EPAPER

Iran President Helicopter Crash: కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్

Iran President Helicopter Crash: కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్

Iran President Ebrahim Raisi Helicopter Crashed: ఇరాన్ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్ లోని ఓ హెలికాప్టర్ అనుమానాస్పద స్థితిలో కుప్పకూలినట్లు తెలుస్తోంది. రాజధాని టెహ్రాన్ కు 600 కిలో మీటర్ల దూరంలో ఉన్న తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్ లోని జోల్ఫా నగరం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించినట్లు సమాచారం.


ఆ సమయంలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తోపాటు కాన్వాయ్ లో ఇంకో రెండు హెలికాప్టర్లు ఉన్నట్లు పేర్కొన్నదని, ఘటనా స్థలికి చేరుకునేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, అయితే, ప్రస్తుతం అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదని తెలుస్తోంది. ఇరాన్ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్ లోని హెలికాప్టర్ అనుమానాస్పద స్థితిలో కుప్పకూలిన విషయం తెలియడంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎలా ఆ ప్రమాదం చోటు చేసుకుంది…? ఎక్కడికి వెళ్తుంటే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇబ్రహీం రైసీ క్షేమంగా ఉన్నారా..? సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయా లేదా ? అని ఆరా తీస్తున్నాయి.

అయితే, ఇరాన్ అధ్యక్షుడితోపాటు విదేశాంగ మంత్రి హోసేన్ అమిరాబ్దోల్లాహియన్, తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ తోపాటు పలువురు అధికారులు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే రాలేదని తెలుస్తోంది. హెలికాప్టర్ కుప్పకూలిందన్న విషయం తెలుసుకున్న రెస్క్యూ టీమ్స్ ఘటనాస్థలికి బయల్దేరి వెళ్లాయని, వర్షం కారణంగా అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని, పూర్తిగా దట్టంగా పొగమంచు కారణంగా ఈ ఘటన జరిగి ఉండొచ్చని పేర్కొన్నట్లు సమాచారం.


Also Read: ఆకాశంలో అద్భుతం.. భూమిపైకి దూసుకొచ్చిన ఉల్క

అయితే, వార్త తెలియగానే ఘటనా స్థలికి చేరుకునేందుకు హుటాహుటిన సహాయక బృందాలు, ఎయిర్ అంబులెన్సులను పంపారని, కానీ, వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకోలేకపోతున్నాయని, పరిస్థితి కష్టంగా ఉందని అధికారులు తెలుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆదివారం అజర్ బైజాన్ పర్యటనకు వెళ్లారు. అరస్ నదిపై ఇరాన్ దేశం, అజర్ బైజాన్ దేశం.. ఈ రెండు దేశాలు కలిసి ఓ డ్యామ్ ను నిర్మించాయి. అయితే, నిర్మించినటువంటి ఆ డ్యామ్ ను అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియేవ్ తో కలిసి ప్రారంభించేందుకు ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లారు. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Iran Helicopter Crash: ఇరాన్ నూతన అధ్యక్షుడిగా ఎవరయ్యారంటే..?

ఈ ప్రమాదం చోటు చేసుకోవటంతో ఇరాన్ లో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు ఏర్పడ్డాయి. అధ్యక్షుడు సురక్షితంగా దేశానికి చేరుకోవాలని అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పరిస్థితి ఎలా ఉంది..? ఆయన ప్రాణాలతోనే ఉన్నారా..? అసలు ఏం జరిగింది.. ? హెలికాప్టర్ ప్రమాదానికి గురవడానికి కారణాలు ఏంటి? అంటూ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ప్రమాదం నుంచి బయటపడి క్షేమంగా దేశం చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాయి.

Tags

Related News

Iran Warns Gulf Countries: ‘ఇజ్రాయెల్ కు సాయం చేయొద్దు.. లేకపోతే’.. అరబ్బు దేశాలకు ఇరాన్ గట్టి వార్నింగ్

Sahara Desert Floods: ఎడారిలో వరదలు.. ఒక్కరోజులో 100mm భారీ వర్షంతో రికార్డ్!

PM Modi ASEAN SUMMIT: ‘వ్యాపారమే కాదు ఆర్థిక, సామాజిక అవసరాల్లో సహకారం కావాలి’.. ఆసియా దేశాలతో ప్రధాని మోదీ

Trump Biopic: థియేటర్లలోకి ‘ది అప్రెంటీస్’, ట్రంప్ కు ఎదురు దెబ్బ తప్పదా?

PM MODI East Asia Summit: ‘యుద్ధాలతో గ్లోబల్ సౌత్ దేశాలకు నష్టం ‘.. లావోస్ లో ప్రధాని మోదీ!

20 Killed in Balochistan: పాకిస్తాన్ లో దారుణం.. బొగ్గుగనిలో 20 మంది హత్య!

Israel Hits UN Base: లెబనాన్ ఐరాస కేంద్రంపై దాడి చేసిన ఇజ్రాయెల్.. ఖండించిన ప్రపంచ దేశాలు

Big Stories

×