EPAPER

Singapore Airlines: రికార్డు స్థాయిలో లాభాలు.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..!

Singapore Airlines: రికార్డు స్థాయిలో లాభాలు.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..!

Singapore Airlines gives 8 Months Salary as a Bonus: సింగపూర్ ఎయిర్ లైన్స్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆశించిన దాని కంటే అధిక లాభాలు రావడంతో ఎనిమిది నెలల జీతానికి సమానమైన మొత్తాన్ని బోనస్ గా ఇవ్వాలని నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగపూర్ ఎయిర్ లైన్స్ రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించింది. 1.98 బిలియన్ డాలర్ల నికర లాభం వచ్చినట్లు సంస్థ పేర్కొంది.


సింగపూర్ ఎయిర్ లైన్స్ కు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని ఉద్యోగులకు బోనస్ రూపంలో చెల్లించనున్నట్లు సంస్థ ప్రకటించింది. కరోనా వల్ల మూతపడిన చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ సరిహద్దులు ఏడాది క్రితం తెరుచుకోవడంతో లాభాలు సాధ్యమయ్యాయని ఎయిర్ లైన్స్ ఆర్థిక నివేదిక వెల్లడించింది. ఏడాది మొత్తం విమాన ప్రయాణాలకు డిమాండ్ ఏర్పడిందని పేర్కొంది.

గతేడాది ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా ది స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్ లైన్స్ అవార్డును సింగపూర్ ఎయిర్ వేస్ సొంతం చేసుకుంది. 23 ఏళ్లలో సింగపూర్ ఈ పురస్కారాన్ని గెలుచుకోవడం ఇది ఆరో సారి. ఉద్యోగుల కృషి ఫలితంగానే అవార్డు దక్కిందని సింగపూర్ ఎయిర్ లైన్స్ సీఈఓ గో చూన్ ఫాంగ్ తెలిపారు.


Also Read: అదానీ గ్రూప్ రూ.80వేల కోట్ల పెట్టుబడులు.. ఆ రెండు రంగాలపై ఫోకస్..!

ఎయిర్ ట్రావెల్స్ లో పుంజుకోవడానికి అవార్డు ఎంతగానో సహాయపడుతుందని చెప్పారు. ఎమిరేట్స్ గ్రూప్ కూడా తమ ఉద్యోగులకు 20 వారాల జీతాన్ని బోనస్ గా ప్రకటించింది. మే నెల జీతాల్లో ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్ధాయిలో లాభాలు ఆర్జించినట్లు ప్రకటించింది.

Tags

Related News

Dussehra : దసరా బోనస్​ వచ్చిందా? – ఇలా చేస్తే మరింత ఎక్కువ సంపాదించొచ్చు!

Railways New Service: ఒకే టికెట్ తో 56 రోజుల ప్రయాణం- దేశం అంతా చుట్టేయొచ్చు, ధర కూడా తక్కువేనండోయ్!

Ratan Tata Successor: రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడెవరు? పోటీలో ఉన్న ముగ్గురి ప్రత్యేకత ఇదే!

Airtel Acquire TATA Play: టాటా ప్లే కొనుగోలు చేసే యోచనలో ఎయిర్ టెల్.. డిటిహెచ్ రంగంలో విప్లవమే..

EPFO monthly pension: నెలజీతం రూ.15000 ఉన్నా.. పెన్షన్ రూ.10000 పొందొచ్చు.. ఎలాగంటే..

Railway Rules: పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకుంటే ట్రైన్ లో బెర్త్ ఇస్తారా? ఏ వయసు వరకు ఫ్రీగా జర్నీ చెయ్యొచ్చు?

Railway Rules: మీ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా ఏసీలో వెళ్లొచ్చు, ఎలాగో తెలుసా?

Big Stories

×