 50.00
డ్రైవింగ్ పరీక్ష రుసుము- రూ. 300.00
డ్రైవింగ్ లైసెన్స్ జారీ- రూ. 200.00
అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ జారీ- రూ. 1000.00
డ్రైవింగ్ స్కూల్ డూప్లికేట్ లైసెన్స్- రూ. 5000
లైసెన్సింగ్ అధికార ఉత్తర్వులపై అప్పీల్- రూ 500.00
డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా లేదా ఇతర వివరాల మార్పు- రూ. 200.00

దరఖాస్తు ప్రక్రియ: దరఖాస్తు ప్రక్రియ చేయాలంటే  ముందుగా మీరు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో https://parivahan.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము లైసెన్స్ రకాన్ని బట్టి ఉంటుంది. మీరు పత్రాలను సమర్పించడానికి లైసెన్స్ ఆమోదం కోసం మీ డ్రైవింగ్ నైపుణ్యాలను రుజువు చేసే ఆధారాలు ఏమైనా ఉంటే RTOకి చూపించాలి.

జరిమానాలు: న్యూ రూల్స్ ప్రకారం.. దాదాపు 900,000 పాత ప్రభుత్వ వాహనాలను దశలవారీగా తొలగిస్తారు. ఈ నిబంధనలను అమలు చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడమే దీని లక్ష్యం. అతివేగానికి జరిమానా రూ. 1000, రూ. 2000 మధ్య ఉంటుంది. అయితే, డ్రైవింగ్‌లో పట్టుబడిన మైనర్‌కు రూ. 25,000 భారీ జరిమానా విధించబడుతుంది. అదనంగా, వాహన యజమాని రిజిస్ట్రేషన్ కార్డ్ రద్దు చేయబడుతుంది. మైనర్ అయితే 25 సంవత్సరాల వరకు లైసెన్స్‌కు అనర్హులు.

 

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×