EPAPER

Abhishek Breaks Virat Record: అభిషేక్ దూకుడు.. బద్దలైన కోహ్లి రికార్డు.. రానున్న రోజుల్లో..

Abhishek Breaks Virat Record: అభిషేక్ దూకుడు.. బద్దలైన కోహ్లి రికార్డు.. రానున్న రోజుల్లో..

Abhishek Sharma Breaks Virat Kohli’ s Sixes Record in IPL 2024: ఐపీఎల్ 2024లో ఈసారి బలంగా వినిపించిన పేరు అభిషేక్‌శర్మ. ఎడమచేతి ఆటగాడైన అభిషేక్ దూకుడు చూసి టీమిండియాకు ఆశాకిరణంగా భావిస్తున్నారు క్రికెట్ లవర్స్. ఈ ఆటగాడు ఆడే తీరు, కొట్టే షాట్స్ చూస్తుంటే యువరాజ్‌సింగ్‌ను గుర్తుకు తెస్తున్నారు.


తాజాగా హైదరాబాద్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు ఈ ఆటగాడు. ఓపెనర్‌గా హెడ్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్‌లు ఆడేశాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై 66 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేశాడు. అంతేకాదు ఈ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు ఆటగాడిగా రికార్డుల కెక్కాడు. సిక్స్‌ల విషయంలో సీనియర్ ఆటగాడు కోహ్లి రికార్డును బద్దలుకొట్టేశాడు కూడా. 2016లో 38 సిక్స్‌లు కొట్టాడు కోహ్లి, దాన్ని అధిగమించాడు అభిషేక్. ప్రస్తుత సీజన్ కోహ్లి 37 సిక్స్‌లు మాత్రమే కొట్టాడు.

ఈ మధ్యకాలంలో కోహ్లి ఆటతీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మాజీ ఆటగాళ్లు సైతం కోహ్లి ఆటతీరు బాగాలేదని చెప్పకనే చెబుతున్నారు. వన్డేల మాదిరిగా టీ-20 ఆడుతున్నాడని దుమ్మెత్తి పోస్తున్నారు. మునుపటి మెరుపులు ఆయనలో కనిపించలేవన్నది బలంగా వినిపిస్తున్నమాట. జట్టును నడిపించాల్సిందిపోయి, తను 20 ఓవర్లు క్రీజ్‌లో ఉండడం సరికాదని అంటున్నారు. దీనివల్ల బెంగుళూరు జట్టు నుంచి తప్పుకున్న ఆటగాళ్లు వేరే జట్లలో రాణిస్తున్నారని గుర్తు చేస్తున్నారు క్రికెట్ లవర్స్.


Also Read: KKR Vs SRH Qualifier-1: ఐపీఎల్‌లో ఆసక్తి సమరం.. రికార్డుల పరంగా ఆ జట్టుకే ఎక్కువ అవకాశం.. కానీ ఓడిన మరో ఛాన్స్!

అటు అభిషేక్, ఇటు కోహ్లి ఆడుతున్న టీమ్‌లు క్వాలిఫయర్ రౌండ్స్‌కు అర్హత సాధించాయి. టోర్నీ ముగిసే నాటికి ఎవరు ఎక్కువ సిక్స్‌లు కొడతారనేది ఆసక్తికరంగా మారింది. కోహ్లికి ఆ ఛాన్స్ లేదంటున్నారు. కొద్దిరోజుల్లో టీ-20 వరల్డ్‌కప్ కోసం వెస్టిండీస్‌కు వెళ్లబోతున్నాడు. ఈ లెక్కన అభిషేక్‌శర్మ రికార్డ్ కంటిన్యూ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ టోర్నీలో అత్యధిక సిక్స్‌లు (160) కొట్టిన జట్టగా హైదరాబాద్ టీమ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. దాని తర్వాత బెంగుళూరు (157), ఢిల్లీ (135), ముంబై(133), కోల్‌కతా(125) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

23 ఏళ్ల శర్మ, టీమిండియాలో ఉన్న యువ ఆటగాళ్లకు జైశ్వాల్, శివమ్‌దూబేకు పోటీగా మారాడు. అభిషేక్ ఆడుతున్న శైలిని గమనించినవాళ్లు మాత్రం యువరాజ్‌సింగ్‌ను గుర్తుకు తెస్తున్నారు. ఇదే దూకుడు శర్మ కొనసాగిస్తే టీమిండియా జట్టులో చోటు ఖాయమని అంటున్నారు. సీనియర్ ఆటగాడిపై వేటు ఖాయమనే వాదన కూడా లేకపోలేదు. తనకు మంచి రోజులు వస్తాయని మనసులోని మాటను బయటపెట్టాడు అభిషేక్‌శర్మ. ముఖ్యంగా బ్రియాన్‌లారా సలహాలు వర్కవుట్ అవుతున్నాయని తెలిపాడు. గతంతో పోల్చితే తన ఆట తీరు మెరుగైందని అంటున్నాడు. మొత్తానికి శర్మ ఇదే దూకుడు కొనసాగిస్తే టీమిండియాలో ప్లేస్ దక్కించుకోవడం ఖాయం.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×