EPAPER

IPL 2024 Playoffs: టీ 20 ప్రపంచకప్ కు ఎంపికైన వారిలో.. కేవలం ఐదుగురే ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ లో..

IPL 2024 Playoffs: టీ 20 ప్రపంచకప్ కు ఎంపికైన వారిలో.. కేవలం ఐదుగురే ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ లో..

Only 5 India Players Playing IPL 2024 Play Off’s 15-man Squad for T20 World Cup 2024: నెట్టింట ఇదో పెద్ద రచ్చగా మారింది. ప్లే ఆఫ్ కి చేరిన నాలుగు జట్లలో కేవలం ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే టీ 20 ప్రపంచకప్ ఆడుతున్నారు. పదిహేను మంది ఆటగాళ్లలో మొత్తం పది మంది ప్లే ఆఫ్ కి చేరని టీమ్ ల్లోనే ఉండటం విశేషం. వీళ్లందరూ ముందు బ్యాచ్ గా అమెరికా విమానం ఎక్కనున్నారు. ఫైనల్ మ్యాచ్ అయిన వెంటనే మిగిలిన ఐదుగురు వెళ్లనున్నారు. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరంటే..


కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో మొత్తం ముగ్గురు ఉన్నారు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్, కెప్టెన్ సంజూ శాంసన్, స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఉన్నారు. ఇక ఆర్సీబీలో చూస్తే విరాట్ కొహ్లీ, పేసర్ మహ్మద్ సిరాజ్ ఉన్నారు. అయితే వీరితో పాటు ఎక్స్ ట్రా ప్లేయర్ రింకూ సింగ్ కోల్ కతా టీమ్ లో ఉన్నాడు. మరి తనకి టీ 20 ప్రపంచకప్ లో అవకాశం వస్తుందో రాదో తెలీదు. కానీ తను మాత్రం కోల్ కతా జట్టు ఫైనల్ టీమ్ లో ఉన్నాడు. అందువల్ల తను కూడా ఫైనల్ మ్యాచ్ అయిన తర్వాతే వెళతాడు.

ఇక మిగిలిన వారి సంగతి చెప్పాలంటే.. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి నలుగురు ఆటగాళ్లు టీ 20 ప్రపంచ కప్ జట్టులో ఎంపికయ్యారు. వారు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఉన్నారు. ఈ ప్రముఖ ఆటగాళ్లు ఆడిన ముంబయి జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండటాన్ని ఎవరూ ఊహించలేకపోతున్నారు. మరి ఈ హీరోలందరూ వెళ్లి టీ 20 ప్రపంచకప్ ఎలా ఆడతారనే అనుమానాలు అప్పుడే అందరిలో వ్యక్తమవుతున్నాయి.


Also Read: ఐపీఎల్‌లో ఆసక్తి సమరం, గెలుపు ఎవరిది? ఓడినా మరో ఛాన్స్..

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రవీంద్ర జడేజా, శివమ్ దూబే , పంజాబ్ కింగ్స్‌ నుంచి అర్ష్‌దీప్ సింగ్ ప్రపంచకప్ జట్టులో ఉన్నారు. గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఎక్స్ ట్రా ప్లేయర్ గా ఉన్నాడు. వీళ్లందరూ కూడా అద్భుతాలేమీ చేయలేదు. బ్రహ్మాండంగా ఆడినవాళ్లందరూ ఇండియాలోనే ఉంటున్నారు.

Related News

IND VS NZ: చెలరేగిన రచిన్ .. కివీస్ 402 పరుగులకు ఆలౌట్

Rishabh Pant: రిషబ్ పంత్ కోలుకోవడం కష్టమే.. సర్జరీ అయిన చోటే వాపు..?

Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

IPL 2025: సన్‌రైజర్స్‌కు డేల్ స్టెయిన్ గుడ్ బై !

Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !

Ind vs Nz : చుక్కలు చూపించిన న్యూజిలాండ్‌…46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా..!

Ind Vs Nz: బెంగుళూరు టెస్ట్.. కష్టాల్లో టీమిండియా! 46 పరుగులకే ఆలౌట్

Big Stories

×