EPAPER

SIT Report to DGP: డీజీపీకి చేరిన సిట్ ప్రాథమిక నివేదిక.. అందులో ఏముందంటే..?

SIT Report to DGP: డీజీపీకి చేరిన సిట్ ప్రాథమిక నివేదిక.. అందులో ఏముందంటే..?

SIT Handovers Report to DGP on AP Violence(AP updates): ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తరువాత చెలరేగిన హింసాత్మక సంఘటనలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, హింసాత్మక సంఘటనలపై విచారణ జరిపిన సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీశ్ గుప్తా కుమార్ గుప్తాకు అందజేసింది. ఆ నివేదికను సీట్ చీఫ్ వినీత్ బ్రీజ్ లాల్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందజేశారు.


కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును పూర్తి చేసి నివేదికను డీజీపీకి అందజేసింది. ఆ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికల సంఘం సీఈవోకు డీజీపీ అందజేయనున్నారు.

అయితే, ఈసీ ఆదేశంతో ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. 13 మంది సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేసింది. ఏపీలో పోలింగ్ రోజు, పోలింగ్ తరువాత చెలరేగిన హింసాత్మక సంఘటనలపై సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసింది. ఆ ప్రాంతాల్లో రెండు రోజులపాటు పర్యటించిన సిట్ బృందం నిన్న అర్ధరాత్రి వరకు కూడా దర్యాప్తు చేసింది. ప్రతి అంశాన్ని సిట్ పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక నివేదికను సిట్.. డీజీపీకి అందజేసి ఆయనతో వినీత్ బ్రీజ్ లాల్ సమావేశమయ్యారు. 150 పేజీలతో కూడిన సుదీర్ఘ నివేదికను డీజీపీకి అందజేసినట్లు తెలుస్తోంది. 30కి పైగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం.


Also Read: Bangalore rave party issue Kakani vs Somireddy: బెంగుళూరు రేవ్ పార్టీ, తెలుగు వారే ఎక్కువ మంది

రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక సంఘటనలపై సిట్ ఇచ్చిన ఆ నివేదికలో పలు కీలక అంశాలను పొందుపరిచింది. హింసాత్మక సంఘటనలపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ లతోపాటుగా స్థానికులు, పోలీసులను విచారించి 30 కి పైగా హింసాత్మక సంఘటనలు చెలరేగినట్లు సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎఫ్ఐఆర్ లో కొత్త సెక్షన్లు చేర్చే విషయమై కూడా ఆ నివేదికలో సిట్ సిఫారసు చేసినట్లు సమాచారం. హింసలు చెలరేగుతున్నాయని తెలిసినా కూడా కొందరు కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహిరించినట్లు సిట్ నిర్ధారించినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా హింసాత్మక సంఘటన సమయాల్లో ఉపయోగించినటువంటి కర్రలు, రాళ్లు, రాడ్లు వంటి వాటికి సంబంధించిన ఆధారాలును కూడా సేకరించిన సిట్ .. హింసాత్మక సంఘటనలతో సంబంధమున్న పలువురిని అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఓట్ల లెక్కింపు రోజు జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతాపరమైన అంశాలపైన కూడా పలు సిఫారసులను ఆ నివేదికలో సిట్ చేర్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాథమిక నివేదికను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా.. కేంద్ర ఎన్నికల సంఘానికి, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ప్రభుత్వం ద్వారా అందజేయనున్నారు.

Also Read: పిఠాపురం, కాకినాడ సిటిలో హింస జరిగే ఛాన్స్, భారీగా..

కాగా, ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తరువాత పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. పల్నాడు, తిరుపతి, తాడిపత్రితోపాటు పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అదేవిధంగా పలువురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేసింది. హింసాత్మక సంఘటనలపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఢిల్లీకి వచ్చి తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ మరునాడే సీఎస్, డీజీపీ ఢిల్లీకి వెళ్లి వివరణ ఇచ్చారు. ఆ తరువాత హింసాత్మక సంఘటనలపై సిట్ ఏర్పాటు చేసి, దర్యాప్తు అనంతరం నివేదికను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Tags

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×