EPAPER

SRH Won by 4 Wickets: పంజాబ్‌పై SRH ఘన విజయం.. ప్లే ఆఫ్స్ చేరిన హైదరాబాద్ టీం

SRH Won by 4 Wickets: పంజాబ్‌పై SRH ఘన విజయం.. ప్లే ఆఫ్స్ చేరిన హైదరాబాద్ టీం

IPL 2024 69th Match – Sunrisers Hyderabad Won By 4 Wickets: ఐపీఎల్ 17వ సీజన్ లో మంచి ప్రదర్శన కనబరుస్తూ ప్లే ఆఫ్స్ చేరుకున్న హైదరాబాద్ లీగ్ దశలోని ఆఖరి మ్యాచ్ లోనూ అదరగొట్టింది. పంజాబ్ పై 4 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 215 పరుగల లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.


అయితే, టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకున్నది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించారు. మొత్తం 19.1 ఓవర్లలో పంజాబ్ పై సన్ రైజర్స్ విజయం సాధించింది. సొంత మైదానంలో పంజాబ్ తో తలపడి విజయం సాధించడంతో సన్ రైజర్స్ టీమ్ సభ్యులు ఆనందంతో ఎగిరిగంతేస్తున్నారు.

అయితే, బౌలింగ్ లో కొంత విఫలమైనా, ఎదుట కొండంత లక్ష్యమున్నా సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ మాత్రం బెదరకుండా విజయం సాధించింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో పోరాడి 4 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం సాధించింది. అయితే, ఈ భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్ గా రంగంలోకి దిగిన క్రికెటర్ ట్రావిడ్ హెడ్ మొదటి బంతికే డకౌటయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ భారీ స్కోర్ చేసి పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 28 బంతుల్లో 66 పరుగులు తీశాడు. 6 సిక్స్ లు, 5 ఫోర్లు తీశాడు. అభిషేక్ శర్మకు తోడుగా మరో క్రికెటర్ రాహుల్ త్రిపాఠి 33 పరుగులు తీశాడు. నితీశ్ కుమార్ రెడ్డి 37 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 42 పరుగులు, సమద్ 11 పరుగులు, శాన్వీర్ 6 పరుగులు, షాబాజ్ 3 పరుగులు తీశాడు. ఇలా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ క్రికెటర్లు హుషారుగా పరుగులు తీసి సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్ ను ఓడించారు. కాగా, ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.


Also Read: ధోని 110 మీటర్ల సిక్స్.. చెన్నై కొంప ముంచిందా..?

ఇటు పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు కూడా మెరుపు స్కోర్లు చేసి పంజా విసిరారు. ప్రభ్ సిమ్రన్ సింగ్ 45 బంతుల్లో 71 పరుగులు తీశాడు. 4 సిక్స్ లు, 7 ఫోర్లు కొట్టాడు. అథర్వ 46 పరుగులు తీశాడు. రిలీ రొసో 49 పరుగులు తీశాడు. అయితే, వీరిద్దరికి కూడా తృటిలో అర్థ సెంచరీ మిస్సయ్యింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు తీశారు.

ఎవరెవరెరూ ఎన్ని పరుగులు తీశారంటే..

అభిషేక్ శర్మ – 66 పరుగులు – 28 బంతుల్లో 6 సిక్స్ లు, 5 ఫోర్లు

రాహుల్ త్రిఫాఠి – 33 పరుగులు – 18 బంతుల్లో 2 సిక్స్ లు, 4 ఫోర్లు

నితీశ్ రెడ్డి – 37 పరుగులు – 25 బంతుల్లో 3 సిక్స్ లు, 1 ఫోర్

హెన్రిచ్ క్లాసెన్ – 42 పరుగులు – 26 బంతుల్లో 2 సిక్స్ లు, 3 ఫోర్లు

ఇటు పంజాబర్ బౌలర్లు.. హర్షల్ పటేల్, అర్ష్ దీప్ 2 వికెట్లు తీయగా, శశాంక్ సింగ్, హర్ ప్రీత్ బ్రార్ తలో వికెట్ తీశారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు… నటరాజన్ రెండు వికెట్లు, కమిన్స్, నితీశ్ చెరో వికెట్ తీశారు.

Tags

Related News

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

Big Stories

×