EPAPER

TS E-CET Results: తెలంగాణ E-CET ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!

TS E-CET Results: తెలంగాణ E-CET ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!

TS E-CET Results Released: తెలంగాణ E-CET ఫలితాలు విడుదలయ్యాయి. విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను https://ecet.tsche.ac.in/ అఫీషియల్ వెబ్ సైట్ కు వెళ్లి చూసుకోవచ్చు. హోం పేజీలో ECET Results 2024పై క్లిక్ చేస్తే.. లాగిన్ పేజ్ వస్తుంది. అక్కడ మీ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ర్యాంకు ఆధారంగా విద్యార్థులకు ఎంపిక చేయబడిన కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.


పాలిటెక్నిక్ డిప్లమో, బీఎస్సీ (Maths) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీ ఫార్మసీ సెకండియర్లో ప్రవేశాలకు మే 6వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో E-CET పరీక్ష నిర్వహించారు. టీఎస్ ఈసెట్ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 99 కేంద్రాల్లో నిర్వహించగా.. 24,272 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. మొత్తం 200 మార్కులకు ఆన్ లైన్ విధానంలో.. బీటెక్, ఫార్మసీ, బీఎస్సీ మ్యాథ్స్ విభాగాలకు వేర్వేరుగా రాతపరీక్షలు జరిగాయి.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏం జరుగుతోంది..? స్పీడ్ తగ్గిందా..?


కాగా.. నేడు తెలంగాణలో టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి జూన్ 2 వరకూ టెట్ పరీక్షలు జరగనుండగా.. మొదటి పేపర్ కు 99,958 మంది, రెండో పేపర్ కు 1,86,428 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకూ ఒక పరీక్ష పూర్తవ్వగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకూ రెండో పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 80 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×